తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naa Saami Ranga Ott: పాపులర్ ఓటీటీలో నాగార్జున నా సామిరంగ.. ఎన్ని రోజులకు స్ట్రీమింగ్ అంటే?

Naa Saami Ranga OTT: పాపులర్ ఓటీటీలో నాగార్జున నా సామిరంగ.. ఎన్ని రోజులకు స్ట్రీమింగ్ అంటే?

Sanjiv Kumar HT Telugu

14 January 2024, 9:14 IST

google News
  • Naa Saami Ranga OTT Release: అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు విడుదల కానున్న నేపథ్యంలో నా సామిరంగ ఓటీటీ రిలీజ్ డేట్, డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ వివరాలు ఆసక్తిగా మారాయి.

పాపులర్ ఓటీటీలో నాగార్జున నా సామిరంగ.. ఎన్ని రోజులకు స్ట్రీమింగ్ అంటే?
పాపులర్ ఓటీటీలో నాగార్జున నా సామిరంగ.. ఎన్ని రోజులకు స్ట్రీమింగ్ అంటే?

పాపులర్ ఓటీటీలో నాగార్జున నా సామిరంగ.. ఎన్ని రోజులకు స్ట్రీమింగ్ అంటే?

Naa Saami Ranga OTT Streaming: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగార్జున. టాలీవుడ్ మన్మథుడు, కింగ్‌గా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. మొన్నటి వరకు బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో హోస్టుగా అదరగొట్టిన కింగ్ నాగార్జున తాజాగా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. ఇందులో నాగ్‌కు జోడీగా అమిగోస్ బ్యూటి ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది.

సంక్రాంతి బరిలో

నా సామిరంగ చిత్రంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న నాగార్జున నా సామిరంగ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న ఆదివారం విడుదల కానుంది. అంటే, సంక్రాంతి 2024 బరిలో మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైంధవ్ చిత్రాలతో పాటు నాగార్జున నా సామిరంగ మూవీ పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ

ఈ నేపథ్యంలో నా సామిరంగ ఓటీటీ డీల్, పార్టనర్ విషయాలు లీక్ అవడం ఆసక్తిగా మారింది. నా సామిరంగ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు ఇప్పటికే సమాచారం అందింది. నా సామిరంగ డిజిటల్ రైట్స్ కోసం మూవీ నిర్మాతలకు డిస్నీ హాట్ స్టార్ భారీ మొత్తంలో డబ్బు చెల్లించిందని తెలుగు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో వైరల్ అవుతోంది.

45 రోజుల తర్వాతే

ఇక నా సామిరంగ సినిమాను థియేటర్‌లో విడుదలైన 45 రోజుల తర్వాతే ఓటీటీలోకి విడుదల చేయనున్నారు. అంటే, వచ్చే నెల ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి నెలలో నా సామిరంగ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే, ఒక్కసారి ఓటీటీ సంస్థలు సినిమా హక్కులు కొనుక్కుంటే వాటిని విడుదల చేసే నిర్ణయం వారి చేతుల్లోనే ఉంటుందని టాక్. కొన్నిసార్లు నిర్మాతలతో చర్చించి కూడా ఎప్పుడూ ఓటీటీలో రిలీజ్ చేయాలో ప్లాన్ చేసుకుంటారు.

ఫిబ్రవరి లేదా మార్చి

ప్రస్తుత సమాచారం మేరకు అయితే.. నా సామిరంగ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదా మార్చి మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారు. నా సామిరంగ మూవీ టాక్, బాక్సాఫీస్ కలెక్షన్స్ దృష్ట్యా విడుదల తేదీలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే నా సామిరంగ సినిమాలో నాగ్‌కు జోడీగా ఆషికా రంగనాథ్ నటించగా.. రుక్సార్ దిల్లాన్, మిర్నా మీనన్ కూడా హీరోయిన్లుగా చేశారు.

రజనీకాంత్ కోడలుగా

నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అల్లరి నరేష్‌కు జోడీగా రెండోసారి మిర్నా మీనన్ జత కట్టింది. వీళ్లిద్దరు ఇదివరకు ఉగ్రం మూవీలో హీరోహీరోయిన్లుగా నటించారు. జైలర్ మూవీలో రజనీకాంత్‌కు కోడలుగా మిర్నా మీనన్ నటించి అలరించింది. ఇక రాజ్ తరుణ్‌కు జోడీగా రుక్సార్ దిల్లాన్ నటించింది. వీరిద్దరిది సినిమాలో 80వ కాలం నాటి ప్రేమకథగా చూపించనున్నారు.

తదుపరి వ్యాసం