Nagarjuna to meet Samantha: సమంతను కలవనున్న నాగార్జున!
31 October 2022, 14:44 IST
- Nagarjuna to meet Samantha: సమంతను నాగార్జున కలవనున్నాడన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. మయోసైటిస్‌తో బాధపడుతున్న తన మాజీ కోడలిని అతడు వ్యక్తిగతంగా కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సమంత, నాగార్జున
Nagarjuna to meet Samantha: నాగచైతన్యతో విడాకుల విషయంలో అక్కినేని అభిమానులు సమంతనే ఎక్కువగా నిందించారు. వీళ్ల విడాకులకు అసలు కారణమేంటన్నది ఇప్పటి వరకూ బయటకు రాకపోయినా.. సమంతదే తప్పు అంటూ ఫ్యాన్స్ ఆడిపోసుకున్నారు. విడాకుల వార్త బయటకు వచ్చినప్పటి నుంచీ వీళ్లు విడిపోయిన తర్వాత కూడా చాలా రోజుల పాటు చైపై సానుభూతి చూపుతూ సమంతను విపరీతంగా ట్రోల్ చేశారు.
ఇప్పటికీ అక్కినేని ఫ్యాన్స్‌లో సామ్‌పై తీవ్ర అసంతృప్తి ఉంది. విడాకుల విషయంలో ఆమె ఇప్పటికే కొన్నిసార్లు పబ్లిగ్గా స్పందించింది. చైతన్యతో ప్రస్తుతం సంబంధాలు అసలే బాగాలేవని కూడా చెప్పింది. అయితే చైతన్య మాత్రం ఇప్పటి వరకూ ఎప్పుడూ ఈ అంశంపై స్పందించలేదు. ఇది కూడా ఒకరకంగా ఫ్యాన్స్‌లో ఆమెపై ఆగ్రహాన్ని పెంచాయి.
అయితే తాజాగా తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత చెప్పడంతో ఆమెపై అన్నివైపుల నుంచి సానుభూతి వ్యక్తమవుతోంది. సెలబ్రిటీలతోపాటు సాధారణ అభిమానులు కూడా ఆమెపై జాలి చూపుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో ఈ అంశంపై అక్కినేని ఫ్యామిలీ స్పందించిందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఒక్క సుశాంత్ తప్ప అక్కినేని కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. నాగచైతన్య, నాగార్జున, అమలల నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్‌గానీ, సోషల్ మీడియా పోస్ట్‌గానీ లేదు. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. సమంతను నాగార్జున నేరుగా వెళ్లి కలవనున్నాడు. అతని వెంట చైతన్య ఉంటాడా లేదా అన్నది తెలియకపోయినా.. నాగార్జునే ఆమెను కలవాలని అనుకోవడం పెద్ద వార్తే.
ఈ ఇద్దరి విడాకులు, వీళ్లు విడిపోయిన తర్వాత కూడా సమంత గురించి నాగార్జున మాట్లాడిన పాజిటివ్ మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మయోసైటిస్‌తో బాధపడుతున్న తన మాజీ కోడలిని అతడు నేరుగా వెళ్లి కలవనున్నాడన్న వార్త ఫ్యాన్స్‌ను మరింత ఆకర్షిస్తోంది. ఒకవేళ అదే జరిగితే అక్కినేని ఫ్యామిలీపై ఫ్యాన్స్‌కు ఉన్న గౌరవం, చై విషయంలో సానుభూతి మరింత పెరగడం ఖాయం.