తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas | సలార్‌ టీమ్‌కు ప్రభాస్‌ నోరూరించే భోజనం.. లొట్టలేసుకుంటూ తిన్న శృతి

Prabhas | సలార్‌ టీమ్‌కు ప్రభాస్‌ నోరూరించే భోజనం.. లొట్టలేసుకుంటూ తిన్న శృతి

HT Telugu Desk HT Telugu

29 May 2022, 18:12 IST

    • Salaar టీమ్‌కు మరోసారి తన ఇంటి వంట రుచి చూపించాడు యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. ఆ వంటను లొట్టలేసుకుంటూ ఆవురావురుమంటూ తినేసింది శృతి హాసన్‌.
సలార్ సెట్ లో ప్రభాస్
సలార్ సెట్ లో ప్రభాస్ (Twitter)

సలార్ సెట్ లో ప్రభాస్

సలార్‌.. ఇప్పుడీ సినిమాపైనే అందరి దృష్టి. కేజీఎఫ్‌ 2, ట్రిపుల్‌ ఆర్‌ మూవీ తర్వాత ఎక్కువగా మాట్లాడుకుంటోంది ఈ సలార్‌ గురించే. కేజీఎఫ్‌లాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌, బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఊహించని విధంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్

Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

OTT Weekend Movies: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఈ సినిమాలు, వెబ్ సిరీస్‍ను మిస్ అవ్వొద్దు!

Furiosa A Mad Max Saga: మ్యాడ్‌మ్యాక్స్‌కు ప్రీక్వెల్ వ‌స్తోంది… 1400 కోట్ల విజువ‌ల్ వండ‌ర్‌ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

ఈ సినిమా ఈ మధ్యే హైదరాబాద్‌లో మిగిలిన షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్‌ తన ఇంటి వంటకాలతో యూనిట్‌ సభ్యులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశాడు. నోరూరించే వంటకాలు వాళ్లను కట్టి పడేశాయి. ఈ వంటకాలకు సంబంధించిన వీడియోను శృతి హాసన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది.

ఈ వీడియోలో ప్రభాస్‌కు శృతి థ్యాంక్స్‌ చెబుతుండగా.. అతడు ఒక్కో వంటకం గురించి చెప్పడం వినొచ్చు. ఇంతకుముందు కూడా సలార్‌ యూనిట్‌కు ప్రభాస్‌ తన ఇంటి వంట రుచి చూపించాడు. ఇక సినిమా విషయానికి వస్తే కేజీఎఫ్‌ను నిర్మించిన హోంబళె ఫిల్మ్సే ఈ సలార్‌ను కూడా నిర్మిస్తోంది. ఇందులో జగపతిబాబు, ఈశ్వరి రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

కొవిడ్‌ కారణంగా సలార్‌ షూటింగ్ చాలా ఆలస్యమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నా.. మరోసారి వాయిదా వేశారు. వచ్చే ఏడాది సెకండాఫ్‌లోగానీ సినిమా రిలీజ్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లోనూ సలార్‌ రిలీజ్‌ కానుంది. కేజీఎఫ్‌లో తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో అదరగొట్టిన రవి బస్రూర్‌ ఈ సలార్‌కు కూడా మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం