N62 Announcement: బార్‌లో కూర్చొని సినిమా అనౌన్స్‌మెంట్.. అల్లరి నరేష్ 62వ మూవీ ప్రోమో చూశారా?-n62 promo out as allari naresh movie announcement made in a bar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  N62 Announcement: బార్‌లో కూర్చొని సినిమా అనౌన్స్‌మెంట్.. అల్లరి నరేష్ 62వ మూవీ ప్రోమో చూశారా?

N62 Announcement: బార్‌లో కూర్చొని సినిమా అనౌన్స్‌మెంట్.. అల్లరి నరేష్ 62వ మూవీ ప్రోమో చూశారా?

Hari Prasad S HT Telugu
Jun 30, 2023 11:28 AM IST

N62 Promo: బార్‌లో కూర్చొని సినిమా అనౌన్స్‌మెంట్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు అల్లరి నరేష్ 62వ మూవీని అలాగే అనౌన్స్ చేశారు. ఇప్పుడీ ప్రోమో వైరల్ అవుతోంది.

అల్లరి నరేష్
అల్లరి నరేష్

N62 Promo: భిన్నమైన కథలతో సినిమాలు తీయడమే కాదు.. ఆ సినిమాలను అనౌన్స్ చేయడం నుంచి ప్రమోషన్ల వరకూ కూడా కాస్త డిఫరెంట్ ఫీల్ వచ్చేలా చేస్తున్నారు ఈ కాలం ఫిల్మ్ మేకర్స్. తాజాగా అల్లరి నరేష్ 62వ సినిమా అనౌన్స్‌మెంట్ కు సంబంధించిన వీడియో కూడా అలాగే ఉంది. ఈ వీడియోను శుక్రవారం (జూన్ 30) మేకర్స్ రిలీజ్ చేశారు.

ఓ బార్లో స్టోరీ సిట్టింగ్ లు చేయడం, అక్కడికే ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, హీరో రావడం.. చివరికి అంతా ఓకే అన్న తర్వాత హీరో కూడా చేసేద్దామని అనడం ఈ వీడియోలో చూడొచ్చు. సోలో బతుకే సో బెటర్ సినిమా డైరెక్టర్ సుబ్బు మంగదేవి ఈ ఎన్62ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ను అతడు కాస్త డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశాడు.

ఈ వీడియోలో మొదట ఛార్లీ ఛాప్లిన్, జోకర్ ఫొటోలను చూపిస్తూ మొదలవుతుంది. కంప్యూటర్ ముందుకు కూర్చున్న అల్లరి నరేష్ ఏదో చూస్తుంటాడు. ఆ సమయంలో అతనికి డైరెక్టర్ సుబ్బు నుంచి కాల్ వస్తుంది. సినిమా స్టోరీ చెప్పాలని అతడు అంటాడు. ఆఫీస్ లో కలుద్దామంటే వద్దంటాడు. కాఫీ షాప్ కి కూడా నో చెబుతాడు. గుళ్లో కలుద్దామా అంటే అసలు వద్దంటాడు.

మరి ఎక్కడ కలుద్దామని నరేష్ అడిగేలోపు అతడు ఓ బార్ లో ప్రత్యక్షమవుతాడు. చుట్టూ మందుబాబులు బిజీబిజీగా ఉంటారు. ఇక్కడ కథ చెప్పడమేంటని డైరెక్టర్ ను అడుగుతాడు నరేష్. ఎన్నో కథలు ఎంతో ఓపెన్ గా మాట్లాడుకునే చోటు సార్ ఇది అంటూ సుబ్బు మొదలుపెడతాడు. మూర్ఖత్వం బోర్డర్ దాటేసినోడి కథ అంటూ చెబుతాడు.

దీనికి ప్రొడ్యూసర్ కావాలి కదా అంటు నరేష్. వెంటనే పక్కనే కూర్చున్న ప్రొడ్యూసర్.. ఆ పక్కనే కూర్చొన్న మిగతా టెక్నీషియన్లంతా వస్తారు. దీంతో చివరాఖరికి నరేష్ కూడా సరే చేసేద్దాం అంటాడు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

WhatsApp channel

టాపిక్