OTT Murder Mystery: ఓటీటీలోకి వస్తున్న మరో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. హనీమూన్‌లో హత్య.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Murder Mystery: ఓటీటీలోకి మరో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ రాబోతోంది. హనీమూన్‌లో జరిగే హత్య చుట్టూ తిరిగే కథతో ఎంతో ఇంట్రెస్టింగా సాగిన ఈ సిరీస్ ట్రైలర్ ను గురువారం (సెప్టెంబర్ 19) రిలీజ్ చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.
OTT Murder Mystery: జియో సినిమా ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ రాబోతోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ పేరు హనీమూన్ ఫొటోగ్రాఫర్. హనీమూన్ కి వెళ్లిన పెళ్లికొడుకే హత్యకు గురవుతాడు. ఆ హత్య ఎవరు చేశారన్న మిస్టరీని ఛేదించే కథతో ఈ సిరీస్ తెరకెక్కింది. గురువారం (సెప్టెంబర్ 19) ఈ సిరీస్ ట్రైలర్ ను జియో సినిమా రిలీజ్ చేసింది.
హనీమూన్ ఫొటోగ్రాఫర్ ఓటీటీ స్ట్రీమింగ్
హనీమూన్ ఫొటోగ్రాఫర్ ఓ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్. ఈ సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ లో ఆశా నేగి, సాహిల్ సలాథియా, రాజీవ్ సిద్ధార్థ, ఆపేక్ష పోర్వల్ నటించారు. అర్జున్ శ్రీవాస్తవ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. భార్యతో కలిసి హ్యాపీగా మాల్దీవ్స్ హనీమూన్ కు వెళ్లిన భర్త అనూహ్యంగా హత్యకు గురై బీచ్‌లో శవమై కనిపిస్తాడు.
ఇరానీ ఫార్మా అధినేత అయిన అధీర్ ఇరానీ (సాహిల్) హత్యకు గురైనట్లుగా ట్రైలర్ లో చూపించారు. అతన్ని ఎవరు హత్య చేశారన్నది మిస్టరీగా మారుతుంది. ఇందులో నలుగురు అనుమానితులు ఉంటారు. అందులో అతని భార్యతోపాటు ఓ ఫ్రెండ్, ఓ ఫ్యామిలీ మెంబర్, వాళ్లను ఫాలో చేసే ఓ అపరిచితుడు కూడా ఉంటారు. వీళ్లలో ఎవరు అతన్ని హత్య చేశారన్నది సిరీస్ చూస్తేనే తెలుస్తుంది.
ఈ వెబ్ సిరీస్ లో ఆశా నేగి.. అంబికా నాథ్ అనే పాత్రలో నటించింది. ఆమెది ఓ ఫొటోగ్రాఫర్ పాత్ర. కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్ ఫొటోలు తీస్తూ ఉంటుంది. ఈ హత్యలో ఆమె పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తారు.
మర్డర్ మిస్టరీ కంటెంట్
ఓటీటీల్లో మర్డర్ మిస్టరీ కంటెంట్ కు మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లలో సాధారణంగా హంతకుడు ఎవరు అన్నది చివరి వరకూ సస్పెన్స్ గా ఉంచి ఉత్కంఠ రేపుతారు. దీంతో అదే మర్డర్ మిస్టరీ కథాంశంతో ఈ హనీమూన్ ఫొటోగ్రాఫర్ కూడా తెరకెక్కించారు.
“ఒక ఫొటోగ్రాఫర్, ఒక పిక్చర్ పర్ఫెక్ట్ హనీమూన్. ఇంకా ఓ డెడ్లీ సీక్రెట్. హంతకుడు ఎవరు? హనీమూన్ ఫొటోగ్రాఫర్ సెప్టెంబర్ 27 నుంచి జియో సినిమా ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ ను సదరు ఓటీటీ షేర్ చేసింది.
ఈ సిరీస్ ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసింది. సెప్టెంబర్ 27 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ అస్సలు మిస్ కావద్దు. తెలుగులోనూ ఈ హిందీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.