Ponniyin Selvan 2 Collections : పొన్నియిన్ సెల్వన్ 2 కలెక్షన్స్.. నాలుగు రోజుల్లో రూ.200 కోట్లు
02 May 2023, 12:34 IST
- Ponniyin Selvan 2 Collections : గతేడాది విడుదలైన 'పొన్నియిన్ సెల్వన్' చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. దీని సీక్వెల్ 'పొన్నియిన్ సెల్వన్ 2' ఇప్పుడు విడుదలైంది. కలెక్షన్లలో దూసుకెళ్తోంది.
పొన్నియిన్ సెల్వన్-2 కలెక్షన్లు
మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ 2(Ponniyin Selvan 2) ఏప్రిల్ 28న విడుదలైంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో మంచి వసూళ్లు రాబట్టింది. 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. మొదటి భాగం విజయవంతమైంది. దాని సీక్వెల్ కూడా విజయవంతంగా నడుస్తోంది. కథలో మొదటి భాగానికి, రెండో భాగానికి మధ్య కనెక్షన్ ఉంటే సినిమా హిట్ అవుతుంది. 'పొన్నియిన్ సెల్వన్ 2' విషయంలోనూ అదే జరిగింది .
గతేడాది విడుదలైన 'పొన్నియిన్ సెల్వన్'(Ponniyin Selvan) చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. దీని సీక్వెల్ 'పొన్నియిన్ సెల్వన్ 2' విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు(Cinema Collections) 200 ప్లస్ కోట్ల రూపాయలను దాటేసింది. దీంతో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది.
శుక్రవారం మొదటి రోజు క్రేజ్ తో సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. శని, ఆదివారాలు వారాంతపు రోజులు కావడంతో థియేటర్‌కి జనం వచ్చారు. దీనికి తోడు సోమవారం (మే 1) కార్మిక దినోత్సవానికి సెలవు. ఇది చిత్ర బృందానికి ఉపయోగపడింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్(Box Office) వద్ద భారీ ఎత్తున వసూళ్లను రాబట్టింది. మరి ఈరోజు (మే 2) ఈ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంది.
మణిరత్నం(Maniratnam) దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్(Aishwarya Rai), త్రిష(Trisha), ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ లాంటి భారీ తారాగణం ఇందులో నటించింది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahaman) సంగీతాన్ని సమకూర్చారు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది విడుదల కానుంది.
పొన్నియిన్ సెల్వన్ సినిమా మణిరత్నం కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఆయన కలల ప్రాజెక్టు. ప్రముఖ తమిళ రచయిత కల్కీ రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. 1980వ దశకం నుంచి ఈ చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనకున్న ఆయన.. ఆ కలను దాదాపు 40 ఏళ్ల తర్వాత నెరవేర్చుకున్నారు.