Pawan Kalyan OG Heroine: పవన్ కల్యాణ్ సరసన నాని హీరోయిన్.. ఓజీలో ఫిమేల్ లీడ్ ఫిక్స్-priyanka mohan is female lead in pawan kalyan new movie og ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Priyanka Mohan Is Female Lead In Pawan Kalyan New Movie Og

Pawan Kalyan OG Heroine: పవన్ కల్యాణ్ సరసన నాని హీరోయిన్.. ఓజీలో ఫిమేల్ లీడ్ ఫిక్స్

Maragani Govardhan HT Telugu
Apr 19, 2023 11:28 AM IST

Pawan Kalyan OG Heroine: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించనున్న ఓజీ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయింది. ఆయన సరసన నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీలో హీరోయిన్‌గా చేసిన ప్రియాంక మోహన్ ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విటర్ వేదికగా తెలియజేశారు.

పవర్  స్టార్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్
పవర్ స్టార్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్

Pawan Kalyan OG Heroine: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఫ్యాన్స్ కోసం వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి ప్రాజెక్టులను లైనులో పెట్టిన పవన్.. ఇటీవలే సాహో ఫేమ్ సుజీత్‌తో ఓజీ అనే మూవీకి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం ముంబయిలో చిత్రీకరించనున్నారట. సాధారణంగా పవర్ స్టార్ సినిమాలు చాలా వరకు హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతాయి. కానీ సుజీత్ డైరెక్షన్‌పై నమ్మకంతో ఈ ప్రాజెక్టు కోసం ముంబయిలో వెళ్తున్నారు.

ముంబయిలో షూటింగ్ చేయాలనే నిర్ణయం మేకర్స్ ప్లాన్‌లో భాగమని తెలుస్తోంది. ఎందుకంటే పవర్ స్టార్ గత చిత్రాల కంటే భిన్నంగా ఉండాలని వారు భావిస్తున్నారట. అంతేకాకుండా సుజీత్ స్క్రిప్టుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే సాహోతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుజీత్.. ఈ సారి పవర్ స్టార్‌తో అంతకుమించిన సినిమా తీసేలా కథను రాసుకున్నాడు. తాజాగా ఈ మూవికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమాలో హీరోయిన్‌ను ప్రకటించింది.

ముందు నుంచి అందరూ అనుకున్నట్లుగానే ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు మేకర్స్. ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తెలుపు రంగు దుస్తుల్లో ఆకర్షణీయంగా ఉంది ప్రియాంక. ఈ ముద్దుగుమ్మ గతంలో నాని సరసన గ్యాంగ్ లీడర్, శర్వానంద్ సరసన శ్రీకారం చిత్రంలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. శివకార్తికేయన్ చేసిన డాక్టర్, డాన్ చిత్రాల్లోనూ ఈ ముద్దుగుమ్మ నటించిన తన పర్పార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తాజాగా పవర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుండటంతో అమ్మడు క్రేజ్ మారిపోనుంది.

ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుజీత్ దర్శఖత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదల చేసే అవకాశముంది. అది కూడా షూటింగ్ పూర్తయ్యే సమయంపై ఆధారపడి ఉంటుంది.

IPL_Entry_Point