NNS September 22nd Episode: భాగీని గెలిపించిన అమ‌ర్ - అరుంధ‌తికి మ‌నోహ‌రి వార్నింగ్ - ఘోర ఎంట్రీ!-nindu noorella saavasam september 22nd episode bhagmati wins chess game against manohari with amar help ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns September 22nd Episode: భాగీని గెలిపించిన అమ‌ర్ - అరుంధ‌తికి మ‌నోహ‌రి వార్నింగ్ - ఘోర ఎంట్రీ!

NNS September 22nd Episode: భాగీని గెలిపించిన అమ‌ర్ - అరుంధ‌తికి మ‌నోహ‌రి వార్నింగ్ - ఘోర ఎంట్రీ!

Nelki Naresh Kumar HT Telugu
Sep 22, 2024 10:59 AM IST

NNS September 22nd Episode:నిండు నూరేళ్ల సావాసం సెప్టెంబ‌ర్ 22 ఎపిసోడ్‌లో ఈ పౌర్ణ‌మి రోజు నీకు తోడుగా కుటుంబంలో ఒక‌రిని పంపిస్తాన‌ని అరుంధ‌తికి మ‌నోహ‌రి వార్నింగ్ ఇస్తుంది. మ‌నోహ‌రి వార్నింగ్‌తో అరుంధ‌తి కంగారు ప‌డుతుంది. మ‌నోహ‌రితో భాగీ చెస్ ఆడుతుంది. భాగీని అమ‌ర్ గెలిపిస్తాడు.

నిండు నూరేళ్ల సావాసం సెప్టెంబ‌ర్ 22 ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సెప్టెంబ‌ర్ 22 ఎపిసోడ్‌

NNS September 22nd Episode: రణవీర్‌ తన ఆస్తులు కాపాడుకోవడానికి కోర్టులో పిటిషన్‌ వేయాలని లాయర్‌ కు చెప్తాడు. మా నాన్న దుర్గ పేరు మీద కోట్ల ఆస్తులు రాశార‌ని, దుర్గను కోర్టుకు తీసుకెళ్లి నా ఆస్థిని కాపాడుకుంటాన‌ని రణవీర్ అంటాడు. మరోవైపు పిల్లలు గేమ్‌ ఆడుతుంటే మనోహరి వచ్చి బాల్‌ పట్టుకుంటుంది.ఘోర చెప్పినట్టు ఆత్మ ఉన్న దగ్గర చెట్లు ఊగుతుంటాయి. గాలి వీయ‌డంతో గేటు పక్కన చూస్తుంది. పిల్లలను లోపలికి పంపించి ఆరు ఆత్మ దగ్గరకు వెళ్తుంది మనోహరి.

మ‌నోహ‌రి వార్నింగ్‌...

ఆరు ఆత్మ దగ్గరకు వెళ్ళిన మనోహరి ఈ పౌర్ణమి రోజు నీ కుటుంబంలో ఒకరిని నీకు తోడుగా పంపిస్తున్నాను రెడీ ఉండు అంటూ చెప్పి వెళ్లిపోతుంది. మ‌నోహ‌రి మాట‌ల‌తో ఆరు భయపడుతుంది. మనోహరి లోపలికి వెళ్లగానే భాగీ కిందకు వస్తుంది. గార్డెన్‌ లో ఆరును చూసి అక్కా అని పిలుస్తుంది. ఆరు షాక్‌లో ఉంటుంది. భాగీ ఎంత పిలిచినా పలకదు. ఇంతలో లోపలి నుంచి బయటకు వచ్చిన

మనోహరి ఆరు అక్కడ ఉంటే ఇప్పుడు ఇది వెళ్లి మాట్లాడుతుంది. అంటే ఆరు నేను చెప్పింది విని ఉంటుందని అనుకుంటుంది. నేను చెప్పాలనుకున్నది నువ్వు విన్నావు ఆరు. ఇప్పుడు కూడా నీకు తెలియకుండా నీతో ఎలా ఆట ఆడబోతున్నానో చూడు అని మ‌నోహ‌రి లోలోన అనుకుంటుంది.

ఆరును స‌ల‌హా అడిగిన భాగీ...

భాగీ గట్టిగా ఆరును పిలిచి అక్కా ఒక పెద్ద సమస్య వచ్చింది చిన్న సొల్యూషన్‌ కావాలి అని అడుగుతుంది. కానీ భాగీ మాట‌ల‌ను ఆరు ప‌ట్టించుకోకుండా ఆలోచ‌న‌లో మునుగుతుంది. ఏంటక్కా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూస్తున్నావు భాగీ. ఏం లేదు మిస్సమ్మ ఏంటో చెప్పు అంటుంది ఆరు.

దుష్ట‌శ‌క్తి...

