Vaazhai OTT Release: మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ ఇచ్చాడు - అయినా మారి సెల్వ‌రాజ్ నెక్స్ట్‌ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్-mari selvaraj vaazhai movie to directly release on disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vaazhai Ott Release: మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ ఇచ్చాడు - అయినా మారి సెల్వ‌రాజ్ నెక్స్ట్‌ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్

Vaazhai OTT Release: మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ ఇచ్చాడు - అయినా మారి సెల్వ‌రాజ్ నెక్స్ట్‌ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్

Nelki Naresh Kumar HT Telugu
Jan 02, 2024 09:18 AM IST

Vaazhai OTT Release: మామ‌న్న‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత డైరెక్ట‌ర్ మారి సెల్వ‌రాజ్ రూపొందిస్తోన్న వాజై మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌కానుంది.

వాజై మూవీ
వాజై మూవీ

Vaazhai OTT Release: త‌మిళంలో ఫెయిల్యూర్ లేని డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు మారి సెల్వ‌రాజ్‌. అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మామ‌న్న‌న్‌, క‌ర్ణ‌న్‌,తో పాటు పెరియారుమ్ పెరుమాల్ సినిమాలు కోలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచాయి.

స‌మాజంలో అణ‌గారిన వ‌ర్గాలు ఎదుర్కొంటున్న వివ‌క్ష‌, స‌మ‌స్య‌ల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కిన ఈ సినిమాలు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు అనేక అవార్డుల‌ను అందుకున్నాయి.

మామ‌న్న‌న్ స‌క్సెస్ త‌ర్వాత మారి సెల్వ‌రాజ్ వాజై అనే సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త‌న గ‌త సినిమాల త‌ర‌హాలోనే సోష‌ల్ మెసేజ్ మూవీగా వాజైని తెర‌కెక్కిస్తున్నాడు మారి సెల్వ‌రాజ్‌.

అయితే ఈ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. వాజై మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. వాజై స్ట్రీమింగ్ డేట్‌ను త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తామ‌ని డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ప్ర‌క‌టించింది.

మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత మారి సెల్వ‌రాజ్ డైరెక్ష‌న్‌లో వ‌స్తోన్న వాజై మూవీ ఓటీటీలో రిలీజ్ కావ‌డం కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వాజై సినిమాను నిర్మించింది. అందుకే థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.వాజై సినిమాలో క‌లైయ‌రాస‌న్‌, నిఖిలా విమ‌ల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. వాజై సినిమాకు ద‌స‌రా ఫేమ్ సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

IPL_Entry_Point