తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: ఓటీటీలోకి ఒకే రోజు నాలుగు సూపర్ హిట్ సినిమాలు.. ఏది ఎక్కడ చూడాలంటే?

OTT Releases: ఓటీటీలోకి ఒకే రోజు నాలుగు సూపర్ హిట్ సినిమాలు.. ఏది ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu

05 February 2024, 11:06 IST

    • OTT Releases: ఓటీటీలోకి ఈ వారం ఒకే రోజు నాలుగు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. సౌత్ ఇండియాలోని మూడు భాషలకు చెందిన ఈ సినిమాలు బాక్సాఫీస్ సక్సెస్ తర్వాత ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
ఈ వారం ఒకే రోజు ఓటీటీలోకి నాలుగు పెద్ద సినిమాలు
ఈ వారం ఒకే రోజు ఓటీటీలోకి నాలుగు పెద్ద సినిమాలు

ఈ వారం ఒకే రోజు ఓటీటీలోకి నాలుగు పెద్ద సినిమాలు

OTT Releases: ఓటీటీల్లోకి సంక్రాంతి సినిమాలు క్యూ కడుతున్నాయి. గత శనివారం (ఫిబ్రవరి 3) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి సైంధవ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ వారం ఒకే రోజు మూడు సంక్రాంతి సినిమాలతోపాటు మరో కన్నడ సూపర్ హిట్ సినిమా కూడా రాబోతోంది.

ట్రెండింగ్ వార్తలు

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

Mega vs Allu fans: మెగా, అల్లు అభిమానుల మధ్య పెరుగుతూనే ఉన్న గ్యాప్! మీమ్‍లతో ఫ్యాన్స్ వార్

ఈ శుక్రవారం (ఫిబ్రవరి 9) గుంటూరు కారంతోపాటు కెప్టెన్ మిల్లర్, అయలాన్, కాటేరా సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి.

ఏ సినిమా ఏ ఓటీటీలోకి రానుందంటే..

ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. అందులో సైంధవ్ ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక గుంటూరు కారం మూవీ కూడా థియేటర్లలోకి వచ్చిన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. నా సామిరంగ మూవీ వచ్చే వారం వచ్చే అవకాశం ఉండగా.. హనుమాన్ మాత్రం మార్చి రెండో వారంలోగానీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం లేదు.

ఇక అదే సంక్రాంతికి తమిళంలో రిలీజైన కెప్టెన్ మిల్లర్, అయలాన్ సినిమాలు కూడా ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కన్నడలో గతేడాది డిసెంబర్ 29న సలార్ కు పోటీగా రిలీజైన కాటేరా మూవీ కూడా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 9) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

గుంటూరు కారం - నెట్‌ఫ్లిక్స్

మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆదివారం (ఫిబ్రవరి 4) నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో రిలీజైన గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు. తొలి షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో తర్వాత కలెక్షన్లు క్రమంగా తగ్గుతూ వెళ్లాయి. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

కెప్టెన్ మిల్లర్ - ప్రైమ్ వీడియో

ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ మూవీ తమిళంలో పొంగల్ కు రిలీజైంది. తెలుగులో మాత్రం జనవరి 26న వచ్చింది. అయితే భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెప్టెన్ మిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అయలాన్ - సన్‌నెక్ట్స్

శివకార్తికేయన్ నటించిన అయలాన్ సినిమా కూడా పొంగల్ సందర్భంగా తమిళంలో రిలీజై.. తెలుగులో మాత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 9 నుంచి సన్‌నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

కాటేరా - జీ 5 ఓటీటీ

కన్నడలో సలార్ కు పోటీగా రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా డిసెంబర్ 29న థియేటర్లలోకి రాగా.. ఇప్పుడు 40 రోజుల తర్వాత ఫిబ్రవరి 9 నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు కర్ణాటకతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం