NNS October 14th Episode: అమర్‌ను హగ్ చేసుకున్న భాగీ - మిస్సమ్మ సర్‌ప్రైజ్‌కు వణికిపోయిన అంజు - మనోహరి రూమ్‌లో ఘోర
14 October 2024, 11:33 IST
NNS October 14th Episode: నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 14 ఎపిసోడ్‌లో అంజు బర్త్‌డే సందర్భంగా ఆమెను సర్‌ప్రైజ్‌గా విష్ చేయాలని అమ్ము, మిస్సమ్మ ప్లాన్ చేస్తారు. ఆ సర్‌ప్రైజ్ గురించి తెలియని అంజు భయంతో వణికిపోతుంది. ఆమె భయాన్ని చూసి అమర్‌తో పాటు ఇంటిల్లిపాది నవ్వుకుంటారు.
నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 14 ఎపిసోడ్
NNS October 14th Episode: రామ్మూర్తికి ఫోన్ చేసి అంజు పుట్టినరోజు వేడుకలకి రమ్మని పిలుస్తాడు అమర్. అప్పుడే అక్కడకు వచ్చి భాగీ... నాన్నకి ఒకసారి ఫోన్ చేయండి అంటుంది. తను మాట్లాడుతున్న ఫోన్ భాగీకి ఇస్తాడు అమర్.
భాగీ తన తండ్రి రామ్మూర్తితో మాట్లాడుతూ ఎమోషనల్ అవుతూ వెంటనే అమర్ ను హగ్ చేసుకుంటుంది. ఆరుంధతి షాక్ అవుతుంది. ఏడుస్తూ భాగీ వైపు కోపంగా చూస్తుంది. పక్కనే ఉన్న రాథోడ్ ను కొడుతుంది. రాథోడ్ అటూఇటూ చూస్తాడు ఎవ్వరూ కనిపించరు. వీక్షించకూడనివి వీక్షించినచో మనోవేదనకు గురి అయ్యెదవు రమ్ము వెళదాం అంటాడు గుప్త.
సిగ్గుపడ్డ మిస్సమ్మ...
అమ్మో పిల్లలు వచ్చే టైం అయింది అనుకుంటూ మిస్సమ్మ.. పిల్లలు వచ్చే టైం అయింది బాగోదు అని రాథోడ్ అనగానే అమర్, మిస్సమ్మకు దూరం జరుగుతాడు. మిస్సమ్మ సిగ్గుపడుతుంది. నేను బయటకు వెళ్లి వస్తాను అంటాడు అమర్. ఓ పోరి అటు కాదు ఇటు అని కరుణ పిలవగానే బయటకు వెళ్తున్న మిస్సమ్మ లోపలికివెళ్తుంది.
అరుంధతిపై మనోహరి ద్వేషం…
ఘోర పూజలు చేస్తుంటాడు. మనోహరి ఇంటికి వచ్చి గార్డెన్ లోకి చూస్తూ కోపంగా తిడుతుంది. ఎందుకే.. ఎందుకు చిన్నప్పటి నుంచి దేవుడు ఎప్పుడూ నీ వైపే ఉంటున్నాడని అరుంధతిపై కోపంతో రగిలిపోతుంది మనోహరి. ఇద్దరం అనాథలం ఇద్దరి తలరాత ఒకటే అవ్వాలి కదా? నీ సంతోషంలోంచి పుట్టిన స్వార్థం ఆరుంధతి ఇది... నీ సంతోషం పూర్తిగా నాశనం అయితే తప్ప నా స్వార్థం పోదు. శక్తులు వచ్చాయని ఆనంద పడుతున్నావు కదా? రేపటితో నీ ఆశలు ఆవిరి చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది మనోహరి.
అంజు బర్త్ డే…
ఆంటీ ఒక్కనిమిషం రేపు నా బర్త్ డే కేక్ కటింగ్ ఉంటుంది మీరు ఇంట్లోనే ఉండండి అని మనోహరితో చెబుతుంది అంజు. ఏంటి రేపు నీ పుట్టినరోజా? అని అడుగుతుంది మనోహరి. అవును ఆంటీ..ఎందుకు అలా అడిగారు అని ప్రశ్నిస్తుంది అంజు. ఏం లేదు ఊరికే... అయితే దాన్ని మంత్రించిన పౌడర్ ముట్టుకునేలా చేయాలి అని మనసులో అనుకుంటుంది మనోహరి.
