Vijay Telugu Remake Movies: దళపతి విజయ్ తమిళంలోకి రీమేక్ చేసిన తెలుగు సినిమాలు ఇవే - అందులో హిట్స్ ఎన్నంటే?
13 March 2024, 9:37 IST
Vijay Telugu Remake Movies: కెరీర్ ఆరంభంలో దళపతి విజయ్ రీమేక్ సినిమాల్లోనే ఎక్కువగా నటించాడు. తెలుగులో విజయవంతమైన పెళ్లి సందడి, పోకిరి, ఒక్కడుతో పాటు పలు టాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్‌ను తమిళంలో రీమేక్ చేశాడు. ఆ సినిమాలు ఏవంటే...
దళపతి విజయ్ రీమేక్ మూవీస్
Vijay Telugu Remake Movies: కెరీర్ ఆరంభంలో దళపతి విజయ్ రీమేక్ సినిమాల్లోనే ఎక్కువగా నటించాడు. తెలుగులో విజయవంతమైన పెళ్లి సందడి, పోకిరి, ఒక్కడుతో పాటు పలు టాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్‌ను తమిళంలో రీమేక్ చేశాడు. ఆ సినిమాలు ఏవంటే...
పెళ్లిసందడి
శ్రీకాంత్ హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన పెళ్లి సందడి తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను నినైతేన్ వందాయ్ పేరుతో తమిళంలో రీమేక్ చేశాడు విజయ్. తెలుగులో దీప్తి భట్నాగర్, రవళి హీరోయిన్లుగా నటించగా... కోలీవుడ్ రీమేక్‌లో రంభ, దేవయాని కథానాయికలుగా కనిపించారు. తమిళంలో ఈ మూవీని అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేశాడు. నినైతేన్ వందాయ్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
పవిత్ర బంధం...
వెంకటేష్ పవిత్ర బంధం సినిమాను తమిళంలోకి రీమేక్ చేసి దళపతి విజయ్ హిట్ అందుకున్నాడు. ప్రియమానవలే పేరుతో కోలీవుడ్‌లో పునర్మిర్మాణమైన ఈ మూవీలో సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది. ఈ తమిళ రీమేక్ ఫ్యామిలీ ఆడియెన్స్‌లో విజయ్ క్రేజ్‌ను పెంచింది. తమిళంలో విజయ్, స్నేహ హీరోహీరోయిన్లుగా నటించిన వసీగర భారీ అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో వంద రోజులను పూర్తిచేసుకున్నది. వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ ఆధారంగానే వసీగర మూవీ రూపొందడం గమనార్హం.
మహేష్ రెండు సినిమాలు...
మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన ఒక్కడు, పోకిరి సినిమాలు తమిళంలో రీమేకయ్యాయి. ఈ రెండు రీమేక్‌లలో దళపతి విజయ్ హీరోగా నటించడం గమనార్హం. ఒక్కడు మూవీ గిల్లీ పేరుతో తమిళంలో రీమేకై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. గిల్లీ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటించింది. తెలుగు వెర్షన్‌కు మించి గిల్లీ తమిళంలో వసూళ్లను రాబట్టడం గమనార్హం.
2004లో కోలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా గిల్లీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా విజయ్ కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా పేరు తెచ్చుకున్నది. ఇక పోకిరి సినిమా పొక్కిరి పేరుతో కోలీవుడ్‌లో రిలీజైంది. తమిళంలో 200 రోజులకు పైగా ఆడిన ఈ మూవీకి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. పొక్కిరిలో తమిళంలో కల్ట్ క్లాసిక్ మూవీగా పేరు తెచ్చుకున్నది.
కళ్యాణ్ రామ్ అతనొక్కడే...
కళ్యాణ్ రామ్ అతనొక్కడే(ఆథి), నాగార్జున ఆజాద్ (వేళాయుధం), చిరునవ్వుతో (యూత్) తమిళ రీమేక్‌లలో విజయ్ హీరోగా నటించాడు. అథి, యూత్ సినిమాలు ఫెయిలవ్వగా వేళాయుధం మాత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. విజయ్‌కి మాస్ ఆడియెన్స్‌ను క్రేజ్‌ను తీసుకొచ్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
నాన్బన్ (త్రీ ఇడియన్స్ రీమేక్) తర్వాత రీమేక్ కథలకు దూరంగా ఉండటం మొదలుపెట్టాడు విజయ్. నన్బన్ సినిమా స్నేహితులు పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది. త్రీ ఇడియట్స్ రీమేక్‌కు శంకర్ దర్శకత్వం వహించాడు. శంకర్ తన కెరీర్‌లో రీమేక్ చేసిన ఏకైక మూవీ కూడా ఇదే కావడం గమనార్హం.అంతే కాకుండా విజయ్ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులోనూ రీమేకయ్యాయి. సుస్వాగతం, శుభాకాంక్షలు, నువ్వు వస్తావని, ఖుషి సినిమాలు విజయ్ తమిళ సినిమాల ఆధారంగానే రూపొందాయి.