తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Thriller: ఓటీటీలోకి వస్తున్న మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

OTT Horror Thriller: ఓటీటీలోకి వస్తున్న మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu

30 September 2024, 17:36 IST

google News
    • OTT Horror Thriller: ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ అప్డేట్ సోమవారం (సెప్టెంబర్ 30) వెల్లడైంది. ఈ సిరీస్ రెండు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం.
ఓటీటీలోకి వస్తున్న మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వస్తున్న మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

ఓటీటీలోకి వస్తున్న మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

OTT Horror Thriller: హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. ఇప్పుడు ఒకేసారి రెండు ఓటీటీల్లోకి ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు టీకప్. ఈ వెబ్ సిరీస్ జియో సినిమాతోపాటు పీకాక్ ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సోమవారం (సెప్టెంబర్ 30) ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించారు.

టీకప్ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్

టీకప్ ఓ ఇంగ్లిష్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ అక్టోబర్ 10 నుంచి జియో సినిమా, పీకాక్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. రాబర్ట్ ఆర్ మెక్‌కామన్ రాసిన స్టింగర్ అనే నవల్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది.

జార్జియాలోని ఓ మారుమూల రాంచ్ లో ఉండే కొందరు వ్యక్తులు ఓ అంతుబట్టని ముప్పును ఎలా ఎదుర్కొన్నారన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. కొన్ని రోజుల కిందట వచ్చిన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగింది. హారర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ సిరీస్ ను బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.

ఓటీటీ హారర్ మూవీస్

ఇక ఓటీటీల్లోకి ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ హారర్ మూవీస్ వచ్చాయి. వీటిలో పేచీ, డిమాంటి కాలనీ 2, స్త్రీ2లాంటి సినిమాలు ఉన్నాయి. తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ ‘పేచి’ సెప్టెంబర్ 20వ తేదీన రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍‍ల్లో ఈ చిత్రం అడుగుపెట్టింది.

ఇక మరో హారర్ థ్రిల్లర్ మూవీ డిమోంటి కాలనీ 2 జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 27వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అరుళ్‍నిథి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న తమిళంలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం వారం తర్వాత తెలుగులోనూ వచ్చింది. రెండు భాషల్లో మంచి కలెక్షన్లు సాధించింది.

బాలీవుడ్ హారర్ కామెడీ మూవీ ‘స్త్రీ 2’ సంచలన బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ హిందీ సీక్వెల్ చిత్రం బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. రూ.60కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.850 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకొని చాలా రికార్డులను బద్దలుకొట్టింది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్టర్ అమర్ కౌశిక్ తెరకెక్కించారు.

తదుపరి వ్యాసం