Prabhas |హాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్
02 June 2022, 19:28 IST
బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ మారిపోయారు. ఈ సినిమాతో విదేశాల్లో అతడికి మంచి గుర్తింపు లభించింది. తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం హాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్నది. రామాయణ గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
ప్రభాస్
కెరీర్‌లో ఎక్కువగా మాస్, యాక్షన్ సినిమాల్లోనే కనిపించారు ప్రభాస్. తన శైలికి భిన్నంగా తొలిసారి పౌరాణిక కథాంశంతోఆయన చేస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. అఫీషియల్‌గా బాలీవుడ్‌లో ప్రభాస్ చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో త్రీడీలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. గ్రాఫిక్స్ కు ప్రాధాన్యమున్న చిత్రం కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువగా సమయాన్ని తీసుకుంటున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈసినిమాను దక్షిణాది భాషల్లో విడుదలచేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం హాలీవుడ్‌లో ఆది పురుష్ రిలీజ్ కాబోతున్నట్లు తెలిసింది.
ఇంగ్లీష్ లో ఈ సినిమాను డబ్ చేయనున్నట్లు నిర్మాత భూషణ్ కుమార్ వెల్లడించారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథతో పాటు ప్రభాస్‌కు ఉన్న ఇమేజ్ దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను ఇంగ్లీష్‌లోకి అనువదిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 100 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో జానకి పాత్రలో కృతిసనన్ నటిస్తోంది. లంకేష్ అనే ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ షూటింగ్ తో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటుగా నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నారాయన.
టాపిక్