Ghost Nagarjuna Training: ఘోస్ట్ కోసం నాగార్జున ట్రైనింగ్ చూశారా.. వీడియో
Ghost Nagarjuna Training: ఘోస్ట్ మూవీ కోసం నాగార్జున తీసుకున్న ట్రైనింగ్‌కు సంబంధించిన వీడియో గురువారం (సెప్టెంబర్ 22) రిలీజైంది. ఫైట్ సీక్వెన్స్ కోసం అతడు ఎంతలా కష్టపడ్డాడో ఈ వీడియోలో చూడొచ్చు.
Ghost Nagarjuna Training: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటిస్తున్న మూవీ ఘోస్ట్. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో కలిసి అతడు ఈ మూవీ చేస్తున్నాడు. మొదటి నుంచీ కాస్త డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను మెప్పించే అలవాటు ఉన్న ప్రవీణ్.. ఈ మూవీతో నాగార్జునకు మరో సక్సెస్ కచ్చితంగా ఇస్తాడన్న అంచనా ఇండస్ట్రీలో ఉంది.
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం నాగార్జున స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న వీడియో గురువారం (సెప్టెంబర్ 22) రిలీజైంది. ఇందులో మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం నాగ్ కసరత్తులు చేయడం చూడొచ్చు. కత్తిసాముతోపాటు డిఫరెంట్ గన్స్‌ను ఎలా వాడాలన్నదానిపై నాగార్జున ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. మూవీలోని సీన్స్‌తోపాటు వాటికోసం నాగార్జున తీసుకున్న ట్రైనింగ్ విజువల్స్‌ను ఈ వీడియోలో చూపించారు.
ఈ ఘోస్ట్ మూవీ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులోనే ప్రవీణ్ సత్తారు తనదైన మార్క్ చూపించి మూవీపై అంచనాలు పెంచేశాడు. తాజాగా నాగార్జున ట్రైనింగ్ వీడియోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగ్‌తోపాటు ఈ మూవీలో ఫిమేల్ లీడ్‌లో కనిపిస్తున్న సోనల్ చౌహాన్ కూడా కఠినమైన ట్రైనింగ్ తీసుకోవడం చూడొచ్చు.
ఘోస్ట్ మూవీలో హీరోహీరోయిన్లు కత్తులు, గన్స్ పట్టుకోవడంతోపాటు వివిధ స్టంట్స్ ఎలా చేశారో ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ప్రవీణ్ సత్తారు మరోసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో కూడా ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. పక్కా యాక్షన్ ప్యాక్డ్ సీన్స్‌తో మూవీ అలరించబోతోంది. ఈ ఘోస్ట్ సినిమాలో నాగార్జున, సోనల్ చౌహాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్లుగా కనిపిస్తున్నారు.
ఈ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఇక సెప్టెంబర్ 25న మూవీ టీమ్ ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్‌కు కర్నూలు వేదిక కానుంది.