Pawan and Sree Leela Mass Song: పవన్ కల్యాణ్-శ్రీలీల కాంబోలో మాస్ సాంగ్.. ఫ్యాన్స్ డిమాండ్
Pawan and Sree Leela Mass Song: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో శ్రీలీల కీలక పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఓ మాస్ సాంగ్ ప్లాన్ చేయమని ఫ్యాన్స్.. దర్శకుడు హరీష్ శంకర్‌ను అడుగుతున్నారు.
Pawan and Sree Leela Mass Song: టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది. తన గ్లామర్‌తోనే కాకుండా నటన, అద్భుతమైన తన డ్యాన్స్ స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా రవితేజతో తీసిన ధమాకా చిత్రంలో శ్రీలీల డ్యాన్స్‌కు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. జింతక్, పల్సర్ బైక్, దండకడియాల్ లాంటి సాంగ్స్‌లో మాస్ మహారాజా రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆమె చేతిలో ప్రస్తుతం డజను చిత్రాలు ఉన్నాయి. అయితే వీటిల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో చేయబోయే సినిమా మాత్రం ఆమెకు ప్రత్యేకంగా మారనుంది. అదే ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ మూవీ సెట్స్‌లో శ్రీలీల ఇటీవలే అడుగుపెట్టింది.
దీంతో పవన్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా ఆత్రుతగా ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్, శ్రీలీల కలిసి ఒక్క మాస్ స్టెప్పు అయినా వేయాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా హరీష్ శంకర్‌కు మెసేజులు పంపిస్తున్నారు. పవర్ స్టార్, శ్రీలీలతో ఒక్క మాస్ స్టెప్పు అయినా ప్లాన్ చేయాలని అడుగుతున్నారు.
ఫ్యాన్స్ కోరికను విన్న హరీష్ శంకర్ కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఓకే అంటూ థంబ్స్ అప్ ఎమోజీని షేర్ చేశారు. డైరెక్టర్ హరీష్ నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరి కాంబినేషన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గబ్బర్ సింగ్‌లో కెవ్వుకేక తరహాలో పక్కా మాస్ సాంగ్ ఉంటుందని ఇప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు.
గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీలో పూజా హెగ్డే కథానాయిక. శ్రీలీల కీలక పాత్రలో మెరవనుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాపిక్