Raghu Thatha OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న కీర్తిసురేష్ లేటెస్ట్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-keerthy suresh raghu thatha telugu version directly release on zee5 ott on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raghu Thatha Ott: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న కీర్తిసురేష్ లేటెస్ట్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Raghu Thatha OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న కీర్తిసురేష్ లేటెస్ట్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Aug 19, 2024 02:55 PM IST

Raghu Thatha OTT: కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ ర‌ఘు తాత తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఈ కామెడీ డ్రామా మూవీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్న‌ది. సెప్టెంబ‌ర్ 14 నుంచి ర‌ఘు తాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చెబుతోన్నారు.

ర‌ఘు తాత  ఓటీటీ
ర‌ఘు తాత ఓటీటీ

Raghu Thatha OTT: కీర్తిసురేష్ లేటెస్ట్ త‌మిళ్ కామెడీ మూవీ ర‌ఘు తాత తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఇండిపెండెన్స్ డే కానుక‌గా ర‌ఘుతాత మూవీ త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజైంది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా విమ‌ర్శ‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది.

ఈ సినిమాకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ రైట‌ర్‌ సుమ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎమ్ఎస్ భాస్క‌ర్‌, ర‌వీంద్ర విజ‌య్ కీల‌క పాత్ర‌లు పోషించారు. కేజీఎఫ్ ఫేమ్ హోంబ‌లే ఫిల్మ్స్ ఈ కామెడీ డ్రామా మూవీని నిర్మించింది.

హిందీ భాష‌కు వ్య‌తిరేకంగా...

ఈ సినిమాలో స్వాతంత్య్ర భావాలు క‌లిగిన ధైర్య‌వంతురాలైన బ్యాంక్ ఉద్యోగిగా, హిందీ భాష త‌ప్ప‌నిస‌రి అనే రూల్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసే యువ‌తిగా రెండు కోణాల్లోసాగే పాత్ర‌లో కీర్తి సురేష్ నాచుర‌ల్ యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టింద‌ని ఫ్యాన్స్ చెబుతోన్నారు. ర‌ఘు తాత సినిమాలో కాయ‌ల్ విజీ అనే పాత్ర‌లో కీర్తిసురేష్ న‌టించింది.

కా పాండియ‌న్ పేరుతో...

హిందీ రూల్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసే కాయ‌ల్ విజీ...కా పాండియ‌న్ అనే మారు పేరుతో ర‌చ‌న‌లు చేస్తుంది. ఆ ర‌చ‌న‌ల ద్వారా ఆమె జీవితంలోకి త‌మిళ్ సెల్వ‌న్ వ‌స్తాడు. త‌మిళ్‌సెల్వ‌న్ ఎవ‌రు? హిందీ రూల్ కార‌ణంగా వృత్తిప‌రంగా కాయ‌ల్ ఎలాంటి క‌ష్టాలు ప‌డింది? త‌మిళ్ సెల్వ‌న్‌తో పెళ్లికి సిద్ధ‌ప‌డ్డ కాయ‌ల్ అత‌డి గురించి ఓ షాకింగ్ నిజాన్ని ఎలా తెలుసుకుంది? హిందీ భాష‌ను వ్య‌తిరేకిస్తూ వ‌చ్చిన ఆమె హిందీ ఎగ్జామ్ రాయాల‌ని ఎందుకు నిర్ణ‌యించుకున్న‌ది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

జీ5 ఓటీటీలో...

కాగా ర‌ఘు తాత మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే త‌మిళం, తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ సినిమా హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు జీ5 కొనుగోలు చేసిన‌ట్లు చెబుతోన్నారు. థియేట‌ర్ల‌లోరిలీజైన నెల రోజుల‌కు ర‌ఘుతాత మూవీ ఓటీటీలోకి రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 14 నుంచి త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిసింది. తెలుగులో డైరెక్ట్‌గా ఈ మూవీ ఓటీటీలోనే విడుద‌ల‌కానున్న‌ట్లు చెబుతోన్నారు.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూరంగా..

గ‌త కొన్నాళ్లుగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూరంగా ఉంటోన్న కీర్తి సురేష్‌...వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌స్తోంది. రివాల్వ‌ర్ రీటా...క‌న్నీవీడి సినిమాలు చేస్తోంది. తేరీ రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న బేబీ జాన్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.ఈ సినిమాలో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టిస్తోన్నాడు. తెలుగులో ఉప్పుక‌ప్పురంబు పేరుతో వెబ్‌సిరీస్ చేస్తోంది కీర్తిసురేష్‌. ఈ వెబ్‌సిరీస్‌లో సుహాస్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్నాడు.