తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller Web Series: తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఆ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్

OTT Crime Thriller Web Series: తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఆ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్

Hari Prasad S HT Telugu

20 September 2024, 14:50 IST

google News
    • OTT Crime Thriller Web Series: ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ కేవలం హిందీలోనే ఉన్న ఈ సూపర్ హిట్ సిరీస్.. తెలుగుతోపాటు తమిళంలోకీ వచ్చినట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది.
తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఆ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఆ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్

తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఆ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్

OTT Crime Thriller Web Series: ఓటీటీలో మంచి ప్రేక్షకుల ఆదరణ సంపాదించిన ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్ ఇప్పటికే జీ5 ఓటీటీలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సిరీస్ ను తెలుగు, తమిళ భాషల్లో తీసుకొస్తున్నట్లు సదరు ఓటీటీ శుక్రవారం (సెప్టెంబర్ 20) వెల్లడించింది.

గ్యారా గ్యారా (11:11).. తెలుగులో..

జీ5 ఓటీటీలోకి కొన్నాళ్ల కిందట వచ్చిన వెబ్ సిరీస్ గ్యారా గ్యారా. రెండు వేర్వేరు కాలాల్లో జరిగే క్రైమ్ ను పరిష్కరించడానికి అనుకోకుండా దొరికే ఓ వాకీటాకీ ఆ కాలాలకు చెందిన పోలీసు ఆఫీసర్లను ఎలా కలుపుతుంది? వాళ్లు ఆ కేసులను ఎలా పరిష్కరిస్తాన్న డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సిరీస్ ఇది.

కొరియన్ డ్రామా సిగ్నల్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. హిందీలో ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జీ5 ఓటీటీలో ఇప్పటికీ ఈ సిరీస్ దూసుకెళ్తూనే ఉంది. దీంతో దీనిని మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లోనూ సిరీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఏంటీ గ్యారా గ్యారా వెబ్ సిరీస్?

ధర్మ ప్రొడక్షన్స్, సిఖియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ గ్యారా గ్యారా వెబ్ సిరీస్ ను ఉమేష్ బిస్త్ డైరెక్ట్ చేశాడు. ఇందులో కృతికా కామ్రా, రాఘవ్ జుయల్, ధైర్య కార్వా, ఆకాశ్ దీక్షిత్ నటించారు. ఆగస్ట్ 9 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.

మూడు దశాబ్దాల కాల వ్యవధిలో సాగుతుంది. 1990, 2001, 2016 టైమ్ లైన్స్ చూపిస్తూ ఈ సిరీస్ ను తెరకెక్కించారు. 2016లో ఓ కేసు పరిష్కరిస్తున్న పోలీస్ ఆఫీసర్ యుగ్ ఆర్య (రాఘవ్ జుయల్) కు అనుకోకుండా ఓ పాత వాకీటాకీ దొరుకుతుంది.

అది ప్రతి రోజూ రాత్రి 11.11 గంటలకు 1990, 2000 దశాబ్దంలో అవే కేసులను పరిష్కరించిన మరో పోలీస్ ఆఫీసర్ శౌర్య అథ్వాల్ (ధైర్య కర్వా) వాకీ టాకీకి కనెక్ట్ అవుతుంది. అందులో తెలియకుండానే ఆ కాలం ఆఫీసర్ తో మాట్లాడుతూ.. ఇప్పటి కేసుల పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటాడు యుగ్ ఆర్య.

8 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతో ముగించడంతో ఈ సిరీస్ మొత్తం బింజ్ వాచ్ చేసేలా సాగుతుంది. అయితే ఇన్నాళ్లూ కేవలం హిందీలోనే ఈ సిరీస్ అందుబాటులో ఉండగా.. ఇక నుంచి తెలుగు, తమిళ భాషల్లోనూ చూసే వీలు కలిగింది.

తదుపరి వ్యాసం