NC 22 Poster Release: నాగ చైతన్య రెడ్ అలెర్ట్.. పోలీస్ గెటప్‌లో పవర్ ఫుల్‌గా చై-naga chaitanya new movie nc22 poster release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nc 22 Poster Release: నాగ చైతన్య రెడ్ అలెర్ట్.. పోలీస్ గెటప్‌లో పవర్ ఫుల్‌గా చై

NC 22 Poster Release: నాగ చైతన్య రెడ్ అలెర్ట్.. పోలీస్ గెటప్‌లో పవర్ ఫుల్‌గా చై

Maragani Govardhan HT Telugu
Sep 20, 2022 02:41 PM IST

Naga Chaitanya Movie with Venkat Prabhu: వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైత్యన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ బుధవారం నాడు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది.

<p>నాగ చైతన్య</p>
నాగ చైతన్య (Twitter)

Naga Chaitanya new Movie: అక్కినేని హీరో నాగ చైతన్య వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే బంగర్రాజు, థ్యాంక్యూ, లాల్ సిగ్ చడ్ఢా లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన చై.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ ద్విభాషా చిత్రానికి పచ్చజెండా ఊపాడు. ఆ సినిమా ఎప్పుడో ప్రారంభం కాగా.. బుధవారం నుంచి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. తాజాగా అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ పోస్టర్‌లో నాగచైతన్య పోలీస్ గెటప్‌లో కనిపించనున్నారు. చేతులు కట్టుకుని తీక్షణంగా చూస్తున్నట్లు పవర్ ఫుల్‌గా కనిపించాడు. గన్ టార్గెట్ చేసినప్పుడు వచ్చే లేజర్ లైట్లు అతడిపై కనిపిస్తూ ఉన్న ఈ పోస్టర్ ఆకర్షణీయంగా ఉంది. అంతేకాకుండా ఈ సినిమా రెడ్ బ్యాక్ గ్రౌండ్‌ను థీమ్‌లా వాడారు. ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ సినిమాతో నాగ చైతన్య తమిళంలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే లాల్ సింగ్ చడ్డాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చై.. తాజాగా కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. పోస్టర్‌ను బట్టి చూస్తుంటే ఈ చిత్రం.. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరెకక్కనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కూడా సంగీతాన్ని సమకూరుస్తుండటం విశేషం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చడ్ఢా ఆగస్టు 11న విడుదలై మిక్స్‌‍డ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించగా.. కరీనా కపూర్, మోనా సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఇది కాకుండా అతడు ధూత అనే వెబ్‌సిరీస్‌తో ఓటీటీ వేదికపై అరంగేట్రం చేయనున్నాడు. ఇందులో ప్రాచీ దేశాయ్ కీలక పాత్ర పోషించింది.

నాగ చైతన్య అప్పిరియన్స్, లుక్ రివీల్ చేయకుండా పోస్టర్ డిజైన్ చేశారు. పోస్టర్‌లో నాగ చైతన్యపై కొన్ని టార్గెట్‌ లు వుండటం గమనించవచ్చు. పోస్టర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో పవర్ ఫుల్ వైబ్స్ ని కలిగివుంది.

చిత్ర తారాగణం: నాగ చైతన్య, కృతి శెట్టి తదితరులు

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

సమర్పణ: పవన్ కుమార్

సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా

డైలాగ్స్: అబ్బూరి రవి

Whats_app_banner

సంబంధిత కథనం