తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns March 22nd Episode: మిస్సమ్మకు మనోహరి వార్నింగ్.. ఏడుస్తూ పరిగెత్తిన అరుంధతి.. టూర్‌కు పిల్లలు

NNS March 22nd Episode: మిస్సమ్మకు మనోహరి వార్నింగ్.. ఏడుస్తూ పరిగెత్తిన అరుంధతి.. టూర్‌కు పిల్లలు

Sanjiv Kumar HT Telugu

22 March 2024, 12:02 IST

google News
  • Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 22వ తేది ఎపిసోడ్‌లో తాను ఎవరి కూతురో తెలుసుకున్న అరుంధతి ఏడుస్తూ పరుగెత్తుతుంది. మరోవైపు మిస్సమ్మకు ఇంకా నాలుగైదు దెబ్బలు తగులుతాయని వార్నింగ్ ఇస్తుంది మనోహరి. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 22వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 22వ తేది ఎపిసోడ్‌

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 22వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam March 22nd Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 22nd March Episode) మీకు మిస్సమ్మ కాకుండా ఇంకొక అమ్మాయి ఉందా అని రామ్మూర్తిని అడుగుతాడు గుప్తా. రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎందుకండీ ఏడుస్తున్నారు అంటున్న గుప్తతో.. ఆడపిల్ల చేత కన్నీళ్లుపెట్టించకూడదు అలాంటిది. నేను నా కూతురికి అన్ని కష్టాలే ఇచ్చాను. పుట్టగానే అనాధ ఆశ్రమంలో వేశాను అని రామ్మూర్తి చెబుతాడు.

షాక్ అయిన అరుంధతి

ఆ బంగారు తల్లిని ఎంతో ముద్దుగా మురిపంగా పెంచుకోవాల్సిన నేనే వద్దని హాస్టల్లో నాకు తెలియకుండానే వేశాను. కానీ, ఆ తరువాత అన్ని హాస్టల్స్ వేతికాను నా కూతురు ఎక్కడా దొరకలేదు. కానీ ఈ మధ్యనే తెలిసింది నా కూతురు సరస్వతి అనే వార్డెన్​ దగ్గర పెరిగింది అంట అని రామ్మూర్తి బాధపడతాడు. ఆ మాట విన్న అరుంధతి షాకవుతుంది. కచ్చితంగా ఇతనితో అరుంధతి కూడా వచ్చే ఉంటుంది అని అనుకుంటుంది మంగళ. నా కూతుర్ని కష్టాలపాలు చేశాను జీవితంలో క్షమించరాన్ని తప్పు చేశాను అని రామ్మూర్తి పశ్చత్తాప పడతాడు.

ఏవండీ ఈ మధ్యనే మీకు ఆరోగ్యం బాగోలేదు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని బాధపడడం అవసరమంటావా. బాబు నువ్వు వెళ్లిపో అంటుంది మంగళ. తండ్రి బాధ చూసిన అరుంధతి ఏడుస్తూ వెళ్లిపోతుంది. బాలిక ఆగుము అంటూ గుప్తా వెళ్లిపోతాడు. కచ్చితంగా ఇతని వెంట అరుంధతి కూడా వచ్చింది వెంటనే మనోహరికి చెప్పాలి అయినా చెప్పిన ఏం లాభం లేదు. డబ్బులేమైనా ఇస్తుందా అని మంగళ ఊరుకుంటుంది.

మనోహరి ఒక అడుగు ముందే వేసింది నేనే వెనకడుగు వేశాను తన ప్లాన్ ఏంటో కనిపెట్టలేకపోయాను ఏం చేయాలి అని ఆలోచిస్తుంది భాగమతి.

ఇంకా నాలుగైదు దెబ్బలు

ఏంటి మిస్సమ్మ ఒక్క దెబ్బకే చాప పిల్లల కొట్టుకున్నట్టు గిలగిలా కొట్టుకుంటున్నావా. ఈ మనోహరితో ఎందుకురా పెట్టుకున్నాను అనుకుంటున్నావా. ఈ ఒక్క దెబ్బకే ఇలా అయిపోతే నాలుగైదు దెబ్బలు తగులుతాయి అప్పుడు ఎలా తట్టుకుంటావు మిస్సమ్మ. చూస్తూ ఉండు నేను ఏం చేస్తానో అని మనోహరి అంటూ ఉండగా స్కూల్ ప్రిన్సిపాల్ మేడం వస్తుంది. రండి మేడం అని మనోహరి ప్రిన్సిపాల్‌ను అమర్​ దగ్గరికి తీసుకు వెళుతుంది.

మేడంని పిలిపించింది అంటే మనోహరి ఎదో చేయబోతుంది పిల్లల్ని దూరం చేస్తుందా అని వెళ్తుంది భాగమతి. కట్ చేస్తే, ఏంటి మేడం ఇలా వచ్చారు అంటాడు అమర్​. పిల్లలు మీ మేడం వచ్చింది రండి అని పిలుస్తాడు శివరామ్. అంజలి నువ్వు ఏమైనా చేసావా అంటుంది అమ్ము. స్కూలే లేదు ఇక నేనేం చేస్తాను అంటుంది అంజలి. మీతో మాట్లాడడానికి వచ్చాను అంటుంది మేడం. నాతోటి ఏంటో చెప్పండి మేడం అని అంటాడు అమర్​. ఏమీ లేదు సార్ పిల్లలకి సంబర సెలవుల్లో టూర్ ప్లాన్ చేసాం అలాగే అకాడమీ కూడా ప్లాన్ చేస్తున్నాం పర్సనల్‌గా మాట్లాడదామని వచ్చాను అని మేడం అంటుంది.

కన్నిన్స్ చేసిన మనోహరి

పిల్లలు ఏటూరుకు రారు వాళల చదువు విషయం అంటారా ఇక నేను చూసుకుంటాను అంటుంది భాగమతి. మిస్సమ్మ నువ్వు పిల్లలకు తల్లివి కాదు కేర్ టేకర్ వి ఈ విషయమైనా అమర్ తీసుకుంటాడు నువ్వు చెప్పు అమర్ అని మనోహరి అంటుంది. నాకు కూడా పిల్లలని పంపించడం ఇష్టం లేదు ఇక చదువు విషయం అంటారా మిస్సమ్మ చూసుకుంటుంది అంటాడు అమర్​. నీతో మాట్లాడాలి ఒక ఐదు నిమిషాలు అని మనోహరి అమర్​ని పక్కకి పిలుస్తుంది.

ఎంటి అమర్‌ పిల్లలు ఆరు లేదనే బాధ నుంచి బయటపడటానికి ఇంత మంచి అవకాశం వస్తుంటే నువ్వు వద్దంటున్నావు అంటుంది మనోహరి. ఎవరూ లేకుండా పిల్లలన్ని అంతదూరం పంపించడం నాకు ఇష్టం లేదు మనోహరి అంటాడు అమర్​. పిల్లలను ఈ టైంలోనే మనకు దూరం ఉండాలని లేదంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం పిల్లలు చూస్తే తట్టుకోలేరని మనోహరి, అమర్‌ను కన్విన్స్‌ చేస్తుంది. లోపలికి వెళ్లిన అమర్‌ పిల్లలు టూర్‌కు వస్తారని చెప్పి వెళ్లిపోతాడు. పిల్లలు బాధపడుతుంటారు. మనోహరి హ్యపీగా ఫీలవుతుంది.

మిస్సమ్మకు వార్నింగ్

మిస్సమ్మ బయటకు వెళ్లగానే వెనకాలే వెళ్లిన మనోహరి.. నువ్వు ఇంట్లో ఎందుకున్నావ్‌ అని పిల్లలు ఇంట్లో లేకుంటే నీకు ఇంట్లో ఏం పని అంటుంది మనోహరి. ఇక నుంచి నేను ఆడే ఆట ఎంత భయంకరంగా ఉంటుందో నీకు చూపిస్తాను. ఈ మనోహరితో ఎందుకు పెట్టుకున్నానా అని నువ్వు ఫీల్‌ అయ్యేలా చేస్తానని మనోహరి, మిస్సమ్మకు వార్నింగ్‌ ఇచ్చి వెళ్తుంది. ఏడుస్తూ వెళ్తున్న అరుంధతిని గుప్తా ఫాలో అవుతాడు.

బాలికా ఆగుము.. ఏమైనది బాలికా ఎందుకు పరుగెత్తుతున్నావు అంటాడు గుప్త. భాగీ నా సొంత చెల్లి గుప్తగారు. ఆయన నా తండ్రి. నేను మీకు చెప్పాను కదా వాళ్లకు నాకు సంబంధం ఉంది వాళ్లు నా రక్తమేనని రక్తం పంచుకున్నాను కాబట్టే భాగీకి నేను కనిపిస్తున్నాను. నాకు జన్మనిచ్చారు కాబట్టే ఆయనకు నా ఉనికి అర్థమవుతుంది అంటుంది అరుంధతి. అటులైనా నువ్వు ఉన్న ఆశ్రమంనందే మనోహరి కూడా ఉన్నది. మనోహరి కూడా ఆయన కూతురు అయ్యుండొచ్చు కదా? అంటాడు గుప్త.

డాడీకి నువ్వే చెప్పాలి

లేదు గుప్త గారు నేను నిజం తెలుసుకున్నానని ఇలా మాట్లాడుతున్నారు అంటుంది అరుంధతి. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది ఈ విషయాలు కాదు. నీ ఇంటిని, నీ పిల్లలను ఆ మనోహరి నుంచి కాపాడటానికి మిస్సమ్మ చాలా కష్టపడుతుంది ఆమెకు నువ్వు సాయం చేయాలి అని చెప్తాడు గుప్త. మిస్సమ్మ దగ్గరకు పిల్లలు వచ్చి ఏడుస్తారు. తాము క్యాంపుకు వెళ్లమని మా డాడీకి నువ్వే చెప్పాలని అడుగుతారు.

చూడండి నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు మిమ్మల్ని ఇల్లు దాటనివ్వను. మీరు సమ్మర్‌ క్యాంపుకు వెళ్లకుండా ఆపే బాధ్యత నాది అని పిల్లలకు మాటిస్తుంది మిస్సమ్మ. పిల్లలు క్యాంప్​కి వెళ్లకుండా మిస్సమ్మ ఏం చేయబోతోంది? అరుంధతిని చంపడానికి ప్లాన్​ వేసింది ఎవరనేది అమర్​కి తెలుస్తుందా? అనే విషయాలు తెలియాలంటే మార్చి 23న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం