తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movie: ఓటీటీలో దూసుకెళుతున్న నివేదా థామస్ సినిమా.. 70 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు క్రాస్ చేసిన మూవీ

OTT Movie: ఓటీటీలో దూసుకెళుతున్న నివేదా థామస్ సినిమా.. 70 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు క్రాస్ చేసిన మూవీ

06 October 2024, 16:17 IST

google News
    • 35 Chinna Katha Kaadu OTT: అంచనాలకు తగ్గట్టే ఓటీటీలో 35 చిన్నకథ కాదు చిత్రం అదరగొడుతోంది. అప్పుడు ఓటీటీలో ఓ మైల్‍స్టోన్ క్రాస్ చేసింది. టాప్‍లో ట్రెండ్ అవుతోంది. వ్యూస్‍లో దూసుకెళుతోంది.
OTT Movie: ఓటీటీలో దూసుకెళుతున్న నివేదా థామస్ సినిమా.. 70 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు క్రాస్ చేసిన మూవీ
OTT Movie: ఓటీటీలో దూసుకెళుతున్న నివేదా థామస్ సినిమా.. 70 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు క్రాస్ చేసిన మూవీ

OTT Movie: ఓటీటీలో దూసుకెళుతున్న నివేదా థామస్ సినిమా.. 70 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు క్రాస్ చేసిన మూవీ

నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించిన ‘35 - చిన్నకథ కాదు’ సినిమా థియేటర్లలో సూపర్ టాక్ తెచ్చుకోగా.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి, అరుణ్ దేవ్ కూడా ముఖ్యమైన పాత్రలు చేశారు. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ సెప్టెంబర్ 6వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మంచి సినిమాగా ప్రశంసలు పొందింది. ఈ మూవీ ఓటీటీలోనూ అదిరే ఆరంభం అందుకుంది.

70 మిలియన్ మార్క్ దాటి..

35 - చిన్న కథకాదు సినిమా 70 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటిందని ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. ఈ సినిమా థీమ్ స్టైల్‍లోనే 35ను 2తో గణిస్తే 70 అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. 70 మిలియన్ నిమిషాల మైల్‍స్టోన్ దాటిందని, బ్యూటిఫుల్ బ్లాక్‍బస్టర్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ట్రెండింగ్‍లో టాప్

35 - చిన్న కథకాదు చిత్రం అక్టోబర్ 2నే ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అప్పటికే ఫుల్ పాజిటివ్ టాక్ ఉండటంతో ఈ చిత్రానికి ఆరంభం నుంచి మంచి వ్యూస్ వచ్చాయి. దీంతో నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 70 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసింది. అలాగే, ప్రస్తుతం (అక్టోబర్ 6) ఈ చిత్రం ఆహా ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతోంది.

35 - చిన్న కథకాదు చిత్రానికి నంద కిశోర్ ఇమానీ దర్శకత్వం వహించారు. తన కుమారుడిని మ్యాథ్స్ సబ్జెక్టులో పాస్ అయ్యేలా చేసేందుకు ఓ మధ్యతరగతి తల్లి చేసే ప్రయత్నం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. మధ్యతరగతి కుటుంబ పరిస్థితులను, ఆలోచనలను ఈ చిత్రంలో డైరెక్టర్ ఆకట్టుకునేలా చూపించారు. ఈ మూవీలో ఇద్దరు పిల్లల అమ్మగా నివేదా థామస్ నటించారు. స్కూల్‍లో ఉపాధ్యాయుడి పాత్రను ప్రియదర్శి పోషించారు. పిల్లాడు అరుణ్ పాత్ర చేసిన అరుణ్ దేవ్ మెప్పించారు. విశ్వదేవ్ కూడా ఆకట్టుకున్నారు. గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ కీరోల్స్ చేశారు.

35 - చిన్న కథకాదు చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేశారు. ఈ మూవీ తిరుపతి బ్యాక్‍డ్రాప్‍లో రూపొందింది. ఈ మూవీని సృజన్, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించగా.. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దగ్గుబాటి రానా సమర్పించారు. ఈ సినిమా ప్రమోషన్లలోనూ రానా చురుగ్గా పాల్గొన్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఈ మూవీ గురించి గొప్పగా చెప్పారు నేచురల్ స్టార్ నాని. థియేటర్లలోనూ ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ సక్సెస్ అవుతోంది.

రెండో ప్లేస్‍లో ‘బాలు గాని టాకీస్’

బాలు గాని టాకీస్ చిత్రం ప్రస్తుతం ఆహాలో రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ కామెడీ డ్రామా చిత్రం అక్టోబర్ 4న ఆహా ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో శివ రామచంద్రవరపు హీరోగా నటించారు. అతడికి జోడీగా శరణ్య శర్మ కనిపించారు. విశ్వనాథ్ ప్రతాప్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. బాలు గాని టాకీస్ చిత్రం కూడా మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.

తదుపరి వ్యాసం