Rana Shah Rukh Khan: షారుక్ ఖాన్ కాళ్లు మొక్కిన రానా.. మేం సౌత్ ఇండియన్స్ అంటూ.. కింగ్ ఖాన్ ఫన్నీ రియాక్షన్ వైరల్-rana touches shah rukh khan feet at iifa 2024 pre event bollywood actor funny reaction gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rana Shah Rukh Khan: షారుక్ ఖాన్ కాళ్లు మొక్కిన రానా.. మేం సౌత్ ఇండియన్స్ అంటూ.. కింగ్ ఖాన్ ఫన్నీ రియాక్షన్ వైరల్

Rana Shah Rukh Khan: షారుక్ ఖాన్ కాళ్లు మొక్కిన రానా.. మేం సౌత్ ఇండియన్స్ అంటూ.. కింగ్ ఖాన్ ఫన్నీ రియాక్షన్ వైరల్

Hari Prasad S HT Telugu

Rana Shah Rukh Khan: షారుక్ ఖాన్ కాళ్లు మొక్కాడు రానా దగ్గుబాటి. ముంబైలో జరిగిన ఐఫా 2024 ప్రీ ఈవెంట్ లో రానా చేసిన ఈ పని చూసి ఆశ్చర్యపోయిన షారుక్.. తర్వాత కాస్త ఫన్నీగా రియాక్టై అక్కడున్న అందరినీ నవ్వించాడు.

షారుక్ ఖాన్ కాళ్లు మొక్కిన రానా.. మేం సౌత్ ఇండియన్స్ అంటూ.. కింగ్ ఖాన్ ఫన్నీ రియాక్షన్ వైరల్

Rana Shah Rukh Khan: మేం సౌత్ ఇండియన్స్.. మా సంస్కృతి ఇలా ఉంటుంది అంటూ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, పక్కనే ఉన్న డైరెక్టర్ కరణ్ జోహార్ కాళ్లు మొక్కాడు రానా దగ్గుబాటి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఐఫా 2024 ప్రీ ఈవెంట్ లో భాగంగా రానా చేసిన ఈ పని అక్కడున్న వాళ్లందరినీ ఆశ్చర్య పరిచింది.

రానా ఎందుకలా చేశాడంటే?

ఐఫా 2024 అవార్డుల వేడుక త్వరలోనే జరగనుంది. దీనికోసం ముంబైలో మంగళవారం (సెప్టెంబర్ 10) ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి షారుక్ ఖాన్ తోపాటు రానా, కరణ్ జోహార్, సిద్దాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీలాంటి వాళ్లు హాజరయ్యారు. ఈ తరం వాళ్లు పెద్దవాళ్ల కాళ్లు ఎలా మొక్కుతారో చెబుతూ ముందు షారుక్ ఖాన్ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశాడు.

పక్కనే ఉన్న కరణ్ జోహార్ కాలిని తన కాలితో టచ్ చేసి.. ఆ తర్వాత తన కాలినే వాళ్లు మొక్కుతారంటూ షారుక్ అలా చేసి చూపించాడు. ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన రానా.. మొదట షారుక్ ను హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత తాను పూర్తిగా సౌత్ ఇండియన్ అని.. కాళ్లు తాము ఇలా మొక్కుతామంటూ షారుక్, కరణ్ జోహార్ కాళ్లు మొక్కాడు. రానా చేసిన ఈ పని చూసి ఆశ్చర్యపోయిన షారుక్.. అతన్ని నవ్వుతూ హగ్ చేసుకున్నాడు.

ఫ్యాన్స్ రియాక్షన్ ఇదీ..

షారుక్ ఖాన్ కాళ్లను రానా మొక్కే సమయంలో అక్కడున్న ఆడియెన్స్ అందరూ పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో స్వాగతించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను అక్కడున్న ఓ ఫొటోగ్రాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీనిపై ఫ్యాన్స్ చాలా మంది రియాక్టయ్యారు.

"సౌత్ ఇండియన్స్ సంస్కృతి చాలా బాగుంటుంది" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "హ.. హ.. హ.. సూపర్ క్యూట్" అని మరొకరు స్పందించారు. షారుక్ అంటే అందరూ ఇష్టపడతారని, తాజాగా రానా ఇలా చేయడం అందుకు నిదర్శనమని ఇంకో అభిమాని కామెంట్ చేశారు.

ఐఫా అవార్డులు ఇలా..

ఐఫా అవార్డుల కార్యక్రమంలో త్వరలోనే అబు ధాబిలో జరగనుంది. ఇందులో షారుక్ ఖాన్ తోపాటు కరణ్ జోహార్, రానా, సిద్దాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ లాంటి వాళ్లు హోస్ట్ చేయనున్నారు. ఇక సీనియర్ నటి రేఖతోపాటు షాహిద్ కపూర్, జాన్వీ కపూర్, కృతి సనన్ లాంటి వాళ్లు పర్ఫార్మ్ చేయబోతున్నారు. ఐఫా 2024 సెర్మనీ సెప్టెంబర్ 27, 29 తేదీల్లో అబు ధాబిలోని యాస్ ఐలాండ్ లో జరగనుంది.

షారుక్ ఖాన్ న్యూలుక్

ఈ ఐఫా 2024 ప్రీఈవెంట్ లో షారుక్ ఖాన్ కొత్త లుక్ ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. అతడు కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించాడు. తన హెయిర్ ను పూర్తిగా ట్రిమ్ చేయించుకొని షారుక్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు. అతని లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. షారుక్ ఫ్యాషన్ కింగ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.