తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Priyadarshi: వందలో 4 సినిమాలు మాత్రమే అలా ఉన్నాయి.. హీరో ప్రియదర్శి కామెంట్స్

Priyadarshi: వందలో 4 సినిమాలు మాత్రమే అలా ఉన్నాయి.. హీరో ప్రియదర్శి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

19 July 2024, 7:09 IST

google News
  • Priyadarshi About Darling Movie: ప్రియదర్శి హీరోగా నటించిన మరో సినిమా డార్లింగ్. నభా నటేష్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రియదర్శి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఏడాదికి వంద సినిమాలు వస్తుంటే కేవలం నాలుగు మాత్రమే అలా ఉన్నాయని చెప్పారు.

వందలో 4 సినిమాలు మాత్రమే అలా ఉన్నాయి.. హీరో ప్రియదర్శి కామెంట్స్
వందలో 4 సినిమాలు మాత్రమే అలా ఉన్నాయి.. హీరో ప్రియదర్శి కామెంట్స్

వందలో 4 సినిమాలు మాత్రమే అలా ఉన్నాయి.. హీరో ప్రియదర్శి కామెంట్స్

Priyadarshi About Telugu Movies: ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ 'డార్లింగ్'. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించారు. ఇవాళ (జూలై 19) విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో పలు ఆసక్తికర విశేషాలు చెప్పారు హీరో ప్రియదర్శి.

కమెడియన్‌గా మొదలై సీరియస్ కథలు చేస్తూ డార్లింగ్‌తో లవర్ బాయ్‌గా వస్తున్నారు. ఎలా అనిపిస్తోంది?

-ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కంటెంట్‌కి మంచి రోజులు వచ్చాయని భావిస్తాను. కొత్త కథలు, వినూత్నమైన ఆలోచనలని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మల్లేశం, బలగం, సేవ్ ది టైగర్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే.. ఫ్యామిలీ డ్రామాకి ఎప్పుడూ స్పేస్ ఉందని నిరూపించాయి. ఫ్యామిలీ డ్రామాలు ఇండియన్ సొసైటీలో ఎవర్ గ్రీన్. నటుడిగా నేర్చుకోవడానికి ఎంతో అవకాశం దొరుకుతుంది. రిలేట్ చేసుకునే కథలు చెప్పడంలో మజా వేరుగా ఉంటుంది.

కంటెంట్ పిక్ చేయడానికి మీకు టీం ఉందా?

-లేదండీ. స్క్రిప్ట్ ఛాయిస్ నాదే. స్క్రిప్ట్ క్లియర్‌గా చదుతాను. కొన్నిసార్లు డౌట్స్ ఉన్నప్పుడు రాహుల్, విష్ణు, నా మెంటర్ సీతారామ్‌తో చర్చిస్తాను. సీతారామ్ డార్లింగ్‌కి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా చేశారు.

నభా నటేష్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

-నభా నటేష్ లాంటి యాక్టర్‌తో నేనెప్పుడూ పని చేయలేదు. నాలాంటి యాక్టర్‌తో తనూ ఎప్పుడూ వర్క్ చేయలేదు. మా ఇద్దరి పెయిరింగ్ చాలా ఫ్రెష్‌గా ఉందని చాలా మంది అన్నారు. ఆనంద్ సామి అనే యాక్టింగ్ ట్రైనర్‌తో ఒక వర్క్ షాప్ చేశాం. 15 రోజుల పాటు ప్రతిరోజు స్కూల్‌కి వెళ్లి నేర్చుకున్నట్లుగా మంచి ఎక్స్‌పీరియన్స్ అది. ఇందులో నా క్యారెక్టర్, నభా క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌‌లో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

-మేము కథ తీసుకువెళ్లే సమయంలో హనుమాన్ ప్రోమో బయటికి వచ్చింది. డార్లింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి హనుమాన్ ఫుల్ పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది. డార్లింగ్‌ని చేయాలనే నిర్ణయం ముందే తీసుకున్నారు. నిరంజన్ గారు, చైతన్య గారు ట్రూ డార్లింగ్స్. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

ఆడియన్స్‌ని థియేటర్స్‌లో రప్పించడానికి డార్లింగ్‌లో ఎలాంటి అంశాలు ఉన్నాయి?

-ఏడాదికి వంద సినిమాలు వస్తే థియేటర్స్‌లో చూసి గుర్తు పెట్టుకుని నవ్వుకునే సినిమాలు నాలుగు ఉన్నాయి. డార్లింగ్ కూడా అలా గుర్తు పెట్టుకొని నవ్వుకునే సినిమా అవుతుంది. డార్లింగ్‌లో కావల్సినంత కామెడీ ఉంది. మంచి మ్యూజిక్ ఉంది. డార్లింగ్ తప్పకుండా ఆడియన్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. దిన్ని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ థియేటర్స్‌కి రావాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ అశ్విన్ రామ్ గురించి?

-సందీప్ కిషన్ 'ఏ వన్ ఎక్స్ ప్రెస్' షూటింగ్ సమయంలో ఫస్ట్ టైం అశ్విన్‌ని కలిశాను. తను ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. అశ్విన్ మంచి లీడర్ షిప్ క్యాలిటీస్, కమ్యునికేషన్ స్కిల్, క్లియర్ విజన్ ఉన్న దర్శకుడు. రానున్న రోజుల్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం