తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Latest Malayalam Movies: ఓటీటీలోని లేటెస్ట్ మలయాళం మూవీస్ ఇవే.. క్రైమ్ థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు..

OTT Latest Malayalam Movies: ఓటీటీలోని లేటెస్ట్ మలయాళం మూవీస్ ఇవే.. క్రైమ్ థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు..

Hari Prasad S HT Telugu

10 December 2024, 14:34 IST

google News
    • New Malayalam Movies on OTT: ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ ఏంటో మనకు తెలుసు. మరి ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన, ఈ వారం రాబోతున్న లేటెస్ట్ మలయాళం సినిమాలేంటో చూడండి.
ఓటీటీలోని లేటెస్ట్ మలయాళం మూవీస్ ఇవే.. క్రైమ్ థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు..
ఓటీటీలోని లేటెస్ట్ మలయాళం మూవీస్ ఇవే.. క్రైమ్ థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు..

ఓటీటీలోని లేటెస్ట్ మలయాళం మూవీస్ ఇవే.. క్రైమ్ థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు..

New Malayalam Movies on OTT: మలయాళం మూవీస్ కు తెలుగులోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు తెలుగు ఆడియోతో లేకపోయినా సబ్ టైటిల్స్ తో చూసేవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. మరి ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన మలయాళం సినిమాలు ఏవి? వాటిని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

ఓటీటీలోని లేటెస్ట్ మలయాళం మూవీస్

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ మధ్యే కొన్ని హిట్ మలయాళం మూవీస్ వచ్చాయి. మరికొన్ని రాబోతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

బౌగెన్‌విలియా - సోనీలివ్

ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన హిట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బౌగెన్‌విలియా. కుంచకో బొబన్, ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 13) సోనీలివ్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఓ కారు ప్రమాదం తర్వాత ఓ జంట జీవితం ఎలా మారిపోతుంది? జ్ఞాపకశక్తి కోల్పోయిన మహిళ.. దానివల్ల ఎలాంటి ప్రమాదంలో పడుతుందన్నది ఈ మూవీలో చూడొచ్చు.

కిష్కింధ కాండం - హాట్‌స్టార్

ఈ మధ్యే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి వచ్చిన మరో సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ కిష్కింధ కాండం. దింజిత్ అయ్యతన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళీలాంటి వాళ్లు నటించారు. ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మిస్సింగ్ గన్ చుట్టూ తిరిగే స్టోరీతో ఈ మూవీ మంచి థ్రిల్ పంచుతుంది.

పాణి - సోనీలివ్

మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ పాణి (Pani). జోజూ జార్జ్ తొలిసారి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది. ఈ మూవీ డిసెంబర్ 20 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఫ్యామిలీ - మనోరమ మ్యాక్స్

ఫ్యామిలీ ఈ మధ్యే మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ మూవీ. ఇతరులకు సాయం చేస్తూ మంచివాడిగా నటించే ఓ వేటగాడి చుట్టూ తిరిగే థ్రిల్లర్ మూవీ ఇది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

అయీషా - మనోరమ మ్యాక్స్

మంజూ వారియర్ లీడ్ రోల్లో నటించిన బయోగ్రాఫికల్ మూవీ అయీషా. గతేడాది జనవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మొత్తానికి డిసెంబర్ 8 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం మలయాళం ఆడియోలోనే ఈ సినిమా వచ్చింది.

హర్ - మనోరమ మ్యాక్స్

ఐదుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే కథతో వచ్చిన మూవీ హర్. ఈ సినిమా నవంబర్ 29 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. లిజిన్ జోస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఏఆర్ఎం - హాట్‌స్టార్

టొవినో థామస్ నటించిన వార్ డ్రామా మూవీ ఏఆర్ఎం. ఈ సినిమా కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ మూవీ అందుబాటులో ఉంది. ఈ ఏడాది రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన మలయాళ సినిమాల్లో ఇదీ ఒకటి.

తదుపరి వ్యాసం