OTT Horror Thriller: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ..
02 December 2024, 19:40 IST
- OTT Horror Thriller: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత ఓ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా.. ఓటీటీలో ఎంత మేర ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ..
OTT Horror Thriller: హారర్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కోసం మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పేరు బ్యాగ్‌మ్యాన్ (Bagman). సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజైన ఈ హాలీవుడ్ సినిమా ఇప్పుడు ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లోనూ ఓటీటీలో అందుబాటులోకి రావడం విశేషం.
బ్యాగ్‌మ్యాన్ ఓటీటీ స్ట్రీమింగ్
హారర్ థ్రిల్లర్ మూవీ బ్యాగ్‌మ్యాన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే. అందరు సబ్‌స్క్రైబర్లకు కాకుండా కేవలం రూ.149 రెంట్ చెల్లించిన వారికి మాత్రమే ఈ సినిమా చూసే అవకాశం కల్పించింది ప్రైమ్ వీడియో. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
పిల్లలను బ్యాగులో బంధించి ఎత్తుకెళ్లిపోయే ఓ వింత జీవి చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. థియేటర్లలో మాత్రం పెద్దగా ఆదరణ లభించలేదు. ఐఎండీబీలో కేవలం 4.7 రేటింగ్ మాత్రమే వచ్చిన సినిమా ఇది. అలాంటి మూవీని ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో తీసుకురావడంతో ఎంతమంది చూస్తారన్నది అనుమానమే.
బ్యాగ్‌మ్యాన్ స్టోరీ ఏంటంటే?
బ్యాగ్‌మ్యాన్ హారర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమా. స్టోరీ కొత్తదేమీ కాదు. గతంలో ఇలాంటి స్టోరీ లైన్స్ తో చాలా సినిమాలే వచ్చాయి. ఓ వ్యక్తికి తన తండ్రి చిన్నతనంలో చెప్పిన బ్యాగ్‌మ్యాన్ స్టోరీ నిజమైనట్లుగా అనిపిస్తుంది. ఈసారి అతడు తన కోసం కాకుండా తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితి.
చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకొని, వాళ్లను బొమ్మలు, చాక్లెట్లతో ఆకర్షించి, బ్యాగులో బంధించి తీసుకెళ్లి చంపే బ్యాగ్‌మ్యాన్ అసలు ఎవరు? అతని నుంచి హీరో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడన్నది ఈ మూవీలో చూడొచ్చు. కామ్ మెక్‌కార్తీ డైరెక్ట్ చేసిన ఈ బ్యాగ్‌మ్యాన్ మూవీలో సామ్ క్లాఫ్లిన్, ఆంటోనియా థామస్, కారెల్ విన్సెంట్ రోడెన్ లాంటి వాళ్లు నటించారు. ఈ మూవీని ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓటీటీలో రూ.149 రెంట్ చెల్లించి చూడొచ్చు.