తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagarjuna: 3 నెలల్లో సినిమా తీయడం ఎలా పుస్తకం రాసిస్తాం.. నాగార్జున కామెంట్స్ వైరల్

Nagarjuna: 3 నెలల్లో సినిమా తీయడం ఎలా పుస్తకం రాసిస్తాం.. నాగార్జున కామెంట్స్ వైరల్

Sanjiv Kumar HT Telugu

12 January 2024, 9:51 IST

  • Naa Saami Ranga: అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. ఇటీవల జరిగిన నా సామిరంగ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మూడు నెలల్లో సినిమా ఎలా తీయాలో తెలిసిలా ఒక పుస్తకం రాసిస్తాం అని నాగార్జున ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవి వైరల్‌గా మారాయి.

3 నెలల్లో సినిమా తీయడం ఎలా పుస్తకం రాసిస్తాం.. నాగార్జున కామెంట్స్ వైరల్
3 నెలల్లో సినిమా తీయడం ఎలా పుస్తకం రాసిస్తాం.. నాగార్జున కామెంట్స్ వైరల్

3 నెలల్లో సినిమా తీయడం ఎలా పుస్తకం రాసిస్తాం.. నాగార్జున కామెంట్స్ వైరల్

Nagarjuna Naa Saami Ranga: కింగ్ నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా నా సామిరంగ. ఈ మూవీతో కొరియోగ్రాఫర్‌‌గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ బిన్ని దర్శకుడిగా మారారు. దీంతో డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. పొరింజు మరియమ్ జోస్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన నా సామిరంగ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నా సామిరంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

నా సామిరంగ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున ఆసక్తికర కామెంట్స్ చేశారు. "అందరికీ, అక్కినేని అభిమానులకు నమస్కారం. సంక్రాంతి అంటే సినిమా పండగ. టీవీలు వచ్చినపుడు సినిమాలు ఇంక చూడరని అన్నారు. తర్వాత ఫోన్లు వచ్చాయి చూడరని అన్నారు. డీవీడీలు, డిజిటల్ వచ్చిన తర్వాత చూడరని అన్నారు. కానీ, ప్రేక్షకులు సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఓటీటీ వచ్చిన తర్వాత చూడరు అన్నారు. కానీ చూస్తూనే ఉన్నారు" అని నాగార్జున అన్నారు.

"కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు. పండగ రోజున సినిమా చూడటం అనేది ఆనవాయితీ. నాలుగు సినిమాలు వచ్చినా చూస్తారు. మన తెలుగువారికి సంక్రాంతి అంటే సినిమా పండగ. ఈ సంక్రాంతి నాలుగు సినిమాలు వస్తున్నాయి. పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ‘గుంటూరుకారం’తో వస్తున్న మహేశ్ బాబుకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. బాల నటుడిగా తేజని చూశాను. ఇప్పుడు తను హీరోగా హను-మాన్ అనే సినిమాతో వస్తున్నాడు. తనకి ఆల్ ది బెస్ట్" అని నాగ్ తెలిపారు.

"మా వెంకీ 75వ చిత్రంగా సైంధవ్ తో వస్తున్నారు. తనకి ఆల్ ది బెస్ట్. మేము ‘నా సామిరంగ’తో వస్తున్నాం. మేము ఇచ్చే సినిమా మీకు నచ్చితే ఎంత ఆదరిస్తారో అలా రెండు పండగలు చూశాం. మీకు సినిమా నచ్చుతుంది. ఈ పండక్కి కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మా సినిమాకి స్టార్ కీరవాణి గారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పాటలు ఇచ్చారు. ఈ సినిమాని మూడు నెలల్లో పూర్తి చేశామంటే ఆయన మా వెనుక ఉంది ముందుకు నడిపించారు" అని నాగార్జున పేర్కొన్నారు.

"సినిమా స్టార్ట్ అవ్వకముందే మూడు పాటలు, ఒక యాక్షన్ సీక్వెన్స్ కి నేపథ్య సంగీతం చేసి మా ముందు పెట్టారు. కీరవాణి గారు లాంటి టెక్నిషియన్ ఉంటే ఏదైనా సాధిస్తాం. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ వెన్నుతట్టి ఆయన వెనుక ఉండి కీరవాణి గారు, చంద్రబోస్ గారు ప్రోత్సహించారు. మూడు నెలలు పాటు టీం అంత ఒక ఫ్యామిలీలా ఉండి ఈ సినిమా తీశాం. మూడు నెలల్లో సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. కానీ చేశాం. ఈ కష్టం ఫలించిందా లేదా అనేది జనవరి 14న తెలుస్తుంది" అని నాగ్ వెల్లడించారు.

"సెప్టెంబర్ 20 నాన్న గారి పుట్టిన రోజున ఆయనకి వందేళ్లు వచ్చిన రోజున ఆయన విగ్రహం ఆవిష్కరించినపుడు ఆయనకి నమస్కరించుకునప్పుడు ఆయన నా మనసులో చెప్పిన మాట ‘వెళ్లి సినిమా చేయ్.. నా సామిరంగ’ అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతో సినిమాని పూర్తి చేశాం. ఈ టీం గురించి, వాళ్లు పడిన కష్టం గురించి ఇప్పుడు చెప్పను. సక్సెస్ మీట్ లో చెప్తాను" అని నాగార్జున చెప్పుకొచ్చారు.

"మూడు నెలల్లో సినిమా ఎలా తీయొచ్చు అనేది ఒక పుస్తకం కూడా రాసిస్తాం. సినిమా విడుదల సందర్భంగా అక్కినేని అభిమానులకు ఒక మాట చెప్పాలి. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీసు కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు" అని నా సామిరంగ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున ఆసక్తికరంగా మాట్లాడారు. దీంతో నాగార్జున కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం