Naa Saami Ranga Teaser: ఆడేమైన కుర్రాడా.. నాగార్జునపై ఆషిక కామెంట్.. నా సామిరంగ టీజర్ అదుర్స్-naa saami ranga teaser released and nagarjuna mass action ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naa Saami Ranga Teaser: ఆడేమైన కుర్రాడా.. నాగార్జునపై ఆషిక కామెంట్.. నా సామిరంగ టీజర్ అదుర్స్

Naa Saami Ranga Teaser: ఆడేమైన కుర్రాడా.. నాగార్జునపై ఆషిక కామెంట్.. నా సామిరంగ టీజర్ అదుర్స్

Sanjiv Kumar HT Telugu
Dec 17, 2023 06:44 PM IST

Naa Saami Ranga Teaser: నాగార్జున, ఆషిక రంగనాథ్ హీరో హీరోయిన్లుగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించిన సినిమా నా సామిరంగ. తాజాగా నా సామిరంగ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నా సామిరంగ టీజర్ విశేషాల్లోకి వెళితే..

ఆడేమైన కుర్రాడా.. నాగార్జునపై ఆషిక కామెంట్.. నా సామిరంగ టీజర్ అదుర్స్
ఆడేమైన కుర్రాడా.. నాగార్జునపై ఆషిక కామెంట్.. నా సామిరంగ టీజర్ అదుర్స్

కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నా సామిరంగ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 2024 సంక్రాంతి పండుగకి ఈ మూవీ విడుదల కానుంది. విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్ తో పాటు ఫ్రెండ్షిప్ కూడా కోర్ ఎలిమెంట్‌గా నిలవనుందని ఇటీవల విడుదల చేసిన అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఇందులో భాగంగానే తాజాగా నా సామిరంగ టీజర్‌ను విడుదల చేశారు. నాగార్జున గురించి ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్ మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆడేమైన కుర్రాడు అనుకుంటున్నాడా.. తగ్గమను అని ఆషిక చెప్పే డైలాగ్ హైలెట్ గా ఉంది.

కింగ్ నాగార్జున మామిడి తోట ఫైట్ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. నాగ్, ఆషికా పదేళ్లుగా మాట్లాడుకోరు. కానీ కళ్లతో కమ్యునికేట్ చేసుకుంటారు. యంగ్ ఏజ్ లో వీరిద్దరి ప్రేమ, నాగ్ తన స్నేహితులైన అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లతో స్నేహం చాలా అద్భుతంగా టీజర్ లో ప్రజెంట్ చేశారు.

ముఖ్యంగా టీజర్ చివరి సగం మాస్ స్టఫ్, యాక్షన్స్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెచ్చింది. రొమాన్స్, స్నేహం, యాక్షన్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు. నాగార్జున తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అలరించారు. నాగార్జున గోదావరి యాస చాలా బాగుంది. ఆషికతో అతని కెమిస్ట్రీ అలరించింది. నాగ్, నరేష్, రాజ్ తరుణ్ స్నేహం సినిమాకు మరొక ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నా సామిరంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పించగా.. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి తన ఆకర్షణీయమైన స్కోర్‌తో డిఫరెంట్ మూడ్‌లను సెట్ చేసారు. నాగ్ ఇంట్రోకి ట్రెండీ, జాజీ మ్యూజిక్ పాత్రను మరింత అద్భుతంగా మలిచింది.

టీ20 వరల్డ్ కప్ 2024