Virupaksha Movie Review: విరూపాక్ష మూవీ రివ్యూ - సాయిధరమ్ తేజ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే
Virupaksha Movie Review: సాయిధరమ్‌తేజ్ హీరోగా కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమా శుక్రవారం రిలీజైంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Virupaksha Movie Review: మెగా హీరో సాయిధరమ్‌తేజ్ (Saidharam tej) తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి రెండేళ్లు దాటిపోయింది. బైక్ ప్రమాదం కారణంగా అతడి కెరీర్‌కు అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఈ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సాయిధరమ్‌తేజ్.
మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు కార్తిక్ దండు దర్శకత్వం వహించాడు. సంయుక్త హీరోయిన్ గా నటించింది. అగ్ర దర్శకుడు సుకుమార్ (Sukumar) స్క్రీన్‌ప్లేను అందించారు. శుక్రవారం (నేడు) థియేటర్లలో రిలీజైన విరూపాక్ష మూవీ ప్రేక్షకుల్ని మెప్పించిందా? ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ కమ్ బ్యాక్ అయ్యాడా ? లేదా? అన్నది చూద్దాం…
విరూపాక్ష మూవీ రివ్యూ: 1979లో మొదలై...
1979 టైమ్ విరూపాక్ష సినిమా మొదలవుతుంది. చేతబడి చేస్తున్నారని ఊరి ప్రజలు ఓ జంటను సజీవదహనం చేస్తారు. చనిపోయే ముందు ఆ జంట పుష్కరకాలంలో ఊరు మొత్తం వల్లకాడుగా మారిపోతుందని శపిస్తారు. 1991టైమ్‌లో తన తల్లితో కలిసి ఊరి దేవుడి జాతర చూడటానికి రుద్రవనంలో అడుగుపెడతాడు సూర్య(సాయిధరమ్‌తేజ్).
అదే ఊరికి చెందిన నందినితో ప్రేమలోపడతాడు. అనుకోకుండా ఆ ఊరిలో ఒకరి తర్వాత మరకొరు చనిపోతుంటారు. ఆ మరణాల్ని ఆపడానికి ఎనిమిది రోజుల పాటు ఊరిని అష్టదిగ్భందనం చేయాలని పూజారి (సాయిచంద్)నిర్ణయిస్తాడు. ఊరి లోకి ఎవరూ రాకూడదని, ఊరి నుంచి ఎవరూ బయటకు పోకూడదని నిర్ణయిస్తారు. ఆ నిర్ణయానికి ఊరు ప్రజలు కట్టుబడి ఉన్నారా?
వరుస హత్యల వెనకున్న మిస్టరీని సూర్య ఎలా ఛేదించాడు? ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఊరికి నిజంగానే శాపం తగిలిందా? ఈ హత్యలతో నందినికి సంబంధం ఉందా? రుద్రవనాన్ని సూర్య ఎలా కాపాడాడు అన్నదే విరూపాక్ష(Virupaksha Movie Review) కథ.
మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో...
మిగిలిన లాంగ్వేజ్‌లతో పోలిస్తే తెలుగులో మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో సినిమాలు రావడం కాస్త తక్కువ అనే చెప్పవచ్చు. అందులోనూ చేతబడులు, క్షుద్రపూజలు అనే పాయింట్స్ జోలికి వెళ్లే ప్రయత్నం యంగ్ డైరెక్టర్స్ ఎవరూ చేయలేదు. ఈ రేర్ పాయింట్‌ను ఎంచుకొని తొలి సినిమాతోనే దర్శకుడిగా వైవిధ్యతను చాటుకున్నాడు కార్తిక్ దండు.
ఓ ఊరిలో జరిగే అనూహ్య పరిణామాలకు సస్పెన్స్, థ్రిల్, హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ఓ రివెంజ్ డ్రామా, లవ్ స్టోరీని అల్లుకుంటూ విరూపాక్ష సినిమాను తెరకెక్కించారు. మెయిన్ స్టోరీతో ముడిపడిన ఉపకథలు, సర్‌ప్రైజింగ్ చేసే ట్విస్ట్‌లతో చివరి వరకు సినిమాను ఎంగేజింగ్‌గా నడిపించారు.
రుద్రవనం మిస్టరీ...
1979లో ఓ జంట సజీవదహనంతో విరూపాక్ష మూవీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆ ఊరిలో తన తల్లితో కలిసి సూర్య అడుగుపెట్టడం, నందినితో ప్రేమాయణంతో ఫస్ట్ హాఫ్ ఫన్, హారర్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. . ఓ వ్యక్తి రక్తం కక్కుకొని చనిపోవడం, ఆ మరణాలకు సాక్షులుగా నిలిచిన వారు వరుసగా కన్నుమూసిట్లుగా చూపించి ఆసక్తిగా కథను ముందుకు నడిపించారు.
హీరోయిన్ ప్రమాదంలో పడినట్లుగా చూపించి సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. రుద్రవనం మిస్టరీని సాయిధరమ్‌తేజ్ ఛేదించే క్రమంలో ఎదురయ్యే మలుపులు సర్‌ప్రైజ్ చేస్తాయి. హారర్ సినిమా కాస్త చివరలో రివేంజ్ డ్రామాగా మారుతుంది. అసలు విలన్ ఎవరన్నది లాస్ట్ సీన్ వరకు ప్రేక్షకుల ఊహలకు అందకుండా నడిపించారు డైరెక్టర్.
లవ్ ట్రాక్ మైనస్...
దర్శకుడు కార్తిక్ దండు రాసుకున్న కథ కొత్తగా ఉంది. ఈ కథకు సుకుమార్ స్క్రీన్‌ప్లే మ్యాజిక్ తోడవడంతో సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్‌ను పంచింది. అయితే కథలో చిన్న చిన్న లోపాలుగా అక్కడక్కడ ఇబ్బందిపెట్టాయి. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్ లో ఇంట్రెస్ట్ లోపించింది. కొన్ని చోట్ల కథను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.
సంయుక్త సర్‌ప్రైజింగ్ రోల్...
విరూపాక్ష మూవీలో సూర్యగా సాయిధరమ్‌తేజ్ యాక్టింగ్ బాగుంది. గతంలో ఎక్కువగా లవర్‌బాయ్ తరహా పాత్రల్లో సాయిధరమ్‌తేజ్ కనిపించాడు. వాటికి భిన్నంగా సీరియస్ రోల్‌లో ఇంటెన్స్ యాక్టింగ్‌తో విరూపాక్షలో అదరగొట్టాడు. సంయుక్త మీనన్ (Samyuktha) పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఆమె పాత్ర తాలూకు ట్విస్ట్ రివీల్ చేస్తే సినిమా చూడాలన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పోతుంది. తన న టనతో ఆకట్టుకుంది. రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, అజయ్ ప్రతి క్యారెక్టర్‌ను కొత్తగా డిజైన్ చేశాడు డైరెక్టర్.
Virupaksha Movie Review -కొత్త అనూభూతి....
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అలవాటుపడిన తెలుగు ఆడియెన్స్‌కు కొత్త అనుభూతిని పంచేసినిమా ఇది. చక్కటి మిస్టరీ థ్రిల్లర్ సినిమా చూసిన అనుభూతిని విరూపాక్ష మూవీ పంచుతుంది. కమర్షియల్, కామెడీ హంగుల జోలికి పోకుండా తాను అనుకున్న కథను దర్శకుడు నిజాయితీగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు.
విరూపాక్ష మూవీ రివ్యూ రేటింగ్: 3/5