Telugu Comedy Movie: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న తెలుగు కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?
17 June 2024, 11:30 IST
Telugu Comedy Movie:బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తోన్న వీరాంజనేయులు విహార యాత్ర మూవీ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో సీనియర్ నరేష్, రాగ్‌మయూర్, ప్రియా వడ్లమాని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
బ్రహ్మానందం
Telugu Comedy Movie: బ్రహ్మానందం, సీనియర్ నరేష్ ప్రధాన పాత్రల్లో తెలుగులో వీరాంజనేయులు విహారయాత్ర పేరుతో ఓ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. థియేటర్లను స్కిప్ చేస్తూ ఈ కామెడీ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ ప్రకటించింది.
గోవా ట్రిప్...
ఎప్పుడు గొడవలు పడే ఓ ఫ్యామిలీ పాతకాలం నాటి వ్యాన్‌లో గోవా వెళ్లాలని ఎందుకున్నారు? ఈ జర్నీలో వారికి ఎదురైన పరిణామాలతో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా వీరాంజనేయులు విహారయాత్ర మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఈ సినిమాకు సుధీర్ పుల్లట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. కీడాకోలా ఫేమ్ రాగ్‌మయూర్, ప్రియావడ్లమాని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు
హ్యాపీ హోమ్ వాట్సప్ గ్రూప్...
వీరాంజనేయులు విహారయాత్రలోని క్యారెక్టర్స్‌ను ఫాదర్స్ డే రోజు ఫన్నీ వీడియో ద్వారా డిఫరెంట్‌గా ఆడియెన్స్‌కు ఈటీవీ విన్ పరిచయం చేసింది. హ్యాపీ హోమ్ పేరుతో ఓ వాట్సప్ గ్రూప్ ఓపెన్ చేసినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.
నాగేశ్వరరావు...
ఇందులో ఫాదర్స్ డే విషెస్ విషయంలో ఒకరికొకరు గొడవలు పడినట్లుగా చూపించారు. తండ్రి తనకు స్వేచ్ఛనిచ్చి పాడుచేశాడని నరేష్ బాధపడుతోండగా..నువ్వు మాత్రం నాపై అంక్షలు విధించి కలలు నెరవేరకుండా చేశావని నరేష్‌పై రాగ్‌మయూర్ కొప్పడుతున్నట్లుగా చూపించారు. ఈ మూవీలో నాగేశ్వరరావు పాత్రలో సీనియర్ నరేష్, వీరు పాత్రలో రాగ్‌మయూర్...ప్రియగా ప్రియా వడ్లమాని కనిపించబోతున్నారు.
వీరాంజనేయులు విహారయాత్రలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఏమిటన్నది మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు.ఆయన పాత్ర సినిమాలో సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతున్నట్లు సమాచారం.కీడాకోలా తర్వాత బ్రహ్మానందం, రాగ్‌మయూర్ కలిసి చేస్తోన్న మూవీ ఇది. ఈ సినిమాకు ఆర్‌హెచ్ విక్రమ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.
రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్...
టాలీవుడ్ బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరిగా నరేష్ కొనసాగుతోన్నాడు. సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు చేస్తోన్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్ గేమ్‌ఛేంజర్‌తో పాటు మరికొన్ని తెలుగు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడు. సినిమాల స్పీడును తగ్గించిన బ్రహ్మానందం గత ఏడాది రిలీజైన బ్రో, భోళాశంకర్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశాడు.
కీడాకోలాలో ఫుల్ లెంగ్త్ రోల్...
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన కీడాకోలా సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు బ్రహ్మానందం. ఇందులో వరద రాజులు అనే పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో అలరించారు బ్రహ్మానందం.హుషారు, ఆవిరి,ముఖచిత్రం, మను చరిత్ర తో పలు సినిమాల్లో కథానాయికగా కనిపించింది ప్రియా వడ్లమాని. లేటెస్ట్ కామెడీ బ్లాక్‌బస్టర్ మూవీ ఓం భీమ్‌బుష్‌లో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది
టాపిక్