అమ్ము సర్‌ప్రైజ్...
పిల్లలందరూ భయంగా అంజును కిందకు తీసుకెళ్తారు. ఇంట్లో కరెంట్ పోతుంది. అమ్ము కూడా అంజును వదిలేసి లోపలికి వెళ్లిపోతుంది. అంజు భయపడుతూ గట్టిగా అరుస్తుంది. ప్లీజ్ నన్ను కాపాడండి అంటూ ఏడుస్తుంది. ఇంతలో మెల్లగా లైట్స్ వస్తాయి. అంజుపై పూల వర్షం కురుస్తుంది. అంజు హ్యాపీగా ఫీలవుతుంది. అందరూ ఒకేసారి వచ్చి అంజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తారు. ఆపండి సర్‌ఫ్రైజ్ చేశారా? మీ క్రియేటివిటీ తగలేయా.. అని కోప్పడుతుంది అంజు.
అమ్ము వెటకారం...
మిస్సమ్మ.. డాడీ.. అమ్ము నన్ను కాపాడండి..అంటూ అమ్ము వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో కోపంగా అంజు, అమ్ము మీదకు వెళ్తుంది. అమ్మా ఆగు అంజు.. అంటాడు శివరామ్. నన్ను వదులు తాతయ్య… ఇవాళ వీళ్ల సంగతి చెప్తా..డాడ్ మీరు కూడా నవ్వుతున్నారా? అసలు మీరెలా ఒప్పుకున్నారు ఇదంతా..? అని తండ్రితో అంటుంది అంజు...
మిస్సమ్మ ప్లాన్...
నాదేం లేదు ఇదిగో ఇదంతా మిస్సమ్మ ప్లాన్ అంటాడు అమర్. మిస్సమ్మ నిన్నూ.. అని కోపంగా అంటుంది అంజు. సరదాకు చేసిందిలే ఇవాళకు వదిలేయ్.. అని నచ్చజెప్పుతుంది నిర్మల. నేను వదలను ఇవాళ మిస్సమ్మ పని చెప్తాల్సిందే అంటున్న అంజుని అమ్ము సింహం భయపడుతుందా? అని ఏడిపిస్తుంది భాగీ. సింహం భయపడదు కానీ అంజు భయపడుతుంది అంటుంది అమ్ము. అంజు బ్రేవరీ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ ఎప్పుడు వెళ్దాం అని ఏడిపిస్తాడు ఆకాష్. అందరూ న్వవుకుంటుంటే.. ఇక చాలు కేక్ కట్ చేద్దామని అంజును రెడీ అవమని చెప్తాడు. అలాగేనని అంజు వెళ్లిపోతుంది.
మనోహరి టెన్షన్...
మనోహరి టెన్షన్ పడుతుంది. ఏదో ఒకటి చేసి అమర్ కు నిజం చెప్పకుండా రణవీర్ ను ఆపాలని అనుకుంటుంది. ఇంతలో ఘోర కిటికి దగ్గరకు వచ్చి మనోహరిని పిలుస్తాడు. ఘోరను చూసిన మనోహరి మరింత టెన్షన్ పడుతుంది. అమర్ చూస్తే పరిస్థితేంటని భయపడుతుంది. అయితే ఈ ఒక్కరోజు నువ్వు తెగిస్తే మనం గెలుస్తాం అని చెప్తాడు. అయితే నువ్వు నా రూంలోనే ఉండు అని మనోహరి చెప్తుంది.
అంజు...మనోహరి కూతురే...
అంజు తన కూతురేనని మనోహరి తెలుసుకుంటుందా? రణ్వీర్, మనోహరి భార్యాభర్తలనే విషయం ఎలా భయటపడుతుంది? అన్న విషయాలు తెలియాలంటే నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాల్సిందే.