OTT Most watched Korean dramas: ఓటీటీల్లో ఈమధ్య కాలంలో ఎక్కువ మంది చూసిన కొరియన్ డ్రామాస్ ఇవే-most watched korean dramas in netflix prime video mx player otts top k dramas in otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Most Watched Korean Dramas: ఓటీటీల్లో ఈమధ్య కాలంలో ఎక్కువ మంది చూసిన కొరియన్ డ్రామాస్ ఇవే

OTT Most watched Korean dramas: ఓటీటీల్లో ఈమధ్య కాలంలో ఎక్కువ మంది చూసిన కొరియన్ డ్రామాస్ ఇవే

Hari Prasad S HT Telugu
Apr 12, 2024 02:32 PM IST

OTT Most watched Korean dramas: ఓటీటీల్లో ఈమధ్య కాలంలో కొరియన్ డ్రామాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాటిలో ఎక్కువ మంది చూసిన ఏవి? అవి ఏ ఓటీటీల్లో ఉన్నాయో చూడండి.

ఓటీటీల్లో ఈమధ్య కాలంలో ఎక్కువ మంది చూసిన కొరియన్ డ్రామాస్ ఇవే
ఓటీటీల్లో ఈమధ్య కాలంలో ఎక్కువ మంది చూసిన కొరియన్ డ్రామాస్ ఇవే

OTT Most watched Korean dramas: కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్ భిన్నమైన అనుభూతిని కలిగిస్తూ ఇండియన్ ఆడియెన్స్ మనసులు గెలుచుకుంటున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో ఎన్నో కే-డ్రామాస్ అందుబాటులో ఉన్నాయి. మరి వాటిలో ఎక్కువ మంది చూసినవి ఏవి? అవి ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసుకోండి. వీలుంటే ఈ వీకెండ్ ప్లాన్ చేసేయండి.

ఎక్కువ మంది చూసిన కే-డ్రామాస్ ఇవే

క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు - నెట్‌ఫ్లిక్స్

టైటిల్లోనే ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటో చెప్పేశారు మేకర్స్. 2019లో వచ్చిన ఈ రొమాంటిక్ సిరీస్ ఓ సౌత్ కొరియా అమ్మాయి, నార్త్ కొరియా ఆఫీసర్ మధ్య జరిగే ప్రేమకథ. సౌత్ కొరియా, నార్త్ కొరియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విభేదాలు ఉన్న సంగతి తెలుసు కదా. అలాంటిది సౌత్ కొరియాకు చెందిన ఓ అమ్మాయి పారాగ్లైడింగ్ చేస్తూ అనుకోని రీతిలో నార్త్ కొరియాలో దిగుతుంది. అక్కడి ఓ అధికారితో ప్రేమలో పడుతుంది. తర్వాత ఏం జరిగిందన్నది నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న ఈ సిరీస్ చూస్తే తెలుస్తుంది.

ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే - నెట్‌ఫ్లిక్స్

ఇది కూడా 2020లో వచ్చిన ఓ రొమాంటిక్ వెబ్ సిరీసే. ఐఎండీబీలో ఏకంగా 8.6 రేటింగ్ ఉన్న ఈ సైకలాజికల్ రొమాన్స్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పిల్లల పుస్తకాలు రాసే ఓ రచయిత, యాంటీ సోషల్ డిజార్డర్ తో బాధపడే ఓ ఆరోగ్య నిపుణుడి చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

విన్సెంజో - నెట్‌ఫ్లిక్స్

విన్సెంజో ఓ డార్క్ కామెడీ థ్రిల్లర్. ఇటాలియన్ మాఫియాకు లాయర్ గా ఉన్న ఓ యంగ్ కొరియన్, డబ్బున్న వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే అతని లక్ష్యం చుట్టూ తిరిగే స్టోరీ. 2021లో వచ్చిన ఈ సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు. దీనికి 8.4 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

స్టార్టప్ - నెట్‌ఫ్లిక్స్

స్టార్టప్ ప్రపంచంలో అడుగుపెట్టి విజయవంతమైన పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కలలు కనే కొందరు యువత.. ఆ క్రమంలో అందులోనే ప్రేమను వెతుక్కోవడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. 2020లో వచ్చిన ఈ రొమాంటిక్ సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు. దీనికి 8 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

హాస్పిటల్ ప్లేలిస్ట్ - నెట్‌ఫ్లిక్స్

చిన్ననాటి నుంచి స్నేహితులుగా ఉంటూ చివరికి ఒకే హాస్పిటల్లో పని చేసే ఐదుగురు ప్రాణ స్నేహితులే కథే ఈ హాస్పిటల్ ప్లేలిస్ట్. డాక్టర్లుగా పనిచేయడమే కాదు అందరికీ మ్యూజిక్ అంటే కూడా ప్రాణమే. 2020లో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

స్ట్రేంజర్ ఫారెస్ట్ ఆఫ్ సీక్రెట్స్ - నెట్‌ఫ్లిక్స్, ఎంఎక్స్ ప్లేయర్

సౌత్ కొరియాలోని న్యాయ వ్యవస్థలో జరిగిన అవినీతి, హత్య కేసును ఛేదించడానికి ప్రయత్నించే ఓ ప్రాసిక్యూటర్ చుట్టూ తిరిగే కథే ఈ స్ట్రేంజర్. ఇదొక థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్, ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీల్లో చూడొచ్చు.

IPL_Entry_Point