Pawan Kalyan: పవన్ కల్యాణ్ వేసుకున్న ఈ టీషర్ట్, సన్ గ్లాసెస్ రేటెంతో తెలుసా?
02 May 2023, 22:02 IST
- Pawan Kalyan: పవన్ కల్యాణ్ వేసుకున్న ఈ టీషర్ట్, సన్ గ్లాసెస్ రేటెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఓజీ మూవీ సెట్లో పవన్ ఓ బ్లూ టీషర్ట్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.
బ్లూ టీషర్ట్ లో స్టైలిష్ గా పవన్ కల్యాణ్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు సాయి ధరమ్ తేజ్ తో కలిసి వినోదాయ సిద్ధం మూవీలో నటిస్తూనే మరోవైపు సాహో డైరెక్టర్ సుజీత్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ వర్కింగ్ టైటిల్ ను ఓజీగా పిలుస్తున్నారు. ఇందులో పవన్ సరసన గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తోంది.
అయితే తాజాగా ఈ మూవీ మేకర్స్ లొకేషన్ కు సంబంధించిన ఓ ఫొటోను రిలీజ్ చేశారు. అందులో పవన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. బ్లూ టీషర్ట్, సన్ గ్లాసెస్ ధరించి ఉన్న అతడు.. హ్యాండ్సమ్ గా ఉన్నాడు. పవన్ అన్ని ఫొటోల్లాగే ఇది కూడా వైరల్ అయినా.. ఇందులో అతడు వేసుకున్న టీషర్ట్, సన్ గ్లాసెస్ పై ఎక్కువ చర్చ నడుస్తోంది.
పవర్ స్టార్ వేసుకున్న టీషర్ట్, కళ్లకు పెట్టుకున్న సన్ గ్లాసెస్ ధరపై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ ఫొటోలో పవన్ వేసుకున్నది హ్యూగో బాస్ టీషర్ట్. దీని ధర సుమారు రూ.11 వేలు. ఇక సన్ గ్లాసెస్ మాంట్ బ్లాంక్ బ్రాండ్ కు చెందినవి. వీటి ధర రూ.24 వేలు కావడం విశేషం. ఈ ధర తెలుసుకొని అభిమానులు షాక్ తింటున్నారు.
ఓజీ మూవీ ఈ మధ్యే ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగానే మేకర్స్ ఈ ఫొటోను రిలీజ్ చేశారు. కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. డీవీవీ దానయ్య ఈ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రభాస్ తో సాహోలాంటి భారీ బడ్జెట్ మూవీ చేసిన సుజీత్.. ఇప్పుడు పవన్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
టాపిక్