The Ghost Pre Release Event: ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?-the ghost pre release event will held at kurnool on 2022 september 23 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Ghost Pre Release Event: ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

The Ghost Pre Release Event: ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

Maragani Govardhan HT Telugu
Sep 22, 2022 10:28 AM IST

The Ghost Pre Release Event date: కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో నిర్వహించనున్నారు. ఈ సినిమాను అక్టోబరు 5న విడుదల చేయనున్నారు.

ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఫిక్స్
ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఫిక్స్ (Twitter)

The Ghost Pre Release Event: బంగార్రాజు సినిమాతో ఈ ఏడాది ఆరంభంలో సూపర్ సక్సెస్ అందుకున్నారు నాగార్జున. దీంతో వరుస పెట్టి సినిమాలతో పాటు బిగ్‌బాస్‌తోనూ ఫుల్ బిజీగా మారారు. ప్రస్తుతం ఆయన హీరోగా.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది. సోనాల్ చౌహాన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది.

ప్రస్తుతం ది ఘోస్ట్ ప్రచార కార్యక్రమాలను చిత్రబృందం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 25న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. కర్నూలులోని ఎస్టీబీసీ మైదానంలో ఈ సినిమా ముందస్తు వేడుకను నిర్వహించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకకు హీరో నాగార్జునతో పాటు చిత్రబృందమంతా హాజరు కానున్నట్లు తెలిపారు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సోనాలి నారంగ్, పుశ్కర్ రామ్ మోహనరావు, శరత్ మారార్ నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా చేస్తోంది. భరత్-సౌరభ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ముకేశ్ జీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

ఇటీవలే ది ఘోస్ట్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూస్తే నాగార్జున ఖడ్గం పట్టుకుని చేసే పోరాటాలు, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆయన ఎందుకు ఖడ్గం పట్టుకున్నారు? ఆయన చేసే ఆపరేషన్ ఎంటి లాంటి విషయాలు తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే. దసరా కానుకగా అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

IPL_Entry_Point

సంబంధిత కథనం