తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: ఓటీటీలో దూసుకెళ్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న సినిమా రికార్డు

OTT Action Thriller: ఓటీటీలో దూసుకెళ్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న సినిమా రికార్డు

Hari Prasad S HT Telugu

14 October 2024, 15:48 IST

google News
    • OTT Action Thriller: ఓటీటీలో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు రికార్డులు తిరగరాస్తోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 125 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకోవడం విశేషం.
ఓటీటీలో దూసుకెళ్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న సినిమా రికార్డు
ఓటీటీలో దూసుకెళ్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న సినిమా రికార్డు

ఓటీటీలో దూసుకెళ్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న సినిమా రికార్డు

OTT Action Thriller: ఓటీటీలోకి గత వారం వచ్చిన ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా దుమ్ము రేపుతోంది. పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లో రిలీజై అంతంతమాత్రంగానే వసూళ్లు సాధించిన ఈ మూవీ.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మాత్రం రికార్డులు తిరగరాస్తోంది. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించిన వేదా మూవీ గురించి మనం మాట్లాడుకుంటోంది.

వేదా ఓటీటీ స్ట్రీమింగ్ రికార్డు

జాన్ అబ్రహం నటించిన వేదా మూవీ అక్టోబర్ 10 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 125 మిలియన్ (12.5 కోట్లు) స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకోవడం విశేషం.

హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటంతో రికార్డు వ్యూస్ సొంతమవుతున్నాయి. "అన్యాయంపై వాళ్లు సాగించిన పోరాటం టాప్ లోకి వెళ్తోంది.. వేదా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో జీ5 ఓటీటీ సోమవారం (అక్టోబర్ 14) ఈ విషయాన్ని వెల్లడించింది.

వేదా మూవీ గురించి..

వేదా మూవీ ఓ యాక్షన్ థ్రిల్లర్. ఇది వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన సినిమా. నిఖిల్ అద్వానీ డైరెక్ట్ చేశాడు. జాన్ అబ్రహం, శర్వరి, అభిషేక్ బెనర్జీ, ఆశిష్ విద్యార్థి, కుముద్ మిశ్రాలాంటి వాళ్లు ఇందులో నటించారు. ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజైంది. రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.26 కోట్లే వసూలు చేసి డిజాస్టర్ గా మిగిలిపోయింది.

సుమారు రెండు నెలల తర్వాత అక్టోబర్ 10న జీ5 ఓటీటీలోకి వచ్చింది. అయితే డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మాత్రం ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ వేదా మూవీ మేజర్ అభిమన్యు కన్వర్ (జాన్ అబ్రహం) అనే ఓ మాజీ ఆర్మీ ఆఫీసర్, తన ఊళ్లో ఓ అగ్ర కులానికి చెందిన వారి చేతుల్లో చిత్రహింసలకు గురైన వేదా ఓ దళిత అమ్మాయి చుట్టూ తిరుగుతుంది.

ఆమె తనను తాను కాపాడుకోవడానికి బాక్సింగ్ నేర్చుకోవాలని అనుకుంటుంది. అదే సమయంలో ఆర్మీ నుంచి వచ్చేసిన అభిమన్యు.. ఓ కాలేజీలో అసిస్టెంట్ బాక్సింగ్ కోచ్ గా చేరతాడు.

ఓ అగ్ర కులం అమ్మాయిని ప్రేమించాడన్న కారణంగా వేదా అన్నను వాళ్లు చంపేస్తారు. వేదాని కూడా చంపడానికి ప్రయత్నించగా.. ఆమె పారిపోయి అభిమన్యు దగ్గరికి వస్తుంది. అతని దగ్గర బాక్సింగ్ పాఠాలు నేర్చుకుంటుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఆ ఊళ్లో వాళ్లను, పోలీసులను, గూండాలను ఎలా ఎదుర్కొంటారన్నది ఈ సినిమా స్టోరీ.

వేదా మూవీ స్టోరీ ఆసక్తికరంగానే ఉన్నా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలనే మిగిల్చింది. అయితే ఇప్పుడు జీ5 ఓటీటీలో హిందీతోపాటు తెలుగు, తమిళంలలోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

తదుపరి వ్యాసం