Tollywood: యూట్యూబ్‌లో రిలీజైన మలయాళం హీరోయిన్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీ
Tollywood: తెలుగు అవార్డ్ విన్నింగ్ మూవీ హితుడు యూట్యూబ్‌లో రిలీజైంది. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మీరానందన్ హీరోయిన్‌గా నటించింది. 2014లో బెస్ట్ థర్డ్ తెలుగు మూవీగా హితుడు నంది అవార్డును అందుకున్నది.
Tollywood: జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన హితుడు మూవీ థియేటర్లలో రిలీజైన తొమ్మిదేళ్ల తర్వాత యూట్యూబ్‌లోకి వచ్చింది. హైడ్రామ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‌లో గురువారం ఈ మూవీ రిలీజైంది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన హితుడు మూవీ 2015లో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి సినిమాగా పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. 2014 ఏడాదిగాను మూడో ఉత్తమ తెలుగు మూవీగా నంది అవార్డును సొంతం చేసుకున్నది. హితుడు సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు.
మీరా నందన్ హీరోయిన్
హితుడు సినిమాలోమలయాళం బ్యూటీ మీరానందన్ హీరోయిన్‌గా నటించింది. విద్యా గొప్పతనాన్ని చాటిచెబుతూ తెరకెక్కిన ఈ మూవీ ప్రశంసల్ని అందుకున్నది. ఇందులో నక్సలైట్‌గా జగపతిబాబు నటన బాగుందంటూ కామెంట్స్ వినిపించాయి.
హితుడు కథ ఇదే...
సీతారాం (జగపతిబాబు) నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చి పాడేరు ప్రాంతంలో ఓ స్కూల్ ప్రారంభిస్తాడు. అతడి స్కూల్‌లో అభిలాష (మీరానందన్) చేరుతుంది. అల్లరి పిల్ల అయిన అభిలాషకు సీతారాం కారణంగా చదువుపై ఆసక్తి ఏర్పడుతుంది. అభిలాషను ఎలాగైనా బాగా చదివించాలని సీతారాం అనుకుంటాడు. అనుకోకుండా అభిలాష జీవితంలో చిక్కుల్లో పడుతుంది. ఆ సమస్య నుంచి అభిలాషను సీతారాం ఎలా బయటపడేశాడు? ఆమెను ఏ విధంగా చదివించాడు? అభిలాషకు సీతారాం ఎందుకు దూరమయ్యాడు? అన్నదే హితుడు మూవీ కథ. హితుడు మూవీకి కోటి మ్యూజిక్ అందించాడు.
జై బోలో తెలంగాణతో...
మీరానందన్‌కు హితుడు తెలుగులో సెకండ్ మూవీ. ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన జై బోలో తెలంగాణ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. జై బోలో తెలంగాణ, హితుడు రెండు సినిమాల్లో జగపతిబాబు కలిసి నటించింది.
మలయాళంలో...
మీరానందన్ మలయాళంలో 30కిపైగా సినిమాలు చేసింది. మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. మలయాళంలో ది కేరళ కేఫ్, సీనియర్స్, స్వప్న సంచారి సినిమాలు మీరానందన్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తమిళంలో కొన్ని సినిమాలు చేసింది. టీవీ హోస్ట్‌గా మీరానందన్ కెరీర్ ప్రారంభమైంది. టీవీ షోస్ ద్వారా వచ్చిన గుర్తింపుతో హీరోయిన్‌గా మారింది.
విలన్‌గా బిజీ...
మరోవైపు సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టైలిష్ విలన్ రోల్స్‌తో జగపతిబాబు బిజీగా ఉన్నాడు. ఇటీవలే రవితేజ మిస్టర్ బచ్చన్‌లో విలన్‌గా కనిపించాడు. ఈ ఏడాది గుంటూరు కారం, సింబా, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2లో జగపతిబాబు నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేస్తోన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈమూవీ డిసెంబర్ 6న రిలీజ్ కాబోతోంది.
టాపిక్