Ambani's: హనీమూన్‌లో మ్యాచింగ్ దుస్తుల్లో చిన్న కొడుకు-కోడలు, పెద్దకోడలేమో అక్కడ
Ambani's: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ హనీమూన్ కోసం పనామా వెళ్లారు. అక్కడ పనామా అధ్యక్షుడిని కలవగా, శ్లోకా మెహతా పారిస్ లో నీతా అంబానీ, ఆకాశ్ అంబానీలతో కలిసి ఒలంపిక్స్‌కు హాజరయ్యారు.
నీతా అంబానీ, ముఖేష్ అంబానీలతో కలిసి పారిస్‌లో హాలిడే ఎంజాయ్ చేసిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ హనీమూన్ కోసం సెంట్రల్ అమెరికా వెళ్లారు. ఆకాశ్ అంబానీ పారిస్‌లో నీతా, ముఖేష్ లతో కలిసి ఉండగా.. అనంత్, రాధిక పనామాలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నీతా అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా కూడా సిటీ ఆఫ్ లవ్ లో ఫ్యామిలీతో జాయిన్ అయ్యారు.
పనామా అధ్యక్షుడితో:
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినోను కలిశారు. అతని భాగస్వామి మారిసెల్ కోహెన్ డి ములినోను కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన అనంత్, రాధికల ఫొటోను ఓ ఫ్యాన్ పేజ్ షేర్ చేసింది. ఈ సందర్భంగా రాధిక, అనంత్ బ్లాక్ అండ్ వైట్ ఫార్మల్ ఫ్యూజన్ దుస్తుల్లో మెరిశారు.
మ్యాచింగ్ దుస్తుల్లో:
ఈ ఫొటోల్లో రాధిక, అనంత్ ఇద్దరు మ్యాచింగ్ దుస్తుల్లో కనిపించారు. ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ రంగు బట్టల్నే వేసుకున్నారు. రాధికా కో-ఆర్డ్, బ్లాక్ లేస్-ఎంబ్రాయిడరీ దుస్తులను ధరించింది. ఆమె మ్యాచింగ్ స్కర్ట్, బ్లౌజ్ సెట్ ధరించింది. లేస్ ఎంబ్రాయిడరీ, ఫ్రంట్ బటన్ క్లోజర్స్ మరియు రిలాక్స్డ్ ఫిట్ తో సరిపోయే షీర్ కార్డిగాన్ తో డిజైన్ చేయబడింది. స్కర్ట్ మ్యాక్సీ పొడవుతో హై వెయిస్ట్ కలిగి ఉంది. ఆమె దుస్తులతో పాటు హెర్మెస్ మినీ బిర్కిన్ బ్యాగ్ ను చేతిలో పట్టుకున్నారు. మెస్సీ హెయిర్ స్టయిల్, అందమైన నల్ల పూసలు, చెవిపోగులు, నో మేకప్ లుక్ అదిరిపోయాయి.
ఇక అనంత్ విషయానికొస్తే, అతను ప్రింటెడ్ వైట్ అండ్ బ్లాక్ బటన్ డౌన్ షర్ట్ ధరించాడు. దీనికి ఫుల్ లెంగ్త్ స్లీవ్స్, నాచ్ కాలర్ ఉన్నాయి. నలుపు రంగు రిలాక్స్డ్ ఫిట్ ప్యాంట్లు, స్నీకర్స్ ధరించి ఈ లుక్ పూర్తి చేశాడు.
పారిస్ లో నీతా అంబానీతో కలిసి శ్లోకా మెహతా:
అత్త, భర్తతో శ్లోకా:
పారిస్ లో ఆకాశ్ అంబానీ, నీతా అంబానీ, ముఖేష్ అంబానీలతో శ్లోకా మెహతా కూడా చేరారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలు అయిన నీతా తన కుటుంబంతో కలిసి పలు గేమింగ్ ఈవెంట్లలో పాల్గొన్నారు. పారిస్ లోని తన హోటల్ బయట ముఖేష్, ఆకాష్, శ్లోకాలతో కలిసి ఫొటో కూడా దిగారామె. శ్లోకా సింపుల్ బ్లాక్ బ్లౌజ్, డెనిమ్ జీన్స్ ధరించగా, నీతా ఈ వేడుక కోసం ఎంబ్రాయిడరీ వైట్ కో-ఆర్డ్ సెట్ ను ఎంచుకుంది. ఆకాశ్ అంబానీ ప్రింటెడ్ నలుపు రంగు దుస్తుల్లో కనిపించారు.
టాపిక్