Puri Jagannadh: రోడ్డు మీదున్న, రూపాయి లేకున్నా అలా చేయాల్సిన అవసరం లేదు.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కామెంట్స్
12 August 2024, 6:35 IST
Puri Jagannadh In Double Ismart Pre Release Event: డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని హీరోగా చేసిన డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రోడ్డు మీదున్న, రూపాయి లేకున్నా అలా చేయాల్సిన అవసరం లేదు.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కామెంట్స్
Puri Jagannadh In Double Ismart Pre Release Event: ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీగా వస్తోంది 'డబుల్ ఇస్మార్ట్'. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా.
డబుల్ ఇస్మార్ట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో వరంగల్‌లో డబుల్ ఇస్మార్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో పాటు నిర్మాత ఛార్మి, హీరో రామ్ పోతినేని, హీరోయిన్ కావ్య థాపర్, ఇతర నటీనటులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ ఆసక్తికర సినీ విశేషాలు చెప్పారు.
డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. "హాయ్ ఎవ్రీ వన్. మీరు ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ అవ్వవ్. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. డబుల్ ఇస్మార్ట్ గురించి మాట్లాడాలంటే ఒకే ఒక పేరు.. రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్.. రామ్ పోతినేని ఎనర్జీ" అని అన్నారు.
"రామ్‌ని సెట్స్‌లో చూసిననప్పుడు తనలో కసి కనిపిస్తుంటుంది. అది నన్ను చాలా ఎగ్జయిట్ చేస్తుంది. తన క్యారెక్టర్, హెయిర్ స్టయిల్, నడక, స్లాంగ్.. ఇవన్నీ తను పెర్ఫార్మ్ చేయడం వలనే అవుతుంది. తను వెరీ గుడ్ యాక్టర్, డ్యాన్సర్. రామ్ పోతినేని లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. థాంక్ యూ రామ్" అని పూరి జగన్నాథ్ చెప్పారు.
"సంజు బాబాకి నేను పెద్ద ఫ్యాన్‌ని. 150 సినిమాల హీరో ఆయన. ఈ సినిమాలో ఆయన చేయడం కొత్త కలర్ తీసుకొచ్చింది. కావ్య చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. రామ్ పక్కన అద్భుతంగా డ్యాన్స్ చేసింది. తెలుగులో నేర్చుకొని డబ్బింగ్ చెప్పింది. అలీ గారి గురించి ఎక్కువ చెప్పను. ఇందులో అలీ, అలీగారి ట్రాక్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో పని చేసిన యాక్టర్స్‌కి, టెక్నిషియన్స్‌కి థాంక్స్" అని పూరి తెలిపారు.
"ఛార్మి కౌర్ మా కంపెనీ స్ట్రెంత్. ఏదైనా పని చెబితే చేసుకొస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఫిలిం మేకింగ్‌లో చాలా హార్డ్ టైమ్స్ ఉంటాయి. అన్నీట్లో తను నిల్చుంది. విష్ రెడ్డి (పూరి కనెక్ట్స్ సీఈవో) ఛార్మి వెనుక నిల్చుంటాడు. విష్ మా పిల్లర్. నా దగ్గర రూపాయి లేకపోయినా రోడ్డుమీద ఉన్నా నేను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నా వెనుక విషు నిల్చొని ఉంటాడు. థాంక్ యూ విషు" అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.
టాపిక్