NNS May 11th Episode: హాస్పిటల్‌కు అమర్.. సరస్వతిని చంపేయమని మనోహరి ఆర్డర్.. అరుంధతి కోసం గుప్తకు యముడి ఆదేశం
11 May 2024, 6:22 IST
- Nindu Noorella Saavasam May 11th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 11వ తేది ఎపిసోడ్‌లో సరస్వతి మేడమ్‌ని కలిసేందుకు అమర్ వెళ్తున్నట్లు రాథోడ్ చెబుతాడు. దానికంటే ముందే లారీ డ్రైవర్‌కు సరస్వతిని చంపేయమని ఆర్డర్ ఇస్తుంది మనోహరి. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 11వ తేది ఎపిసోడ్
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 11th May Episode) అరుంధతి కష్టాన్ని చూసి చలించిన యముడు తను అడిగిన విధంగా మాయాదర్పణంలో తన పిల్లలు, కుటుంబాన్ని చూపించమని చిత్రగుప్తుడిని ఆదేశిస్తాడు. అమర్, పిల్లలతోపాటు ఇంటికి చేరుకున్న రామ్మూర్తి కంగారుగా కారు దిగి ఇంట్లోకి పరుగులు పెట్టి త్వరగా దిష్టి తీయడానికి ఎర్రనీళ్లు తెమ్మని మంగళకు చెబుతాడు.
కుడికాలు లోపలికి పెట్టి
అమర్ కారు దిగకుండా కూర్చోవడంతో రాథోడ్ భాగీని పిలవమంటాడు. భాగీ వెళ్లి అమర్‌ని దిగమని పిలుస్తుంది. కారు దిగి ఇంట్లోకి నడుస్తాడు అమర్. కంగారు పడుతున్న మనోహరిని చూసి ఏమైంది అమ్మగారు అంటాడు రాథోడ్. ఏంలేదు రాథోడ్ ఎండ కదా అంతే అంటుంది మనోహరి. రామ్మూర్తి మంగళను పిలిచి అమర్, భాగీకి హారతి ఇవ్వమంటాడు. దంపతులిద్దరినీ కుడికాలు పెట్టి లోపలకు రమ్మంటాడు రామ్మూర్తి. మనోహరి కోపంగా చూస్తుంది.
పిల్లలు ఇంట్లోకి వస్తూనే చుట్టూ చూస్తారు. రామ్మూర్తి వాళ్లని చూస్తూ ఇల్లు ఇరుకుగా ఉందా బాబు.. ఇది తరతరాలుగా వస్తున్న ఇల్లు, ఈ ఇంట్లోనే నా పెద్దకూతురుని దూరం చేసుకున్నాను అంటాడు. ఇంటికి బయలుదేరినప్పటినుంచీ పెద్దకూతురు గురించే మాట్లాడుతున్నారు ఈ ఇంట్లో ఉండగానే నిజం తెలిసిపోతుందా అని మనోహరి చెవుల్లో చెబుతుంది మంగళ.
గుండెల్లో బాధ తీరినట్లు
పిల్లలను చూసి మీకు ఇల్లు నచ్చలేదా అని అడుగుతాడు రామ్మూర్తి. దానికి పిల్లలు.. లేదు తాతయ్య.. మాకు చాలా నచ్చింది. ఈ ఇంటికి రావడం ఇదే మొదటిసారి అయినా ఇదివరకు చాలాసార్లు వచ్చినట్లు అనిపిస్తుంది అంటారు. నాకు కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు అలాగే అనిపించేది బాబు. నాకు బాగా కావాల్సిన వాళ్లు అక్కడ ఉన్నట్లు, అక్కడికి రాగానే గుండెల్లో బాధ తీరినట్లు అనిపించేది అని చెబుతాడు రామ్మూర్తి. అందరూ ఆశ్చర్యపోతారు.
అంతలోనే అయ్యో.. మిమ్మల్ని నిల్చోబెట్టే ఏదేదో చెబుతున్నాను. మంగళ పిల్లలకు త్వరగా పాలు కాచి ఇవ్వు. రండి బాబు కూర్చోండి అంటాడు రామ్మూర్తి. అమర్‌ని ఫ్రెష్ అవడానికి ఆ రూమ్‌కి వెళ్లమని మిస్సమ్మ చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్తాడు. అరుంధతిని చంపిన లారీ డ్రైవర్‌కి ఫోన్ చేసి హాస్పిటల్‌లో ఉన్న సరస్వతి మేడమ్‌ని చంపమని చెబుతుంది మనోహరి.
మా నాన్నతో మాట్లాడుతాను
అమర్ తనకు సరస్వతి మేడమ్ చెప్పాలనుకున్న విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె ఏదో చెప్పాలనుకుంటుందని, అది చాలా ముఖ్యమైనది అయుంటుదని అనుకుంటాడు. అప్పుడే మిస్సమ్మ అక్కడకు వచ్చి మీ బాధ, ఇబ్బంది మీరు చెప్పకపోయినా అర్థమవుతుంది. మీకు వెళ్లాలనిపిస్తే వెళ్లిపోండి. నేను మా నాన్నతో మాట్లాడుతాను అంటుంది.
ఏంటీ.. ఇందాక నుంచీ నా గురించి, నా బాధ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏవో నాలుగు మాటలు మంచిగా మాట్లాడితే నేను నీ మోసం మర్చిపోతాను అనుకోకు మిస్సమ్మ అని హెచ్చరిస్తాడు అమర్. దానికి కోపంగా.. మిమ్మల్ని నావైపు తిప్పుకోవాలని ఏం మాట్లాడటం లేదు అంటుంది మిస్సమ్మ. అమర్ కోపం చూసి అక్కడనుంచి వెళ్లిపోతుంది. మిస్సమ్మను చూసి ఏమైంది లోపలేమైనా గొడవపడ్డారా అని అడుగుతాడు రాథోడ్.
గుండెనొప్పి వచ్చిందా
రామ్మూర్తి మాత్రం కొత్తగా పెళ్లైనవాళ్లు ఏదో గిల్లికజ్జాలు పడుతుంటారు అంటాడు. దానికి అదేం లేదు నాన్న మీరు మానుంచి ఎక్కువగా ఆశిస్తున్నారు. ఆయన ఇప్పటికే నా మీద కోపంగా ఉన్నారు. మీకు నిజంగానే గుండెనొప్పి వచ్చిందా నాన్న.. అప్పటివరకు బానే ఉన్న మీరు సడెన్‌గా గుండెనొప్పి అన్నారు. మళ్లీ వెంటనే మామూలు అయిపోయారు అని అడుగుతుంది భాగమతి.
ఉత్తినే గుండెనొప్పి ఎలా వస్తుంది అంటూ అక్కడనుంచి వెళ్లిపోతాడు రామ్మూర్తి. కంగారు పడుతున్న మనోహరిని మరింత కంగారు పెట్టేందుకు అమర్ హాస్పిటల్‌కి వెళ్లాలనుకుంటున్నాడని చెబుతాడు రాథోడ్. అమర్ సరస్వతి మేడమ్ దగ్గరకు వెళ్తాడా? సరస్వతి మేడమ్‌ని చంపడానికి వచ్చిన డ్రైవర్ అమర్‌కి చిక్కుతాడా? అనే విషయాలు తెలియాలంటే మే 13న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్