తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Most Watched Web Series In 2024: ఓటీటీలో ఈ ఏడాది ఎక్కువ మంది చూసి టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. టాప్‌లో ఆ కామెడీ సిరీస్

OTT Most Watched Web Series in 2024: ఓటీటీలో ఈ ఏడాది ఎక్కువ మంది చూసి టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. టాప్‌లో ఆ కామెడీ సిరీస్

Hari Prasad S HT Telugu

02 December 2024, 15:15 IST

google News
    • OTT Most Watched Web Series in 2024: ఓటీటీలో ఈ ఏడాది కూడా ఎన్నో అలరించే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. మరి వీటిలో ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా చూసిన టాప్ 10 వెబ్ సిరీస్ ఏవో ఒకసారి చూద్దాం.
ఓటీటీలో ఈ ఏడాది ఎక్కువ మంది చూసి టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. టాప్‌లో ఆ కామెడీ సిరీస్
ఓటీటీలో ఈ ఏడాది ఎక్కువ మంది చూసి టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. టాప్‌లో ఆ కామెడీ సిరీస్

ఓటీటీలో ఈ ఏడాది ఎక్కువ మంది చూసి టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. టాప్‌లో ఆ కామెడీ సిరీస్

OTT Most Watched Web Series in 2024: ఓటీటీలో ప్రతి ఏటా లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎన్నో వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు 2024 ఏడాది కూడా చివరి నెలలోకి ఎంటరైన నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎక్కువ మంది చూసిన టాప్ 10 హిందీ వెబ్ సిరీస్ ఏవి? వాటిని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో చూడాలన్న విషయాలు ఇక్కడ చూడండి.

ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇవే

పంచాయత్ సీజన్ 3 - ప్రైమ్ వీడియో

ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన హిందీ వెబ్ సిరీస్ గా ప్రైమ్ వీడియోలోని పంచాయత్ సీజన్ 3 నిలిచింది. ఈ కొత్త సీజన్ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు.. ఈ ఏడాది మేలో అడుగుపెట్టగానే ఎగబడి చూశారు. దీంతో ప్రైమ్ వీడియోలో ఇప్పటి వరకూ 2.9 కోట్ల వ్యూస్ వరకూ రావడం విశేషం. ఈ మధ్యే నాలుగో సీజన్ షూటింగ్ కూడా మొదలైనట్లు ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది.

హీరామండి: ది డైమండ్ బజార్ - నెట్‌ఫ్లిక్స్

ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. నెట్‌ఫ్లిక్స్ లో ఈ ఏడాది అడుగుపెట్టిన ఈ సిరీస్ ను సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు 2.1 కోట్ల వరకు వ్యూస్ వచ్చాయి.

ఇండియన్ పోలీస్ ఫోర్స్ - ప్రైమ్ వీడియో

బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ నుంచి వచ్చిన తొలి వెబ్ సిరీస్ ఈ ఇండియన్ పోలీస్ ఫోర్స్. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో సిద్దార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, ఇషా తల్వార్, శ్వేతా తివారీలాంటి వాళ్లు నటించారు. ఈ సిరీస్ 1.95 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది.

కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ లో ఈ ఏడాది వచ్చిన మరో మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ కోటా ఫ్యాక్టరీ. ఈ సిరీస్ మూడో సీజన్ కు 1.57 కోట్ల వ్యూస్ వచ్చాయి. రాజస్థాన్ లోని కోటాలో జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమయ్యే స్టూడెంట్స్ చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది.

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3, 4 - హాట్‌స్టార్

హనుమంతుడి కథతో వచ్చిన యానిమేషన్ వెబ్ సిరీస్ ఇది. ఈ ఏడాది మూడు, నాలుగు సీజన్లు వచ్చాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండింటికి కలిపి 1.48 కోట్ల వ్యూస్ రావడం విశేషం.

షోటైమ్ - హాట్‌స్టార్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ ఏడాది అడుగుపెట్టిన మరో వెబ్ సిరీస్ షోటైమ్. రంగుల లోకమైన సినిమా ఇండస్ట్రీ తెర వెనుక జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇమ్రాన్ హష్మి నటించిన ఈ వెబ్ సిరీస్ కు 1.25 కోట్ల వ్యూస్ వచ్చాయి.

గుల్లక్ సీజన్ 4 - సోనీలివ్

సోనీలివ్ లో కొన్నేళ్లుగా సూపర్ హిట్ అయిన కామెడీ వెబ్ సిరీస్ గుల్లక్. ఈ ఏడాది నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అయింది. మొదటి మూడు సీజన్లలాగే ఈ కొత్త సీజన్ ను కూడా ప్రేక్షకులు ఆదరించారు. ఈ కొత్త సీజన్ కు 1.21 కోట్ల వ్యూస్ వచ్చాయి.

మహారాణి సీజన్ 3 - సోనీలివ్

మహారాణి ఓ పొలిటికల్ స్టోరీలైన్ తో వచ్చిన వెబ్ సిరీస్. తొలి రెండు సీజన్లు బాగా ఆకట్టుకోవడంతో మూడో సీజన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది కొత్త సీజన్ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పటి వరకూ సోనీలివ్ ఓటీటీలో ఈ సిరీస్ కు 1.02 కోట్ల వ్యూస్ వచ్చాయి.

కిల్లర్ సూప్ - నెట్‌ఫ్లిక్స్

ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కిల్లర్ సూప్. మనోజ్ బాజ్‌పాయీ, కొంకనా సేన్ శర్మ నటించిన ఈ సిరీస్ 92 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది.

జమ్నాపార్ - అమెజాన్ మినీటీవీ

అమెజాన్ మినీటీవీలో వచ్చిన వెబ్ సిరీస్ జమ్నాపార్. ఢిల్లీలోని వెనుకబడిన ప్రాంతం నుంచి ఓ సీఏ.. బడా కార్పొరేట్ కంపెనీల్లో పని చేస్తూ లగ్జరీ లైఫ్ గడపాలని ఆశపడతాడు. ఆ ఆశ అతని జీవితాన్ని ఎలాంటి సమస్యల్లోకి నెట్టిందన్నదే ఈ జమ్నాపార్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ కు 92 లక్షల వ్యూస్ వచ్చాయి.

తదుపరి వ్యాసం