పౌర్ణమి రాబోతుంది కదా? ఇలాంటి ఒక పౌర్ణమి నాడే ఏదో ఒక శక్తి నన్ను ఆవహించి ఆయన పక్కన పీటల మీద కూర్చునేలా చేసింది అక్కా.. అంటుంది భాగీ. ఏదో ఒక శక్తి కాదు బాలిక. దుష్టశక్తి అది ఈ శక్తే.. అంటాడు గుప్త. మళ్లీ పౌర్ణమి వస్తుంది కదా.. ఈసారి కూడా ఆ శక్తి నాలోకి వచ్చి ఆయన

దగ్గరకు వెళ్లి ఆరోజు పెళ్లి పీటల మీద కూర్చోవడానికి నాకు ఏ సంబంధం లేదని చెప్తే నా లైన్‌ క్లియర్‌ అయిపోతుంది అక్కా అంటుంది భాగీ.

భాగీ లైన్ క్లియ‌ర్‌...

అయ్యో అయ్యయ్యో.. సమస్య సృష్టించిన వారినే సమాధానం అడుగుతున్నది. పిచ్చి బాలిక అని భాగీ గురించి గుప్తా అనుకుంటాడు. గుప్తామీరు ఆగుతారా? అంటూ అత‌డి నోరు మూయిస్తుంది ఆరు. ఎవరితో మాట్లాడుతున్నారు అక్కా..అని భాగీ అడిగిన ప్ర‌శ‌కు నాలోనే ఉన్న నాతోనే నేను మాట్లాడుకుంటున్నాను అని ఆరు స‌మాధాన‌మిస్తుంది. అక్కా నా లైన్‌ క్లియర్ అయిపోతే మేము కూడా అందరి భార్యాభర్తల్లా.. పాలు నీళ్లలా, పప్పులో ఉప్పులా.. మనోహరి, కుళ్లులా కలిసే ఉంటాం అని అరుంధతితో భాగీ అంటుంది. భాగీ మాటలు వినిహతవిధి.. అంటుంది ఆరు.

గుప్తాపై ఫైర్…

అక్కా ఏమో అన్నారు అని భాగీ అడగగానే ఏమీ లేదు… ఏమీ అనలేను. ఏమీ అనకూడదు కూడా. ఏమీ అననులే అంటుంది అర్థ‌కాకుండా బ‌దులిస్తుంది ఆరు. ఎందుకు అనలేరు. ఎందుకు అనకూడదు అని అడగ్గానే ఆరు కోపంగా గుప్తాను తిడుతుంది.

ఆరు త‌న‌తో కాకుండా మ‌రొక‌రితో మాట్లాడుతుండ‌టం భాగీ గ‌మ‌నిస్తుంది. కానీ ఎవ‌ర‌న్న‌ది ఆమెకు అంతుప‌ట్ట‌దు. భాగీఎవరితో మాట్లాడుతున్నావో చెప్ప‌మ‌ని ఆరును ప‌ట్టుప‌డుతుంది భాగీ. నా పక్కన ఒక దెయ్యం ఉందంటూ భాగీని భ‌య‌పెడుతుంది ఆరు. సరేలే నేనే ఏదో ఒకటి ప్లాన్ చేస్తా.. అనుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది భాగీ.

అంజు, అమ్ము చెస్‌...

మరోవైపు అంజు, అమ్ము చెస్‌ ఆడుతుంటారు. అంజు సైలెంట్‌గా ఉంటే.. ఏంటి భయపడిపోయావా? అని

అమ్ము అడగ్గానే భయం అంటే ఏంటని అడుగుతుంది అంజు. భాగీ వచ్చి నీ ప్రొగ్రెస్‌ రిపోర్టు మీ డాడీ చేతిలో ఉన్నప్పుడు నీకు ఉంటుంది చూడు దాన్నే భయం అంటారు అని చెప్పగానే అదేం లేదని అంజు వెంటనే చెక్ చెప్తుంది. దీంతో పిల్లలు తమ మూడు నెలల ప్యాకెట్‌ మనీ పోయిందని బాధపడుతారు. శివరాం వచ్చి ఆడి అంజు చేతిలో ఓడిపోతాడు.

భాగీని గెలిపించిన అమ‌ర్‌...

ఇంతలో మనోహరి నేనాడతా అని వస్తుంది. దీంతో భాగీ, మనోహరి చెస్ఆడుతుంటారు. ఇంతలో అమర్‌ వచ్చి భాగీని గెలిపిస్తాడు. మనోహరిని నీతో మాట్లాడాలని లోపలికి పిలుస్తాడు అమర్‌. మనోహరి గురించి అమర్​కి తెలిసిపోతుందా? అమర్​ నుంచి తప్పించుకోవడానికి మనోహరి ఏం చేయనుంది?

అన్న‌ది తెలియాలంటే సెప్టెంబర్​ 22 (ఆదివారం) నాటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ చూడాల్సిందే.