తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pankaj Tripathi On South Indian Movies: నేను అందుకే సౌత్ సినిమాలు చేయను: పంకజ్ త్రిపాఠీ

Pankaj Tripathi on South Indian Movies: నేను అందుకే సౌత్ సినిమాలు చేయను: పంకజ్ త్రిపాఠీ

HT Telugu Desk HT Telugu

23 November 2022, 9:51 IST

google News
    • Pankaj Tripathi on South Indian Movies: తాను సౌత్ సినిమాలు చేయకపోవడం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు బాలీవుడ్‌ నటుడు పంకజ్ త్రిపాఠీ. హిందీలో పలు వెబ్‌సిరీస్‌లతోపాటు సినిమాలతోనూ అతడు విలక్షణ నటుడిగా పేరుగాంచాడు.
పంకజ్ త్రిపాఠీ
పంకజ్ త్రిపాఠీ (HT_PRINT)

పంకజ్ త్రిపాఠీ

Pankaj Tripathi on South Indian Movies: సౌత్‌ ఇండియా సినిమాలు ఇప్పుడు పాన్‌ ఇండియాలో సంచలనం రేపుతున్న సంగతి తెలుసు కదా. తెలుగుతోపాటు కన్నడ, తమిళం సినిమాలు బాలీవుడ్‌లోనూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో చాలా మంది బాలీవుడ్ నటులు, దర్శకులు సౌత్‌ వైపు చూస్తున్నారు. నేరుగా మన సినిమాల్లో నటించడానికే ఇష్టపడుతున్నారు.

కానీ మీర్జాపూర్‌, క్రిమినల్‌ జస్టిస్‌లాంటి వెబ్‌సిరీస్‌తోపాటు పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు పంకజ్‌ త్రిపాఠీ మాత్రం తాను సౌత్‌ సినిమాల్లో నటించడానికి ఇష్టపడనని స్పష్టం చేశాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయని.. వాటికి తాను నో చెప్పినట్లు వివరించాడు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భాగంగా పంకజ్‌ మాట్లాడాడు.

తనకు హిందీ మాత్రమే బాగా అర్థమవుతుందని, అందువల్ల ఆ భాషలో అన్ని రకాల భావోద్వేగాలను తాను బాగా పలికించనని చెప్పాడు. "భాష నాకు అడ్డు కాదు. కానీ నేను హిందీ సినిమాకే ప్రాధాన్యమిస్తాను. ఎందుకంటే నాకు హిందీ సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ భాష నాకు తెలుసు. అందులోని భావోద్వేగాలు నాకు తెలుసు. హాలీవుడ్‌ వదిలేయండి నాకు తెలుగు, మలయాళం నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ వాళ్ల భాష నాకు తెలియకపోవడంతో ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. అందుకే నో చెప్పాను" అని పంకజ్‌ వివరించాడు.

ఆ సీన్‌లోని ఫీల్‌ను తాను పలికించలేనని కూడా అన్నాడు. అయితే ఎవరైనా తనకు హిందీలో మాట్లాడే క్యారెక్టర్‌ ఇస్తే ఏ భాషా చిత్రంలో అయినా పని చేయడానికే సిద్ధమే అని కూడా చెప్పాడు. అయినా హిందీలోనే తనకు చాలా ఆఫర్లు ఉన్నాయని, ఇక హాలీవుడ్‌, ఇతర భాషల గురించి ఆలోచించే సమయం లేదని తెలిపాడు. ప్రస్తుతం మీర్జాపూర్‌ మూడో సీజన్‌తోపాటు పలు ఇతర సినిమాల్లోనూ పంకజ్ నటిస్తున్నాడు.

తదుపరి వ్యాసం