Political Comedy OTT: కీర్తిసురేష్ పొలిటికల్ కామెడీ మూవీ ఓటీటీలోకి వస్తోంది - స్ట్రీమింగ్ ఏ రోజు నుంచంటే?
Political Comedy OTT: కీర్తిసురేష్ లేటెస్ట్ పొలిటికల్ కామెడీ మూవీ రఘుతాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 20 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. రఘుతాత మూవీకి సుమన్ కుమార్ దర్శకత్వం వహించాడు.
Political Comedy OTT: కీర్తిసురేష్ పొలిటికల్ కామెడీ మూవీ రఘు తాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 20 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రఘుతాత రిలీజ్ అవుతోన్నట్లు తెలిసింది. ఈ వారంలోనే రఘు తాత ఓటీటీ విడుదల తేదీపై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
ఫ్యామిలీ మ్యాన్ రైటర్...
ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీకి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రైటర్ సుమన్ కుమార్ దర్శకత్వం వహించాడు. రఘుతాత మూవీలో కీర్తిసురేష్‌తో పాటు ఎమ్ఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిల్మ్స్ రఘుతాత సినిమాను ప్రొడ్యూస్ చేసింది.
తెలుగులో డైరెక్ట్ ఓటీటీలోనే...
రఘు తాత మూవీ తమిళంతో అగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ తమిళ మూవీని తెలుగులోకి డబ్ చేసి ఒకే రోజు థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అనివార్య కారణాల వల్ల కుదరలేదు. తాజాగా తెలుగు వెర్షన్ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కానున్నట్లు సమాచారం.
పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు కీర్తి సురేష్ నటనకు మంచి పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం రఘుతాత ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. తాను చెప్పాలనుకున్న పాయింట్‌తో పాటు కీర్తిసురేష్ క్యారెక్టర్‌ను స్క్రీన్‌పై ఆవిష్కరించడంలో దర్శకుడు కన్ఫ్యూజ్ కావడం, సందేశాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడంతో రఘు తాత ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది.
కాజల్ విజీ పెళ్లి కష్టాలు...
కాయల్ విజీ (కీర్తిసురేష్) ఓ బ్యాంకు ఉద్యోగి. హిందీ భాష తప్పనిసరి అనే రూల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటుంది. మహిళా రచయిత్రులకు ఆదరణ తక్కువగా ఉంటుందనే భ్రమతో కా పాండియన్ అనే పురుషుడి పేరుతో రచనలు చేస్తుంటుంది. కాయల్ విజీకి రఘు తాత (ఎమ్ఎస్ భాస్కర్) అంటే ప్రాణం.
క్యాన్సర్ కారణంగా రఘుతాత చావుబతుకుల మధ్య ఉండటంతో అతడి కోరిక మేరకు స్నేహితుడు తమిళ సెల్వన్‌తో (రవీంద్ర విజయ్) కాయల్ విజీ పెళ్లికి సిద్ధపడుతుంది. అలాంటి టైమ్‌లోనే ఓ లెటర్ ఆమెకు వస్తుంది. ఆ లెటర్ కాయల్ విజీ జీవితాన్ని ఎలా మార్చింది? అందులో ఏముంది? హిందీని వ్యతిరేకించిన కాయల్ విజీ...హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు నిర్ణయించుకుంది? తాత కోరినట్లు ఆమె పెళ్లి జరిగిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు...
గత ఏడాది తెలుగులో దసరా, భోళాశంకర్ సినిమాలు చేసిన కీర్తిసురేష్...ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా అంగీకరించలేదు. తమిళంలో స్టార్ హీరోలు, కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. తమిళంలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న కన్నివీడి, రివాల్వర్ రీటా సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటోన్నాయి.
తేరీ రీమేక్...
బేబీ జాన్ మూవీతో ఈ ఏడాది బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది కీర్తిసురేష్. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ డిసెంబర్‌లో రిలీజ్ కాబోతోంది. కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ తేరీ రీమేక్‌గా బేబీ జాన్ రూపొందుతోంది.
రెండు వెబ్‌సిరీస్‌లు...
తెలుగులో సినిమాలకు దూరంగా ఉంటోన్న కీర్తిసురేష్ ఓ వెబ్‌సిరీస్‌కు మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉప్పుకప్పురంబు పేరుతో ఓ కామెడీ సిరీస్ చేస్తోంది. ఇందులో కీర్తిసురేష్‌తో పాటు సుహాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. హిందీలో రాధికా ఆప్టేతో కలిసి ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది కీర్తిసురేష్.