Samantha | వావ్ సమంత.. పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్‌లో టాప్
ఈ లిస్ట్‌లో సౌత్ స్టార్లే ఎక్కువగా ఉండటం విశేషం. టాప్ టెన్‌లో ఏకంగా ఏడుగురు సౌత్ ఇండియన్ మూవీ స్టార్లు కాగా.. కేవలం ముగ్గురే బాలీవుడ్ హీరోయిన్లు ఉన్నారు.
సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఒక్కటే కాదు.. పాన్ ఇండియా లెవల్లోనూ ఆమె పేరు మార్మోగుతోంది. ఆర్మాక్స్ మీడియా తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. పాన్ ఇండియా ఫిమేల్ స్టార్స్ లిస్ట్‌లో సమంత టాప్‌లో ఉండటం విశేషం. బాలీవుడ్‌ను ఏలుతూ.. అక్కడి హీరోలతో సమానమైన క్రేజ్ ఉన్న ఆలియా భట్ కూడా రెండోస్థానంతో సరిపెట్టుకుంది.
ఈ లేటెస్ట్ సర్వేకు సంబంధించిన ఫలితాలను ఆర్మాక్స్ మీడియా తన ట్విటర్‌లో షేర్ చేసింది. సమంత మాత్రమే కాదు.. ఈ లిస్ట్ టాప్ టెన్‌లో సౌత్ హీరోయిన్ల హవానే ఎక్కువగా ఉంది. పది మందిలో ఏడుగురు సౌత్ మూవీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కావడం విశేషం. లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన నయనతార ఈ లిస్ట్‌లో మూడోస్థానంలో ఉండగా.. ఈ మధ్యే అమ్మయిన కాజల్ అగర్వాల్ నాలుగోస్థానంలో ఉంది.
ఇక బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకోన్ ఐదోస్థానంతో సరిపెట్టుకుంది. ఆమె తర్వాత రష్మిక మందన్నా అనుష్క శెట్టి, కత్రినా కైఫ్, కీర్తి సురేశ్, పూజా హెగ్డే ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో సమంత నార్త్ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఆ సిరీస్‌లో ఆమె నటనకు ఫిదా కాని వాళ్లు లేరు. ఆ తర్వాత పుష్ప మూవీలో ఐటెమ్ సాంగ్‌తో నార్త్‌లో సమంత రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండతో నటిస్తున్న మూవీ ఈ మధ్యే కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అటు గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాంకుతలం ఆమె సినిమాల్లో కీలకమైనది. ఇది కాకుండా యశోదలోనూ ఆమె నటించింది. ఈ సినిమా ఆగస్ట్‌లో రిలీజ్ కానుంది. ఇదొక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌లోనూ కనిపించనుంది. ఇక బాలీవుడ్‌లో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్‌లోనూ నటిస్తోంది.