తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 First Song Promo: పుష్ప 2 తొలి పాట ప్రోమో వచ్చేసింది.. మాస్ బీట్‍తో.. ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

Pushpa 2 First Song Promo: పుష్ప 2 తొలి పాట ప్రోమో వచ్చేసింది.. మాస్ బీట్‍తో.. ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

24 April 2024, 16:13 IST

    • Pushpa 2 The Rule First Song: పుష్ప 2: ది రూల్ సినిమా నుంచి మొదటి పాట ప్రోమో వచ్చేసింది. ‘పుష్ప.. పుష్ప’ అంటూ మాస్ బీట్‍తో ఉంది. ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్, టైమ్‍ను కూడా మూవీ టీమ్ ఖరారు చేసింది. 
Pushpa 2 First Song Promo: పుష్ప తొలి పాట ప్రోమో వచ్చేసింది
Pushpa 2 First Song Promo: పుష్ప తొలి పాట ప్రోమో వచ్చేసింది

Pushpa 2 First Song Promo: పుష్ప తొలి పాట ప్రోమో వచ్చేసింది

Pushpa 2 First Single Promo: సినీ ప్రేక్షకులు అత్యధికంగా ఎదురుచూస్తున్న సినిమాగా ‘పుష్ప 2: ది రైజ్’ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా రేంజ్‍లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్ మూవీ నుంచి ఇటీవల టీజర్ రాగా.. అందరినీ మెప్పించింది. పుష్పతో మూడేళ్ల క్రితం దేశాన్ని ఊపేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు దాని సీక్వెల్‍తో అంతకు మించి బాక్సాఫీస్‍ను షేక్ చేస్తాడనే హైప్ ఉంది. ఈ మూవీ నుంచి వచ్చే ప్రతీ అప్‍డేట్ క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఈ క్రమంలో ‘పుష్ప 2: ది రూల్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో నేడు (ఏప్రిల్ 24) రిలీజ్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Yodha OTT: ఎట్టకేలకు ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్.. కానీ, అదొక్కటే మైనస్.. ఎక్కడ చూడాలంటే?

Aa Okkati Adakku OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి అల్ల‌రి న‌రేష్ కామెడీ మూవీ - ఆ ఒక్క‌టి అడ‌క్కు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Krishna mukunda murari: ఊహించని నిర్ణయం తీసుకున్న కృష్ణ.. ముకుంద ప్రెగ్నెంట్ అనే విషయం అమృత బయటపెడుతుందా?

Mr Idiot: హీరోగా రవితేజ వారుసుడు ఎంట్రీ.. మిస్టర్ ఇడియట్ టీజర్ రిలీజ్

సాంగ్ ప్రోమో ఇలా..

పుష్ప.. పుష్ప అంటూ ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రానుంది. ఈ సాంగ్ ప్రోమో నేడు వచ్చింది. పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్ అంటూ ప్రోమోలో ఉంది. ఈ సాంగ్ కచ్చితంగా మాస్ బీట్‍తో ఉంటుందని అర్థమవుతోంది. ఉంగరాలు ఉన్న అల్లు అర్జున్ చేతిని ఈ ప్రోమోలో హైలైట్ చేసింది మూవీ టీమ్.

ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్, టైమ్

'పుష్ప 2: ది రూల్' నుంచి ఈ ఫస్ట్ సాంగ్ మే 1వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ కానుంది. పుష్ప 2 చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప 1లో పాటలు సూపర్ హిట్ కాగా.. దానికి మించి ఈ సీక్వెల్‍లో ఉండేలా ప్లాన్ చేశారు. తొలి పాటనే ఫుల్ మాస్ బీట్‍తో తెచ్చేందుకు రెడీ అయ్యారు.

“ఒకే పేరు అంతటా వినిపిస్తుంది. పుష్ప.. పుష్ప లిరికల్ ప్రోమో వచ్చింది. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ మే 1వ తేదీ ఉదయం 11 గంటల 7 నిమిషాలకు వస్తుంది” అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.

పుష్ప 2: ది రూల్ చిత్రం ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతుంది. ఇప్పటికే ఫుల్ క్రేజ్ ఉన్న ఈ మూవీకి మరింత హైప్ తెచ్చేలా ఇప్పటి నుంచే మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. అందుకే అప్పుడే ఫస్ట్ సాంగ్ తెచ్చేస్తోంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ చిత్రం నుంచి టీజర్ వచ్చింది. మే 1వ తేదీన ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది.

పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఎస్‍పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. జగదీశ్ ప్రతాప్ భండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. పుష్పతో పోలిస్తే అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్సులతో తెరకెక్కిస్తున్నారు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

రికార్డు స్థాయిలో బిజినెస్

పుష్ప 2: ది రూల్ సినిమకు కళ్లు చెదిరే ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.200 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో బాలీవుడ్ సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి.. నార్త్ ఇండియా బిజినెస్ విషయంలో పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల థియేట్రికల్ హక్కులు సుమారు రూ.270 కోట్లకు అమ్ముడవుతాయని అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఏకంగా రూ.275 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇలా.. అన్ని విషయాల్లో ప్రీ-రిలీజ్ బిజినెస్‍లో పుష్ప 2 రికార్డుల హవా చూపిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం