Ban Maharaj Movie: ఆమిర్‌ఖాన్ కొడుకు సినిమాను బ్యాన్ చేయాలంటూ నెటిజన్ల డిమాండ్ - నెట్‌ఫ్లిక్స్‌పై ట్రోల్స్
13 June 2024, 12:02 IST
Ban Maharaj Movie: ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్‌ఖాన్ హీరోగా నటిస్తోన్న మహారాజ్ మూవీని బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ను బాయ్‌కట్ చేయాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ వివాదాలకు కారణం ఏమిటంటే?
ఆమిర్‌ఖాన్ , జునైద్‌ఖాన్
Ban Maharaj Movie: ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ మహరాజ్ మూవీ రిలీజ్‌కు ముందే వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మహారాజ్ మూవీతో జునైద్ ఖాన్ హీరోగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్...
నిజజీవిత ఘటనల ఆధారంగా దర్శకుడు సిద్దార్థ్ పి మల్హోత్రా మహరాజ్ మూవీని తెరకెక్కించాడు. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా మహారాజ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో బ్రిటీష్ కాలంలో భక్తి పేరుతో జరిగిన అన్యాయాలను ప్రశ్నించే జర్నలిస్ట్ పాత్రలో జునైద్ ఖాన్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తోండగా...జైదీ అహ్లవత్ ఓ కీలక పాత్ర పోషిస్తోన్నాడు.
బ్యాన్ చేయాలి...
రిలీజ్‌కు ఒక రోజు ముందు మహరాజ్ సినిమా వివాదాలతో వార్తల్లో నిలిచింది. మహరాజ్ సినిమాను బ్యాన్ చేయాలంటూ నెటిజన్లతో పాటు కొన్ని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తోన్నాడు. హిందువుల మనోభావాలను, నమ్మకాలను దెబ్బతీసేలా ఈ సినిమా పోస్టర్స్ ఉన్నాయని ఈ సినిమాను విడుదల చేయద్దని ట్వీట్స్ చేస్తోన్నారు. సాధువులను, హిందు మత పెద్దలను నెగెటివ్ కోణంలో ఈ సినిమాలో చూపించారని అంటున్నారు.
పీకే సినిమాలో ఆమీర్‌ఖాన్...
పీకే సినిమాలో ఆమిర్ ఖాన్ శివుడిపై జోకులు వేశాడని, ఇప్పుడు అతడి కొడుకు జునైద్ హిందు మతాన్ని, ఆచారాలు, సంస్కృతలను మహారాజ్ మూవీతో వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావద్దని భజరంగ్ దళ్‌కు చెందిన ఓ నాయకుడు ట్వీట్ చేశాడు.
హిందు వ్యతిరేక కథతో...
హిందూ సాధువులను, సన్యాసులను కామంధులుగా చిత్రీకరిస్తూ వారిని మహారాజ్ మూవీతో అవమానించాలని యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో పాటు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. హిందూ వ్యతిరేక కథతో తన కొడుకును హీరోగా ఆమిర్‌ఖాన్ పరిచయం చేయడం సిగ్గుచేటు అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
బాయ్‌కట్ నెట్‌ఫ్లిక్స్...
నెట్‌ఫ్లిక్స్‌ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ పలువురు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. వివాదాలను దృష్టిలో పెట్టుకొని తెలివిగా మహరాజ్ మూవీ ట్రైలర్స్, టీజర్స్‌ను ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయలేదని అంటున్నారు.
ట్విట్టర్‌లో ట్రెండింగ్...
ప్రస్తుతం బాయ్‌కట్ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు బ్యాన్ మహరాజ్ మూవీ హ్యాష్‌ట్యాగ్స్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతోన్నాయి. మరికొందరు నెటిజన్లు వారసుల సినిమాలను చూడొద్దంటూ ట్వీట్స్ చేస్తున్నారు. నెపోటిజంప్రోత్సహించే ఇలాంటి సినిమాలను బ్యాన్ చేయాలంటూ కామెంట్స్ పెడుతోన్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా
అమీర్‌ఖాన్... రీనాదత్తాను 1986లో పెళ్లిచేసుకున్నాడు. వీరికి జునైద్ పుట్టాడు. మనస్పర్థలతో 2002లో రీనాదత్తా నుంచి విడిపోయిన ఆమీర్ ఆ తర్వాత కిరణ్ రావ్‌ను పెళ్లాడారు. 2021లో వీరి వైవాహిక బంధం ముగిసింది.పీకేతో పాటు తండ్రి ఆమిర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమాలకు జునైద్‌ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. మహారాజ్ రిలీజ్‌కు ముందే మరో రెండు సినిమాల్లో అతడు హీరోగా నటించబోతున్నాడు.