Nagarjuna fire on Geetu: గీతూపై నాగార్జున ఫైర్.. 'బోచ్చు'లో ఆట అంటూ సీరియస్-nagarjuna fires on geetu for worst game in fish task bigg boss telugu 6 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagarjuna Fire On Geetu: గీతూపై నాగార్జున ఫైర్.. 'బోచ్చు'లో ఆట అంటూ సీరియస్

Nagarjuna fire on Geetu: గీతూపై నాగార్జున ఫైర్.. 'బోచ్చు'లో ఆట అంటూ సీరియస్

Maragani Govardhan HT Telugu
Oct 29, 2022 06:10 PM IST

Nagarjuna fire on Geetu: బిగ్‌బాస్ సీజన్ 6 8వ వారం వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున్ హౌస్ మేట్ గీతూపై ఫుల్ సీరియస్ అయ్యారు. ఆమె ఆట తీరుపై మండిపడటమే కాకుండా.. బోచ్చులో ఆటగా అభివర్ణించారు.

గీతూపై నాగార్జున సీరియస్
గీతూపై నాగార్జున సీరియస్

Nagarjuna fires on Geetu: మొన్నటివరకు చప్పగా సాగిన బిగ్‌బాస్ సీజన్ 6 ఈ వారం టాస్క్‌తో కాస్త పుంజుకుంది. హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరూ తమ వంత ప్రయత్నం చేయడమే కాకుండా వీలైనంత వినోదాన్ని పంచారు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో భాగంగా ఇచ్చిన చేపల టాస్క్‌లో అందరూ అదరగొట్టారు. అయితే గలాటా గీతూపై మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫిజికల్ టాస్క్ ఇస్తే చింపేస్తా, పొడిచేస్తానన్న గీతూ.. ఫస్ట్ బంతికి డకౌటైనట్లు టాస్క్ ప్రారంభంలోనే చేతులెత్తేసింది. తన ఆటతీరుతో అనర్హతకు గురైన వదలకుండా.. పక్కవారి గేమ్‌ను టార్గెట్ చేసింది. అసలు సంచాలక్‌గా ఉండి గేమ్ ఆడి పక్షపాతాన్ని చూపించింది. ఫలితంగా గీతూపై సదరు హౌస్ మేట్సే కాకుండా.. బయట బిగ్‌బాస్ ఆడియెన్స్ కూడా సీరియస్ అయ్యారు.

తాజాగా విడుదలైన బిగ్‌బాస్ ప్రోమోలోనూ నాగార్జున గీతూపై ఫుల్ సీరియస్ అయినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ప్రోమోను గమనిస్తే.. "ఫిజికల్ టాస్క్ ఇస్తే గుద్ది పడేస్తానన్న గీతూ ఆట ఆడిందా?" అని ఆమె పాట్నర్ ఆదిరెడ్డిని నాగార్జున ప్రశ్నిస్తారు. ఇందుకు గీతూ ఆడాను సర్ అంటూ బదులిచ్చింది. "నిన్ను అడగలేదు గీతూ అంటూ నాగార్జున ఫైర్ అవుతారు. గుద్ది పడేస్తా అన్నవారు మీరే లీస్ట్ ఎందుకున్నారు?" అని నాగార్జున ప్రశ్నిస్తారు. "పక్కవారి వీక్‌నెస్‌తో ఆడుకోవడం నీ గేమా? అంటూ గీతూ అడుగుతారు. ఇందుకు గీతూ నేనుండే సీజన్ బాగా ఆడాలని అందర్నీ రెచ్చగొట్టాను" సార్ అంటూ బదులిస్తుంది. "సీజన్ ఆసక్తిగా ఎలా ఉంచాలో బిగ్‌బాస్‌కు బాగా తెలుసు.. ఎవరి గేమ్ వారు ఆడితే సీజన్ ఎక్కడో ఉంటుందని" ఫైర్ అవుతారు.

"సంచాలక్‌గా ఉండి ఆటలో పాల్గొనడానికి నువ్వెవరు?" అంటూ గీతూకు సీరియస్ వార్నింగ్ ఇస్తారు నాగ్. "నీ ఆట బొచ్చులో ఆట అయిందిఠ అంటూ ఆమె పదాలను ఆమెకే అప్పజేప్పుతారు. "ఆ మాట బాగుందా.. బాగోలేదుగా.. నీకు కోపం వస్తే కామన్ సెన్స్ అన్నీ వదిలేస్తావ్.. గీతూ నువ్వు శిక్షకు అర్హురాలివి" అంటూ నాగార్జున స్పష్టం చేస్తారు.

సంచాలక్‌గా ఉన్న గీతూ.. చెత్త గేమ్‌తో ఈ వారం అందరి దృష్టిలోనూ పడింది. సంచాలక్‌గా గేమ్ ఆడటంపై నెటిజన్లు ఆమెను ఫుల్‌గా ట్రోల్ చేశారు. అంతటితో ఆగకుండా బిగ్‌బాస్ షోను, నాగార్జున కూడా వదిలిపెట్టకుండా మీమ్స్‌ను ట్రెండ్ చేశారు. గీతూ.. బిగ్‌బాస్ దత్తపుత్రిక అంటూ ఫైర్ అయ్యారు. దీంతో వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున రంగంలోకి దిగి గీతూకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఫెమినిస్టు ఎలిమినేట్..

ఇక ఈ వారం ఎలిమినేషన్ చూసుకుంటే సోషల్ మీడియాలో లీకుల వీరుల సమాచారం ప్రకారం ఆర్జే సూర్య ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. చాలా వారాల తర్వాత నామినేషన్ లోకి వచ్చిన సూర్య.. హౌస్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు ప్రేక్షకులు భావించారు. అంతేకాకుండా మొదట్లో ఆరోహి, తర్వాత ఇనాయాకు పులిహోర కలపడమే లక్ష్యంగా ఉండటంతో ఆడియెన్స్ అతడికి పెద్దగా ఓట్లు వేయలేదు.

Whats_app_banner

సంబంధిత కథనం