OTT Comedy Movie: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
09 September 2024, 13:13 IST
- OTT Comedy Movie: ఓటీటీలోకి మరో కామెడీ మూవీ వస్తోంది. థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్ కు ఈ సినిమా సిద్ధం కావడం విశేషం. ఈ మూవీ జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Comedy Movie: కామెడీ జానర్ సినిమాలు ఇష్టపడే వారిని అలరించడానికి మరో సినిమా నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ నటించిన ఈ సినిమా పేరు జో తేరా హై వో మేరా హై. మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించే అతడు.. ఇప్పుడు మరో కామెడీ మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని సోమవారం (సెప్టెంబర్ 9) జియో సినిమా అనౌన్స్ చేసింది.
ఓటీటీలోకి కామెడీ మూవీ
కామెడీ మూవీ జో తేరా హై వో మేరా హై మూవీ జియో సినిమా ఓటీటీలో సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ పోస్టర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ తేదీని జియో సినిమా అనౌన్స్ చేసింది. గతంలో హేరా పేరీ, వెల్‌కమ్, భూల్ భులయ్యాలాంటి సినిమాల్లో మంచి కామెడీ పండించిన పరేష్ రావల్ ఇందులో నటించాడు.
అతనితోపాటు అమిత్ సియాల్, ఫైజల్ మాలిక్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించిన జో తేరా హై వో మేరా హై మూవీ నేరుగా ఓటీటీలోకే రానుంది. ఈ విషయాన్ని జియో సినిమా తన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా పోస్టర్ షేర్ చేస్తూ.. "ఈ నవ్వులు పండించే సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారా? జో తేరా హై వో మేరా హై మూవీ సెప్టెంబర్ 20 నుంచి జియో సినిమా ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ ఉంచింది.
రాజ్ త్రివేది ఈ సినిమాను డైరెక్ట్ చేయగా.. జ్యోతి దేశ్‌పాండే, అజయ్ జీ రాయ్ మూవీని నిర్మించారు. పరేష్ రావల్ ఈ మధ్యే అక్షయ్ కుమార్ నటించిన సర్ఫిరా సినిమాలో కనిపించాడు. ఈ మూవీ తెలుగులో వచ్చిన ఆకాశమే హద్దురా సినిమాకు రీమేక్. అయితే బాక్సాఫీస్ దగ్గర మూవీ బోల్తా పడింది.
ఆ రెండు కామెడీ మూవీస్ కూడా..
మరోవైపు గత నెలలో రిలీజైన రెండు తెలుగు కామెడీ సినిమాలు కూడా త్వరలోనే ఓటీటీల్లోకి రాబోతున్నాయి. ఈ రెండు తెలుగు సినిమాలు ఒకే రోజు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమయ్యాయి. అందులో ఓ మూవీ పేరు కమిటీ కుర్రోళ్లు కాగా.. మరొకటి ఆయ్.
కమిటీ కుర్రోళ్ళు సినిమా ఈ వారంలోనే సెప్టెంబర్ 12వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావటంతో మంచి ధరకు ఈ సినిమా హక్కులను ఆ ప్లాట్‍ఫామ్ కొనుగోలు చేసింది.
నార్నే నితిన్ హీరోగా నటించిన ఆయ్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్12వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ భాషల్లోనూ అందుబాటులోకి వస్తుంది. స్ట్రీమింగ్ డేట్‍పై నెట్‍ఫ్లిక్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇప్పటికే వచ్చింది.