Deepika Padukone: రణవీర్ సింగ్‌తో కలిసి ఆసుపత్రికి దీపికా పదుకొణె.. ఇక గుడ్‌ న్యూస్ చెప్పడమే తరువాయి!-bollywood couple ranveer singh and deepika padukone reach mumbai hospital ahead of the arrival of their baby ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Deepika Padukone: రణవీర్ సింగ్‌తో కలిసి ఆసుపత్రికి దీపికా పదుకొణె.. ఇక గుడ్‌ న్యూస్ చెప్పడమే తరువాయి!

Deepika Padukone: రణవీర్ సింగ్‌తో కలిసి ఆసుపత్రికి దీపికా పదుకొణె.. ఇక గుడ్‌ న్యూస్ చెప్పడమే తరువాయి!

Galeti Rajendra HT Telugu
Sep 08, 2024 12:24 PM IST

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలోకి వెళ్లారు. ఈ నెలలోనే దీపికా పదుకొణెకి డాక్టర్లు డెలివరీ డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

దీపికా పదుకొణె, రణవీర్ సింగ్
దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ (Instagram)

Deepika Padukone Baby: బాలీవుడ్ నటులు దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రగెన్సీ గురించి అభిమానులకి తెలియజేసిన ఈ బాలీవుడ్ జంట.. శనివారం సాయంత్రం ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేరినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శనివారం ఈ దంపతులు కారులో ఆసుపత్రికి వెళ్లగా.. నిమిషాల వ్యవధిలో దీపిక, రణవీర్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే డెలివరీ కోసం వెళ్లారా లేదా నార్మల్ చెకప్ కోసం వెళ్లారా? అనేదానిపై మాత్రం ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. కానీ సెప్టెంబరులోనే దీపికా పదుకొణెకి డెలివరీ డేట్‌ను వైద్యులు ఇచ్చినట్లు మాత్రం ఈ బాలీవుడ్ దంపతులు ఫిబ్రవరిలోనే క్లారిటీ ఇచ్చారు.

వినాయక చవితికి ఒక రోజు ముందు.. అంటే శుక్రవారం దీపిక పదుకొణె, రణవీర్ సింగ్ ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఒక్క రోజు వ్యవధిలోనే ఆసుపత్రికి ఈ జంట వెళ్లడంతో గుడ్ న్యూస్ రాబోతోందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫిబ్రవరి నుంచి వెయిటింగ్

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రగ్నెన్సీ గురించి వార్తను దీపిక తొలుత అభిమానులకి షేర్ చేశారు. 'సెప్టెంబర్ 2024' అనే క్యాప్షన్‌తో బేబీ షూస్, దుస్తులతో కూడిన అందమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 2018లో ఇటలీలోని లేక్ కోమోలో దీపిక పదుకొణె, రణవీర్ సింగ్‌‌ల వివాహం జరిగిన విషయం తెలిసిందే.

కల్కి 2898 ఏడీ సినిమాలో ఇటీవల నటించిన దీపికా పదుకొణె 2025 మార్చి వరకు షూటింగ్‌లకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. డెలివరీ తర్వాత కొన్నాళ్ల పాటు బేబీతో సమయం గడపాలనే ఉద్దేశంతో ఆమె మార్చి వరకు ఎలాంటి సినిమాల్ని అంగీకరించలేదు. మార్చి తర్వాత కల్కి 2898 ఏడీ మూవీ సీక్వెల్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తో కలిసి నటించనుంది.

దీపావళికి ఒక సినిమా రెడీ

దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కలిసి నటించిన సింగం ఎగైన్ మూవీ దీపావళికి విడుదలకానుంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అజయ్ దేవగణ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితర స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారు.