తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు.. ఏమాత్రం మిస్ అవ్వొద్దు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movies: ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు.. ఏమాత్రం మిస్ అవ్వొద్దు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

12 April 2024, 8:36 IST

  • New OTT Releases: థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటివారికోసం ఒక్కరోజే ఏకంగా మూడు సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చేశాయి. ఏమాత్రం మిస్ కాకూడని ఈ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు.. ఏమాత్రం మిస్ అవ్వొద్దు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు.. ఏమాత్రం మిస్ అవ్వొద్దు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు.. ఏమాత్రం మిస్ అవ్వొద్దు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Today OTT Movies: ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే మంచి టాక్ తెచ్చుకుని భారీ బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. ఇక ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటీటీలో చూసేందుకు ఆడియెన్స్ ఇష్టపడుతున్నారు. అందుకే, థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాల ఓటీటీ రిలీజ్ కోసం తెగ వెయిట్ చేస్తుంటారు. అలాంటి వారికోసమే తాజాగా ఒకేరోజు ఏకంగా మూడు మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Dakshina Trailer: తెలుగులో క‌బాలి హీరోయిన్ సైకో కిల్ల‌ర్ మూవీ - ట్రైల‌ర్ రిలీజ్ చేసిన ఉప్పెన డైరెక్ట‌ర్‌

Zee Mahotsavam OTT: టీవీలో రమ్యకృష్ణ కాజల్ జయప్రద సందడి.. ఓటీటీలో కూడా చూడొచ్చు.. ఎలా అంటే?

Megalopolis Movie: 1977 లోఅనౌన్స్ - 2024లో రిలీజ్ - గాడ్ ఫాద‌ర్ డైరెక్ట‌ర్‌ వెయ్యి కోట్ల హాలీవుడ్ మూవీ ఏదో తెలుసా?

Raju Yadav: ఆ క్రికెటర్‌కు జరిగిన సర్జరీ ఆధారంగా గెటప్ శ్రీను రాజు యాదవ్ మూవీ: డైరెక్టర్

ప్రేమలు ఓటీటీ

మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ ఎన్నో సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఈ మధ్య కాలంలో మాలీవుడ్ నుంచి ఎక్కువగా వినిపించిన సినిమా పేరు ప్రేమలు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమలో సాలిడ్ హిట్‌గా నిలిచింది. దాంతో ఈ మూవీని తెలుగులో కూడా విడుదల చేశారు. మార్చి 8న ప్రేమలు తెలుగు వెర్షన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిలీజ్ చేయగా దానికి మంచి టాక్ వచ్చింది.

2 ఓటీటీల్లో

అంతటి టాక్ తెచ్చుకున్న ప్రేమలు సినిమా ఏప్రిల్ 12న ఏకంగా రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. ఈ సినిమా మలయాళం, తమిళం, హిందీ వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కాగా తెలుగు వెర్షన్ మాత్రం ఆహా ఓటీటీలో ప్రసారం అవుతోంది. నేషనల్ వైడ్‌గా మంచి హిట్ అయిన ఈ సినిమాను ఏమాత్రం మిస్ కావొద్దు. ముఖ్యంగా యూత్‌కు బాగా కనెక్ట్ అయే సినిమా అని రివ్యూలు తెలిపాయి.

గామి ఓటీటీ

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చిత్రీకరణలో ఉండగానే గామి మూవీతో ప్రేక్షకులను అలరించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో విజువల్ వండర్ సినిమాగా గామి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. విద్యాధర్ కాగిత డైరెక్టర్‌గా పరిచయమైన ఈ సినిమా మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కలెక్షన్ల పరంగా ఎలా ఉన్నా టాక్‌ను బట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

బెస్ట్ ఆప్షన్

అలాంటి గామి సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఇవాళ్టి నుంచి అంటే ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు నరేష్ కుమారన్ సంగీతం, నేపథ్య సంగీతం అదిరిపోయాయని టాక్ వచ్చింది. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ చూడాలనుకునేవారికి గామి మంచి ఆప్షన్.

ఓం భీమ్ బుష్ ఓటీటీ

బ్రోచెవారెవరురా సినిమా కాంబినేషన్ అయిన శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి నవ్వులతో మ్యాజిక్ చేసిన సినిమా ఓం భీమ్ బుష్. హారర్ అండ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు హుషారు, రౌడీ బాయ్స్ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీ హర్ష కొనుగంటి డైరెక్షన్ చేశారు. మార్చి 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

మిస్ కావొద్దు

ఫుల్ లెంత్ కామెడీ అండ్ హారర్ ఎఫెక్ట్స్‌తో సినిమా బాగా తీశారని పేరు వచ్చింది. హారర్ అండ్ కామెడీ ఇష్టపడే వారికి ఓం భీమ్ బుష్ మంచి ఛాయిస్. హ్యాపీగా నవ్వుకోడానికి శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఓం భీమ్ బుష్ మూవీని చూడటం మిస్ కావొద్దు.

తదుపరి వ్యాసం