Saturn transit: దీపావళి తర్వాత నుంచి ఈ రాశుల వారి కష్టాలు తీరిపోతాయి, ఇక అంతా ఆనంద క్షణాలే-after diwali saturn direct transit in kumbha rashi three zodiac signs people relief from problems ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit: దీపావళి తర్వాత నుంచి ఈ రాశుల వారి కష్టాలు తీరిపోతాయి, ఇక అంతా ఆనంద క్షణాలే

Saturn transit: దీపావళి తర్వాత నుంచి ఈ రాశుల వారి కష్టాలు తీరిపోతాయి, ఇక అంతా ఆనంద క్షణాలే

Gunti Soundarya HT Telugu
Sep 04, 2024 11:06 AM IST

Saturn transit: దీపావళి తర్వాత నుంచి శని ప్రత్యక్ష సంచారంలో ఉంటుంది. దీని ప్రభావం మూడు రాశుల వారికి అధికంగా ఉండబోతుంది. శని ప్రభావంతో వీరి కష్టాలు తీరిపోతాయి. ఆనంద క్షణాలు ప్రారంభమవుతాయి. ఏ రాశుల వారు లాభపడతారో చూద్దాం.

శని ప్రత్యక్ష సంచారం
శని ప్రత్యక్ష సంచారం

Saturn transit: వేద జ్యోతిష్య శాస్త్రంలో శనిని నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణిస్తారు. ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి లేదా వెళ్ళడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది.

ఈ కాలంలో శని తన మూల త్రికోణ రాశి కుంభ రాశిలో ఉంటాడు. శని గ్రహం మార్చి 2025 వరకు తన రాశిలో ఉంటుంది. శని తన రాశిలో ఉంటూనే ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు అది తిరోగమనం చెందుతుం, కొన్నిసార్లు నేరుగా కదులుతుంది.

29 జూన్ 2024న కుంభ రాశిలో శని తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. 15 నవంబర్ 2024న సాయంత్రం 05:09 గంటలకు కుంభ రాశిలో శని ప్రత్యక్ష సంచారం ప్రారంభిస్తుంది. కుంభ రాశిలో శని ప్రత్యక్షంగా సంచరించడం వల్ల అన్ని రాశుల వారి జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. దీపావళి పండుగ నుంచి కొన్ని రాశుల వారి జీవితంలో శని వెలుగులు నింపబోతున్నాడు. శని ప్రత్యక్షంగా ఉండటం వల్ల అదృష్టం ఎవరికి కలగబోతుంది.

మిథున రాశి

కుంభ రాశిలో శని ప్రత్యక్షంగా తిరుగుతున్నందున మిథున రాశి వారికి ఈ కాలంలో బహుళ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అదృష్టం, తొమ్మిదవ ఇంట్లో శని సంచరిస్తాడు. జీవితంలోని ప్రతి అంశంలో విజయం సాధించగలరు. ధనలాభం కలగడంతోపాటు రుణ విముక్తి లభిస్తుంది. సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు. కార్యాలయంలో సీనియర్ అధికారులు మీకు మద్దతుగా కనిపిస్తారు. కెరీర్‌లో మంచి పేరు సంపాదిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇది అనుకూలమైన కాలం.

మేష రాశి

శని సంచారం మేష రాశి వారికి లాభాలు ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరిగి వివిధ రంగాల్లో విజయం సాధించగలుగుతారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక సంక్షోభం వల్ల బాధపడదు. కార్యాలయంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. కొన్ని కొత్త బాధ్యతలను పొందుతారు. వారి జీతాలు పెరగవచ్చు. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ఇప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అన్ని సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోగలరు.

మకర రాశి

శని ప్రత్యక్ష సంచారం మకర రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. సౌకర్య స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల వారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో పెట్టె పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు వారి కల నెరవేరుతుంది. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ, వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. వైవాహిక జీవితంలోని కష్టాలు ఇప్పటికి కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.