Nagarjuna The Ghost First Single: ది ఘోస్ట్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది - స్టైలిష్ లుక్ లో నాగార్జున-nagarjuna the ghost movie first single lyrical video out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nagarjuna The Ghost Movie First Single Lyrical Video Out

Nagarjuna The Ghost First Single: ది ఘోస్ట్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది - స్టైలిష్ లుక్ లో నాగార్జున

HT Telugu Desk HT Telugu
Sep 16, 2022 04:53 PM IST

Nagarjuna The Ghost First Single: నాగార్జున హీరోగా న‌టించిన ది ఘోస్ట్ సినిమా ఫ‌స్ట్ సింగిల్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ డ్యూయెట్‌లో నాగార్జున స్టైలిష్ గా క‌నిపించారు.

నాగార్జున, సోనాల్ చౌహాన్
నాగార్జున, సోనాల్ చౌహాన్ (twitter)

Nagarjuna The Ghost First Single: నాగార్జున హీరోగా న‌టించిన ది ఘోస్ట్ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ లిరిక‌ల్ వీడియోను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. నీలి నీలి సంద్రం నింగిలోని మేఘం నిన్ను చేర‌మంది వేగం అంటూ రొమాంటిక్ మెలోడీగా సాగిన ఈ లిరిక‌ల్ వీడియోలో నాగార్జున స్టైలిష్‌గా క‌నిపిస్తుండ‌గా...సోనాల్ చౌహాన్ గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటోంది. భ‌ర‌త్‌, సౌర‌భ్ సంగీతాన్ని అందించారు.

క‌పిల్ క‌పిల‌న్, ర‌మ్య బెహ‌రా ఈ పాట‌ను ఆల‌పించారు. కృష్ణ‌మాదినేని సాహిత్యాన్ని అందించారు. ఈ ఫ‌స్ట్ సింగిల్‌తో సినిమా మ్యూజిక్ ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. ఇందులో విక్ర‌మ్ అనే గూఢ‌చారిగా నాగార్జున క‌నిపించ‌బోతున్నారు. అదితి అనే చిన్నారితో పాటు ఆమె ఫ్యామిలీని అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియా నుంచి కాపాడ‌టానికి అత‌డు చేసే పోరాటం నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ద‌స‌రా బ‌రిలో ది ఘోస్ట్ తో పాటు చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ నిల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

సోనాల్ మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌....

ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇందులోని ఓ కీల‌క‌మైన యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం సోనాల్ చౌహాన్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న‌ద‌ట‌. ఈ శిక్ష‌ణ‌లో ఆమె పాదం ఫ్రాక్చర్ కావడంతో చిత్ర యూనిట్ సోనాల్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లు తెలిసింది.

ట్రైనింగ్ ఆపేయ‌డ‌మే కాకుండా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు ఆమెకు సూచించినట్లు తెలిసింది. కానీ గాయాన్ని లెక్కచేయకుండా సోనాల్ ట్రైనింగ్ పూర్తిచేయడమే కాకుండా యాక్ష‌న్ సీక్వెన్స్ షూటింగ్ లో పాల్గొన్న‌ట్లు తెలిసింది. ఆమె అంకిత‌భావానికి చిత్ర యూనిట్ స‌భ్యులు ఫిదా అయిన‌ట్లు స‌మాచారం. త‌మ మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌కు సంబంధించిన ప‌లు ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నది సోనాల్ చౌహాన్.

IPL_Entry_Point