Pawan Kalyan OG Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్, సముద్రఖని దర్శకత్వంలో సినిమాలకు ఓకే చెప్పిన ఆయన.. ఇటీవలే సాహో ఫేమ్ సుజీత్‌తో కూడా ఓ ప్రాజెక్టు చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా సుజీత్‌తో(Sujeeth) మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఓజీ(OG) పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ముంబయిలో ఓజీ చిత్రీకరణను ప్రారంభించింది టీమ్. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది.
ఓజీ చిత్రం ప్రారంభమైనప్పట్లు మూవీ టీమ్ ఓ వీడియోలో ప్రకటించింది. ఈ వీడియోను గమనిస్తే సినిమాకు సంబంధించి స్టైలిస్ట్ ఎలిమెంట్స్, సెట్స్‌ను చూపించారు. తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఆసక్తిని కలిగించేలా ఉంది. వచ్చే వారం నుంచి పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు.
ఈ మూవీకి సంబంధించిన కథ, పవన్ కల్యాణ్ క్యారెక్టర్ లాంటి విషయాలను చిత్రబృందం గోప్యంగా ఉంచింది. అయితే ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ పవర్ స్టార్‌కు ఇష్టమైన జోనర్ అయిన యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుందని తెలుస్తోంది. అయితే ఈ అంశంపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోందని సమాచారం.
ఓజీ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఆరాటపడుతున్నారు. తాజాగా సినిమా షూటింగ్ మొదలైందని తెలుసుకుని సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదల చేసే అవకాశముంది. అది షూటింగ్ పూర్తయ్యే విధానంపై ఆధారపడి ఉంటుంది.
ఇప్పటికే పవన్ కల్యాణ్ హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. తాజాగా సుజీత్‌తో సినిమాను కూడా మొదలుపెట్టేశారు. దీంతో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫూల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్. ఇది కాకుండా సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఓ మల్టీ స్టారర్ చేస్తున్నారు.
టాపిక్